GDWL: విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అయిజ మున్సిపల్ ఛైర్మన్ సీఎం సురేష్ పేర్కొన్నారు. గురువారం జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణా తరగతులు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తరగతులు టీచర్లు చెప్పే పాఠ్యాంశాలు శ్రద్ధగా విని, గుర్తుంచుకోవాలన్నారు.
TG: ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుకకు ఆయన హాజరుకానున్నారు. అనంతరం నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్న సీఎం.. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. దీంతో ఇవాళ నగరంలో రాజకీయ సందడి నెలకొంది.
NGKL: బిజినేపల్లి మండలం వసంతపూర్ గ్రామంలో ఈ రోజు ఉదయం సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ నిర్వహించారు. ఈ గ్రామసభలో గ్రామంలో ఏ ఏ పనులు పెండింగ్లో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఈ పనులన్నీ త్వరలోనే పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్, పంచాయతీ కార్యదర్శి భూపతి, ప్రజలు పాల్గొన్నారు.
SDPT: వరి పంటలను నష్టపరుస్తున్న కాండం తొలుచు పురుగు నివారణపై సిరిసిల్ల బాలు జర్మీనన్ రామ్ అగ్రికల్చరల్ కళాశాల విద్యార్థులు రైతులకు అవగాహన కల్పించారు. ఇవాళ సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్‌లో క్షేత్రస్థాయిలో వరి పంటలను పరిశీలించారు. అధిక నత్రజని ఎరువుల వినియోగాన్ని నివారించి క్రమం తప్పకుండా పొలాలను పరిశీలించి పురుగు ఉద్ధృతిని తగ్గించుకోవడానికి గల సలహాలు, సూచనలు చేశారు.
NLG: నిడమనూరు మండం ఎర్రబెల్లి సమీపంలోని గుట్టపై కొలువైన లింగమంతుల స్వామికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. పార్వతీదేవిని వివాహమాడేందుకు శివుడు ఇక్కడ స్వామి రూపంలో వెలిశాడని భక్తుల నమ్మకం. చెంచు వనిత అయిన మాణిక్యాలదేవిని పెళ్లాడేందుకు స్వామి మాయోపాయంతో ఆమెను ఒప్పించి కళ్యాణం చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ఏటా ఈ కొండ వద్ద జాతర నిర్వహిస్తున్నారు.
NZB: బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామంలో ఉపాధి హామీ (NREGS) నిధులతో నూతన సీసీ రోడ్డు పనులను సర్పంచ్ మోహన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో రూ.5 లక్షల నిధులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వార్డు సభ్యులు, గ్రామ కమిటీ ప్రతినిధులు,గ్రామస్థులు పాల్గొని పనులను పర్యవేక్షించారు.
NLR: ఉదయగిరి మండలం గండిపాలెంలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో గురువారం ఆలయ ఛైర్మన్ పాముల రమణయ్య – వెంకటరత్నమ్మ దంపతుల ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి గోత్రనామాలతో అర్చనలు చేయించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
HYD: వరుసగా సంభవిస్తున్న ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. గత 2 నెలల్లో పదుల సంఖ్యలో అగ్నిప్రమాదాలు జరగడం పట్ల ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. బాచుపల్లి ఘటన మరవక ముందే కాటేదాన్‌లో మంటలు చెలరేగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున అగ్నిప్రమాదాలకు ఎక్కువగా అవకాశం ఉందని హైడ్రా, అగ్నిమాపక బృందాలు హెచ్చరిస్తున్నాయి.
HNK: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని కాజీపేట పట్టణం సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో నేడు పోలీస్ జాగృతి కళాబృందం సభ్యులు మూఢ నమ్మకాలు, యువత దురాలవాట్లపై సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించారు. స్థానిక ఎస్సై యాదగిరి గౌడ్ జాగృతి కళాబృందం ప్రదర్శనలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
SKLM: నిబంధనలకు వ్యతిరేకంగా పట్టపగలే అధిక లోడులు ప్రయాణం సాగిస్తున్నందున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. నరసన్నపేట జాతీయ ప్రధాన రహదారిపై గురువారం పాతపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న ఒక భారీ ట్రాక్టర్ రోడ్డు మధ్యగా ఉండిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటువంటివి పునావృతం కాకుండా చూడాలని స్థనికులు అదికారులను కోరుతున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో గత 5 రోజులుగా.. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేవరకద్రలో 38.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. చిన్నచింతకుంట 38.3, భూత్పూర్ 38.2, కోయిలకొండ మండలం పారుపల్లి 38.1, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 37.7, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
AP: రెసిడెన్షియల్ స్కూళ్లలో లక్షా 4 వేలమంది విద్యార్థులు ఉన్నారని మంత్రి DSBV స్వామి వెల్లడించారు. వారికోసం 52 వేల పడకలు కావాల్సి ఉందన్నారు. ‘దశలవారీగా మంచాలు సమకూర్చే విషయం పరిశీలిస్తున్నాం. వసతిగృహాల్లో 96 వేలమంది విద్యార్థులు ఉన్నారు. వారికి ఇంకా 94 వేల మంచాలు అవసరం. పాత భవనాలు కాబట్టి మంచాలు ఉంచే వెసులుబాటు లేదు’ అని మంత్రి వివరించారు.
BPT: లివర్ క్యాన్సర్‌తో బాధపడుతున్న భట్టిప్రోలుకు చెందిన బండారు దేవి వరప్రసాద్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.6 లక్షల ఆర్థిక సాయం (LOC) మంజూరైంది. ఈ మొత్తాన్ని గురువారం గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో బాధితుడి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అందజేశారు. ప్రభుత్వం ఆపదలో ఉన్న వారికి ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.
NLG: నకిరేకల్ మండలం తాటికల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులను గుర్తించి కళ్ళజోడు అందజేస్తామని డాక్టర్ శైలజ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ HM ప్రజ్ఞాపురం వెంకన్న, క్యాంపు కోఆర్డినేటర్ లతీఫ్, వైద్య సిబ్బంది సరిత, ఉపాధ్యాయులు పండుగ తిరుమలయ్య, మార్త రాములు పాల్గొన్నారు.
SKLM: ఎచ్చెర్ల మండలం దోమాం పంచాయితీలోని రోడ్డు రాళ్లు తేలి అధ్వానంగా తయారయింది. ఈ గ్రామస్తులు తోటపాలెం, కొత్తపేట, శ్రీకాకుళం వెళ్లడానికి ఈ మార్గాన్నే ఉపయోగిస్తారు. దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా మారిందని, ప్రమాదాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.