• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గంగ జాతరను విజయవంతం చేద్దాం: మున్సిపల్ ఛైర్మన్

CTR: ఈనెల 10, 11 తేదీల్లో జరిగే శ్రీసుగుటూరు గంగమ్మ జాతర ఏర్పాట్లపై మున్సిపల్ ఛైర్మన్ ఆలీ బాషా సమీక్ష నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జాతర నిర్వహణ కోసం మున్సిపాలిటీ తరఫున రూ. 10 లక్షలు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

March 5, 2026 / 09:36 AM IST

8 నెలలుగా మూతపడిన ఎస్‌బీఐ ఏటీఎం

ASR: ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో ఎస్‌బీఐ ఏటీఎం సుమారు ఎనిమిది నెలలుగా పనిచేయడం లేదు. దీంతో స్థానిక వినియోగదారులు, పర్యాటకులు డబ్బులు ఉపసంహరించుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ఇతర ప్రైవేట్ ఏటీఎంలు కూడా సక్రమంగా పనిచేయక ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. పాత యంత్రాల కారణంగా సమస్య ఏర్పడిందని, కొత్త ఏటీఎంలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

March 5, 2026 / 09:36 AM IST

ఆశా వర్కర్స్‌ను అడ్డుకున్న పోలీసులు

W.G: ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి వెళ్తున్న ఆశా వర్కర్లను నరసాపురంలో పోలీసులు అడ్డుకున్నారు. గురువారం రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద భారీగా మోహరించిన పోలీసులు వారిని రైలు ఎక్కకుండా నిలువరించారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం వెళ్తున్న తమను అడ్డుకోవడంపై ఆశా వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ స్టేషన్ పరిసరాల్లో ఆందోళన చేపట్టారు.

March 5, 2026 / 09:35 AM IST

‘మాకు న్యాయం చేయండి’

VSP: శ్రీహరిపురం జీవీఎంసీ వాణిజ్య సముదాయంలో దుకాణదారులు ఆందోళన చేపట్టారు. ఏళ్లుగా అద్దెలు చెల్లిస్తూ దుకాణాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్కింగ్ లేకుండా కాయగూరలు, పండ్ల బండ్లు ఉండడంతో వ్యాపారం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. 60 దుకాణాల్లో 30 ఖాళీగా ఉండటంతో జీవీఎంసీకి సంవత్సరానికి రూ.40 లక్షల నష్టం వస్తోందని ఆరోపించారు.

March 5, 2026 / 09:34 AM IST

ఇలా ఐతే ప్రయాణం ఎలా..!

PPM: సీతంపేటమండలం దాసుగుమ్మడ నుంచి అంబలిగండివెళ్లే రహదారి రాళ్లు తేలి అధ్వానంగా దర్శనమిస్తోంది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే గిరిజనులు అవస్థలు పడుతున్నారు. అటవీ ఉత్పత్తులు మార్కెట్‌కు తరలించడానికి, రోగులను అంబులెన్స్‌లో ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి నరకం చూస్తున్నారు. వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

March 5, 2026 / 09:32 AM IST

వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు

VKB: వ్యవసాయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పద్ధతులను అవలంభించాలని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ అన్నారు. బుధవారం డ్రోన్ ఆపరేటింగ్‌పై పైలెట్ ప్రాజెక్టుగా శిక్షణ ఇచ్చారు. సాంకేతిక ఆధారిత జీవనోపాధిని పొందేందుకు అవసరమైన మెలకువలు నేర్చుకోవాలని తెలిపారు. డ్రోన్ల నిర్వహణపై ఆరుగురికి శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.

March 5, 2026 / 09:32 AM IST

జిమ్ వెళ్తున్నారా? వర్కవుట్ ముందు ఇవి తింటే చాలు!

సప్లిమెంట్స్ ఇష్టం లేని వారికి ఈ సహజ ఆహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. అరటిపండు+పీనట్ బటర్ తక్షణ శక్తిని ఇస్తే, బ్లాక్ కాఫీ వర్కవుట్‌పై ఏకాగ్రతను, మెటబాలిజంను పెంచుతుంది. ఓట్స్ ఎక్కువ సేపు అలసిపోకుండా ఎనర్జీని అందిస్తాయి. ఖర్జూరాలు & నట్స్ ఎనర్జీ బూస్టర్లుగా పనిచేస్తాయి. వ్యాయామానికి 30-45 నిమిషాల ముందు వీటిని తీసుకుంటే జిమ్‌లో మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

March 5, 2026 / 09:32 AM IST

త్వరలోనే ముగియనున్న సర్పంచ్‌ల పదవీకాలం

E.G: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవీకాలం గడువు నెల రోజుల్లో ముగుస్తుంది. 2021 ఫిబ్రవరి 9,13,19,21 తేదీలలో నాలుగు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో గెలిచినప్పటికీ అధికారం మాత్రం ఆ ఏడాది ఏప్రిల్ 3న చేపట్టారు. ఏప్రిల్ రెండవ తేదీన వీరు మాజీలు అవుతారు. 3వ తేదీ నుంచి ప్రత్యేక అధికారులు బాధ్యతలు చేపట్టనున్నారు.

