SRCL: సిరిసిల్ల మున్సిపల్ పరిధి చిన్నబోనాలలో మృతదేహాన్ని ట్రాక్టర్లో తరలించడం విమర్శలకు దారితీసింది. అదే వార్డుకు చెందిన రేగుల యాదగిరి మృతిచెందగా, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. వైకుంఠ రథం కోసం పలు సార్లు మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంతో ట్రాక్టర్లో మృతదేహాన్ని తరలించినట్లు స్థానిక కౌన్సిలర్ బోల్గాం వైష్ణవి తెలిపారు.