• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వాసుదేవరెడ్డిని కస్టడీకి తీసుకోనున్న సిట్

AP: మద్యం కేసులో నిందితుడు వాసుదేవరెడ్డిని సిట్ కస్టడీకి తీసుకోనుంది. గుంటూరు జైలులో కస్టడీకి తీసుకుని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించనున్నారు. ఇవాళ, రేపు వాసుదేవరెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. మద్యం కేసులో వాసుదేవరెడ్డి A2 నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.

March 5, 2026 / 09:43 AM IST

జిల్లాలో పుష్కలంగా యూరియా నిల్వలు: కలెక్టర్

BPT: జిల్లాలో రబీ సీజన్‌కు సరిపడా 8, 641 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని బుధవారం కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మార్చి 25 వరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాలు ప్రైవేట్ దుకాణాల్లో నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు. 45 కిలోల యూరియా బస్తా ధర రూ. 266.50 మాత్రమేనని, ఎవరైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

March 5, 2026 / 09:43 AM IST

హార్ట్ ఎటాక్.. జిమ్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

TG: హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. నాగండ్ల అనిల్ చౌదరి(36) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జిమ్‌లో వ్యాయామం చేస్తూ హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. జిమ్‌లో వాష్‌రూమ్‌కి వెళ్లి అనిల్ అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. అక్కడివారు వెంటనే అతనికి CPR చేసినప్పటికీ లాభం లేకపోవడంతో సమీప ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అనిల్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

March 5, 2026 / 09:41 AM IST

’60 లక్షల మెట్రిక్ టన్నుల నెయ్యిలో కల్తీ జరిగింది’

GNTR: 2019-2024 మధ్య 60 లక్షల మెట్రిక్ టన్నుల నెయ్యిలో కల్తీ జరిగిందని, ఇందులో రూ. 240 కోట్ల కుంభకోణం ఉందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. ఎన్డీడీబీ ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్టే, నెయ్యిలో వెజిటబుల్, అనిమల్ ఫ్యాట్ కలిపినట్లు సిట్ నివేదిక కూడా స్పష్టం చేసిందని ఆయన పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈ ఆరోపణలు చేశారు.

March 5, 2026 / 09:41 AM IST

బీసీ శ్మశాన వాటికలో ముళ్లపొదలు తొలగింపు

GDWL: అయిజ మున్సిపాలిటీలోని అంబేడ్కర్ చౌరస్తా ఎదురుగా ఉన్న బీసీ శ్మశాన వాటికలో గురువారం ముళ్లపొదలు తొలగించారు. ఛైర్మన్ సీఎం సురేశ్ ఆదేశంతో 9వ వార్డు కౌన్సిలర్ నరసమ్మ ఆధ్వర్యంలో జేసీబీతో ముళ్లపొదలు తొలగించి, శ్మశాన వాటికను శుభ్రపరచారు. చాలా కాలంగా నిర్వహణ లేక అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి తొలగించారు.

March 5, 2026 / 09:40 AM IST

నేటి నుంచి ఏపూరు గ్రామంలో మద్యం అమ్మకాలు బంద్

NLG: చిట్యాల మండలం ఏపూరులో బెల్ట్ షాపులను శాశ్వతంగా ఎత్తివేయాలని గ్రామ పంచాయతీ పాలకవర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం మహమ్మారి వల్ల యువత పెడదోవ పడుతుండటం, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండటంతో సర్పంచ్ పాలెం మహేష్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. నిర్వాహకులకు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా, వారు కూడా స్వచ్ఛందంగా షాపులు మూసివేసేందుకు అంగీకరించారు.

March 5, 2026 / 09:40 AM IST

రాయదుర్గంలో మహిళా హక్కుల కోసం గళం

ATP: రాయదుర్గంలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం అఖిల భారత మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా సమాఖ్య జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మావతి మాట్లాడుతూ.. మహిళల భద్రత, సమాన హక్కుల విషయంలో ప్రభుత్వాల వైఫల్యాన్ని ఎండగట్టారు. పెరిగిపోతున్న దాడులను అరికట్టడంలో పాలకులు విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