March 5, 2026 / 09:30 AM IST

‘వారసత్వాన్ని పరిరక్షించడం ప్రధాన లక్ష్యం’

PLD: రాష్ట్ర పర్యాటక రంగాన్ని 2027 నాటికి దేశంలో నంబర్–1గా నిలపాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక టూరిజం పాలసీని ప్రకటించిందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. బుధవారం అసెంబ్లీలో పర్యాటక శాఖ బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. సాంస్కృతిక – చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

March 5, 2026 / 09:30 AM IST

వైకుంఠ రథం లేక ట్రాక్టర్‌లో..

SRCL: సిరిసిల్ల మున్సిపల్ పరిధి చిన్నబోనాలలో మృతదేహాన్ని ట్రాక్టర్‌లో తరలించడం విమర్శలకు దారితీసింది. అదే వార్డుకు చెందిన రేగుల యాదగిరి మృతిచెందగా, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. వైకుంఠ రథం కోసం పలు సార్లు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంతో ట్రాక్టర్‌లో మృతదేహాన్ని తరలించినట్లు స్థానిక కౌన్సిలర్ బోల్గాం వైష్ణవి తెలిపారు.

March 5, 2026 / 09:29 AM IST

వేట్లపాలెం ఘటన.. 26కి చేరిన మృతుల సంఖ్య

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. కాకినాడ GGHలో చికిత్స పొందుతూ కాతేటి శ్రీను అనే వ్యక్తి మృతిచెందాడు. దీంతో బాణసంచా ప్రమాదంలో మృతుల సంఖ్య 26కు చేరింది. మరో ముగ్గురు బాధితులు 90 శాతం గాయాలతో చికిత్స పొందుతున్నారు.

March 5, 2026 / 09:28 AM IST

‘లెనిన్’పై సాలిడ్ అప్‌డేట్

అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘లెనిన్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ వచ్చే వారం ప్రారంభం కానుందట. ఈ షెడ్యూల్ పూర్తికాగానే అఖిల్ డబ్బింగ్ పనులు మొదలుపెట్టనున్నట్లు సమాచారం. విశేషమేమిటంటే, చిత్తూరు యాసలో సాగే తన పాత్రకు అఖిల్ స్వయంగా డబ్బింగ్ చెప్పనున్నాడట.

March 5, 2026 / 09:28 AM IST

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

WGL: కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉద్యోగాల పేరుతో కొందరు నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులు హెచ్చరించారు. నిర్మాణ బాధ్యతలను రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌కు అప్పగించగా, సోషల్ మీడియాలో కాంట్రాక్ట్ ఉద్యోగాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎవరూ నమ్మవద్దని రైల్వే అధికారులు సూచించారు.

March 5, 2026 / 09:28 AM IST

ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని కాపాడిన పోలీస్

కృష్ణా: మచిలీపట్నం బలరాంపేటకు చెందిన ఆలగుంట్ల అభి (22) అనే యువకుడు ఇంటి వద్ద నుంచి చనిపోతాను అని చెప్పి బయటకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆర్‌పేట పోలీసుల సమాచారంతో గుడివాడ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్సై షరీఫ్ స్పందించి, రామవరప్పాడు రైల్వే స్టేషన్ వద్ద యువకుడిని చేజించి నిన్న కుటుంబ సభ్యులకు అప్పగించారు.

March 5, 2026 / 09:28 AM IST

చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవు: సీఐ

BDK: చుంచుపల్లి ప్రశాంతినగర్‌లో చోటుచేసుకున్న భూవివాదంపై విచారణకు వెళ్లిన పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన పులిచెర్ల ఆదిత్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు 2 టౌన్‌ సీఐ ప్రతాప్‌ తెలిపారు. విచారణ సమయంలో పోలీసులపై తిరగబడి, అనుచితంగా ప్రవర్తించినందుకు ఈ చర్య తీసుకున్నామన్నారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

March 5, 2026 / 09:28 AM IST