• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయ ఈవోగా వెంకటేశులు బాధ్యతలు

TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈవోగా వెంకటేశులు గురువారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారుల సమక్షంలో ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని అన్నారు. అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

March 5, 2026 / 01:39 PM IST

అయిజలో ట్రాఫిక్ సమస్యతో వాహనదారుల ఇబ్బంది

GDWL: అయిజ పట్టణంలో వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. ప్రధాన కూడళ్లలో తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త బస్టాండ్ ఎదురుగా దుకాణాల ముందు వాహనాలను అడ్డదిడ్డంగా పార్క్ చేయడం సమస్యకు కారణమవుతోంది. వాహనాలు వరుస క్రమంలో నిలిపి ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు సహకరించాలని డ్రైవర్లు కోరుతున్నారు.

March 5, 2026 / 01:39 PM IST

రోడ్డు మరమ్మతులు చేపట్టాలి’

VKB: రోడ్డు గుంతలు పడి నిత్యం ప్రమాదాల బారిన పడి నరకయాతన అనుభవిస్తున్నామని వాహనదారులు పేర్కొంటున్నారు. నవాబ్‌పేట్ మండలం నుంచి ఎల్లకొండ వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతలు పడి వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. రోడ్డు గుంతలను పూడ్చి నిర్మాణం చేపట్టి గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించాలని అధికారులను గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

March 5, 2026 / 01:38 PM IST

చిత్తూరు జిల్లాకు వైసీపీ పరిశీలకుల నియామకం

చిత్తూరు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు వైసీపీ కేంద్ర కార్యాలయం పరిశీలకులను నియమించింది. పుంగనూరుకు జింక చలపతి, పూతలపట్టుకు బాబాజాన్, కుప్పానికి మొగసాల కృష్ణమూర్తి, పలమనేరుకు వెంకటరెడ్డి యాదవ్, చిత్తూరుకు మొగసాల రెడ్డప్ప, నగరికి రాహుల్ రాజారెడ్డి, జీడీ నెల్లూరుకు వల్లివేడు పృథ్వీ రెడ్డిని పరిశీలకులుగా నియమించారు.

March 5, 2026 / 01:38 PM IST

నూతన దుకాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR: ఇబ్రహీంపట్నం రింగు సెంటర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐబీఎం ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్ & మొబైల్స్ దుకాణాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు, గురువారం ఉదయం ప్రారంభించారు. దుకాణ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

March 5, 2026 / 01:38 PM IST

యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న మాస్ బీట్ సాంగ్స్

యూట్యూబ్‌లో ప్రస్తుతం మాస్ బీట్ సాంగ్స్ ట్రెండ్ నడుస్తోంది. రామ్ చరణ్ ‘రైరై రారా’ సాంగ్ 24 గంటల్లోనే 31 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. AR రెహమాన్ మ్యూజిక్, చరణ్ డ్యాన్స్ ప్రేక్షకులను ఫిదా చేశాయి. మరోవైపు నాని ‘ ది ప్యారడైజ్’లోని ఆయా షేర్ పాట సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ పాటలోని నాని లుక్, స్టెప్పులకు యూత్ కనెక్ట్ అయి రీల్స్ చేస్తున్నారు.

March 5, 2026 / 01:38 PM IST

వేం నరేందర్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే

WGL: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో  ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పార్టీకి సంబంధించిన పలు అంశాలపై ఇద్దరూ చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ ఎమ్మెల్యే మురళి నాయక్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

March 5, 2026 / 01:37 PM IST

జీవోలు, సర్వీస్ నిబంధనలతో టీఎస్‌యూటీఎఫ్ డైరీ

SRD: అమీన్‌పూర్‌లో టీఎస్‌యూటీఎఫ్-2026 డైరీని మండల విద్యాధికారి టి.సుధాకర్‌కు అందజేశారు. ఉపాధ్యాయులకు అవసరమైన జీవోలు, సర్వీస్ నిబంధనలు, విద్యా క్యాలెండర్‌తో రూపొందిన ఈ డైరీ ఉపాధ్యాయులకు ఉపయోగకరమని తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో టీఎస్‌యూటీఎఫ్ ముందుంటుందని పేర్కొన్నారు. జిల్లా కార్యదర్శి కృష్ణంరాజు, మండల ఉపాధ్యక్షురాలు టి.స్వరూపరాణి ఉన్నారు.