March 5, 2026 / 09:40 AM IST

గుంతను తప్పించబోయి కారు బోల్తా

KRNL: పత్తికొండ మండలం ఆరటికల గుండు గ్రామ సమీపంలోని బ్రిడ్జి వద్ద రోడ్డు సరిగా లేక గుంతను తప్పించబోయి ఇవాళ ఉదయం కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో మహిళతో పాటు నలుగురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే వారిని బయటకు తీశారు. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. ఈ మేరకు రోడ్డు మరమ్మతులు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

March 5, 2026 / 09:40 AM IST

మంత్రి లోకేష్‌ను కలిసిన MLA కుటుంబ సభ్యులు

PPM: ఉండవల్లిలో మంత్రి లోకేశ్ బుధవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో మంత్రి సంధ్యారాణి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మంత్రితో పాటు కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి, పార్వతీపురం, పాలకొండ ఎమ్మెల్యేలు విజయ్ చంద్ర, జయకృష్ణ వారి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. ఈ ఆత్మీయ కలయిక ఎంతగానో ఆనందాన్ని కలిగించిందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

March 5, 2026 / 09:39 AM IST

కలెక్టర్ దృష్టికి నీరు అందక రైతుల ఇబ్బందులు

KMM: కొణిజర్ల మండలం పెద్దగోపతి పంచాయతీ పరిధిలో ఎండిపోతున్న పామ్ చెరువుకు నీటిని విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకుడు ఊటుకూరి రంజిత్ బుధవారం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలిసి వినతిపత్రం అందజేశారు. చెంతనే నీళ్లున్నా చెరువు ఎండిపోతోంది అంటూ రైతుల దీనస్థితిని వివరించారు. సాగునీరు అందక రైతులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.

March 5, 2026 / 09:39 AM IST

‘మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’

కృష్ణా: వేసవిలో నర్సరీలో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డి.ఆర్.డి.ఓ ఉమాదేవి సూచించారు. గురువారం ఆమె పానగల్ మండలంలోని వివిధ నర్సరీలను పరిశీలించారు. వన సేవకులు గ్రామపంచాయతీ కార్యదర్శులు, అధికారుల సమన్వయంతో మొక్కలు పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు. నీరందక మొక్కలు ఎండి పోతే చర్యలు తప్పవు అన్నారు.

March 5, 2026 / 09:38 AM IST

పలు ప్రాంతాల్లో నేడు కరెంటు కట్

PDPL: రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో మేదరి బస్తిలో రోడ్ల వెడల్పు కార్యక్రమం కొనసాగుతోంది. పాత విద్యుత్ స్తంభాలను విద్యుత్ శాఖ అధికారులు తొలగిస్తున్నారు. ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని రాం మందిర్ ఏరియా సబ్ స్టేషన్ అధికారులు తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

March 5, 2026 / 09:38 AM IST

రైతును ముంచిన టమాట పంట.!

MDK: తూప్రాన్ మండలం ఇమాంపూర్ గ్రామంలో రైతు అల్లాడి గణేష్ టమాట పంటను మేకలు, గొర్రెలకు వదిలేశాడు. టమాట ధరలు విపరీతంగా క్షీణించడంతో రవాణా ఖర్చులు రాలేని పరిస్థితి ఏర్పడింది. గణేష్ ఎకరా భూమిలో టమాట పంటను సాగు చేశాడు. ధర లేకపోవడంతో టమాట పంటను వదిలేయగా, మేకలు, గొర్రెలు మేస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు ధరలేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశాడు.

March 5, 2026 / 09:37 AM IST

మహిళా దినోత్సవ వేడుకలకు పోస్టర్ విడుదల

MHBD: జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ గెజిటెడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమం సంబంధించిన వాల్ పోస్టర్‌ను కలెక్టర్ స్నేహ శబరీష్ ఆవిష్కరించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల కోసం క్రీడా పోట్లను నిర్వహించినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు రఫీ తెలిపారు.

March 5, 2026 / 09:36 AM IST

షాపింగ్ కాంప్లెక్స్ స్థల పరిశీలన

VZM: గజపతినగరంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయం ఎదురుగా నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్ స్థలాన్ని డీసీసీబీ ఛైర్మన్ డాక్టర్ కిమిడీ నాగార్జున పరిశీలించారు. ఈ మేరకు సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు. డీసీసీబీ సీఈవో ఉమామహేశ్వరరావు, జీఎం వాసు, డీజీఎం ప్రసాదు, సొసైటీ సీఈవో నారాయణరావు పాల్గొన్నారు.

March 5, 2026 / 09:36 AM IST