March 5, 2026 / 01:36 PM IST

నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న స్వచ్ఛంద సంస్థ

W.G: ఉండి మండలం చెరుకువాడలో ఉండి మానవత సంస్థ ఆధ్వర్యంలో గురువారం చిరువ్యాపారి నిరుపేద పెద్దిరాజు కుటుంబాన్నికి నిత్యావసర సరుకులు, బియ్యం బస్తా, కూరగాయలు, దుస్తులు,కొంత నగదును అందజేశారు. సంస్థ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ.. కష్ట సమయంలో సాయమందించట మానవత్వం అనిపించుకుంటుందని అన్నారు.

March 5, 2026 / 01:36 PM IST

విద్యుత్ లైన్‌మెన్‌ల సేవలు అభినందనీయం

BPHL: చిట్యాల విద్యుత్ కార్యాలయంలో జాతీయ లైన్‌మెన్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం ADE సురేందర్ మాట్లాడుతూ.. నిరంతరం విద్యుత్ సరఫరా కొనసాగేందుకు లైన్‌మెన్‌ల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. ఎండ, వర్షం అనే తేడా లేకుండా ప్రజలకు నిరంతర విద్యుత్ అందించేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు.

March 5, 2026 / 01:35 PM IST

‘సీఎం పర్యటనను విజయవంతం చేయాలి@

NDL: సీఎం పర్యటనను రైతులు, నాయకులు, కార్యకర్తలు కలిసి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 9న డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సీఎం రానున్నారని తెలిపారు. ఈ మేరకు ఇవాళ ప్యాపిలి మండలం వెంగళంపల్లి గ్రామ ప్రజలు, నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు.

March 5, 2026 / 01:35 PM IST

మధ్యాహ్నం భోజనం మానేస్తున్నారా?

మధ్యాహ్న భోజనం మానేయడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందక నీరసం, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోయి, సాయంత్రం వేళ అతిగా తినే ప్రమాదం ఉంది. ఇది బరువు పెరగడానికి, జీర్ణక్రియ మందగించడానికి దారితీస్తుంది. కాబట్టి సమయానికి మితంగా ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. పండ్లు లేదా మొలకలైనా తింటే మంచిది.

March 5, 2026 / 01:34 PM IST

ప్లాస్టిక్ రహిత గ్రామమే లక్ష్యంగా స్టీల్ బ్యాంక్ ఏర్పాటు

MNCL: కన్నెపల్లి మండలం వీరాపూర్‌లో గురువారం స్టీల్ బ్యాంక్ ప్రారంభించారు. సర్పంచ్ సింధూజ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ రహిత గ్రామమే లక్ష్యంగా DLPO సతీశ్ కుమార్ ఆదేశాల మేరకు బ్యాంకు ప్రారంభించామన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు పంచాయతీ నుంచే మార్పు మొదలు కావాలని పిలుపునిచ్చారు. ఉపసర్పంచ్ చంద్రకళ, కార్యదర్శి తిరుపతి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

March 5, 2026 / 01:34 PM IST

కేజీబీవీలో 10వ తరగతి విద్యార్థులకు సూచనలు

ASR: అరకులోయ మండలం ఎండపల్లివలసలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సమగ్ర శిక్షా అభియాన్ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ స్వామినాయుడు ఇవాళ సందర్శించారు. 10వ తరగతి విద్యార్థులతో సమావేశమై చదువులో రాణించేలా మార్గదర్శకత్వం ఇచ్చారు. విద్యార్థులు సమయపాలనతో చదవాలని సూచించారు. ముఖ్యమైన సబ్జెక్టులను అర్థం చేసుకుని చదివి మంచి మార్కులు సాధించాలని కోరారు.

March 5, 2026 / 01:34 PM IST

పారిశుద్ధ్య పనులు పరిశీలించిన అదనపు కలెక్టర్

NRML: గ్రామాల్లో ప్రతిరోజూ మెరుగైన పారిశుద్ధ్యాన్ని నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అధికారులకు సూచించారు. గురువారం మామడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఆసుపత్రి ప్రాంగణం, కార్యాలయాలు పరిశుభ్రంగా ఉండేల చూడాలన్నారు.

March 5, 2026 / 01:33 PM IST