• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘జనసేన బలోపేతానికి కట్టుబడి పని చేయాలి’

W.G. ఉమ్మడి ప.గో.జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అధ్యక్షతన బుధవారం పాలకొల్లు లయన్స్ క్లబ్‌లో పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యాచరణపై సమావేశం నిర్వహించబడింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన మార్గదర్శకాలను అందించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కట్టుబడి పనిచేయాలన్నారు.

March 5, 2026 / 03:11 PM IST

మార్చి 9న కడప కలెక్టరేట్ ధర్నా..!

KDP: రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల హామీలలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని, నిరుద్యోగ యువతకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదని డీవైఎఫ్ఎ జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు ఎమ్.చిన్ని, వి.శివకుమార్ అన్నారు. అనంతరం మాట్లాడుతూ.. హామీ అమలు కోసం మార్చి 9న రాష్ట్ర పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.

March 5, 2026 / 03:11 PM IST

బకాయిల చెల్లించాలని రైతులు ధర్నా

MHBD: గంగారం మండలం పెద్దఎల్లాపురంలో 234 మంది రైతులు, తమ మొక్కజొన్న ధాన్యంను పీఏసీఎస్‌లో అమ్మి రెండు నెలలు దాటిన ఇప్పటివరకు చెల్లింపు అందకపోవడంతో గురువారం రోడ్డుపై ధర్నా చేశారు. రైతుల బకాయిల మొత్తం సుమారు 5 కోట్లు అయ్యాయి. పెండింగ్ చెల్లింపులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం కోరారు,లేకపోతే అప్పుల వడ్డీలు పెరుగుతున్నాయని అవేదన వ్యక్తం చేస్తున్నారు.

March 5, 2026 / 03:06 PM IST

కలెక్టర్ దృష్టికి సమస్యలు తీసుకువెళ్లిన సర్పంచ్

BDK: మణుగూరు ప్రభుత్వ దవాఖానాను సందర్శించే నేపథ్యంలో వెళ్లిన జిల్లా కలెక్టర్ అంకిత్‌ను సమితి సింగారం గ్రామపంచాయతీ సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ సురేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు పంచాయతీలోని పలు సమస్యలు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హమీ ఇచ్చారు.

March 5, 2026 / 03:06 PM IST

జిల్లాలో అత్యధికంగా 37.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

ATP: అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గురువారం జిల్లాలో 37.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి మొదటి వారంలోనే ఎండలు తీవ్రం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

March 5, 2026 / 03:05 PM IST

గోదావరి పుష్కరాల కమిటీలో అడ్లూరికి చోటు

JGL: గోదావరి – 2027 పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన 9 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (G.O.Rt.No.319) ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ కమిటీలో మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను సభ్యులుగా నియమించారు.

March 5, 2026 / 03:05 PM IST

కాలినడకన తిరుమలకు కల్వకుంట్ల కవిత

TG: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తన కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి బయలు దేరారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకుని రేపు ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.

March 5, 2026 / 03:04 PM IST

కెనడాలో భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణ హత్య

కెనడాలోని లాసల్లేలో భారతీయ ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రేవాల్(45) దారుణ హత్యకు గురయ్యారు. తన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై కత్తితో దాడి చేయగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని వ్యతిరేకిస్తూ నాన్సీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేవారు. ఈ దారుణంపై భారతీయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

March 5, 2026 / 03:03 PM IST

జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరగదు: స్పీకర్

AP: అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండానే YCP సభ్యులు జీతాలు తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అయితే, జగన్ మాత్రం జీతం తీసుకోవడం లేదని ఆయన తెలిపారు. గవర్నర్ ప్రసంగం రోజు హాజరైనా, దాన్ని సాధారణ హాజరుగా పరిగణించబోమన్నారు. వరుసగా 65 రోజులు సభకు రాకపోతే సభ్యులకు నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరగదని పేర్కొన్నారు.

March 5, 2026 / 03:03 PM IST

‘వారసత్వ సంపదను కాపాడుకుందాం’

ATP: అనంతపురం నగరంలో గురువారం రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్ ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశాల మేరకు చారిత్రక కట్టడాల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ యాత్ర నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి పీస్ మెమోరియల్ హాల్ వరకు సాగిన ఈ కార్యక్రమంలో పురావస్తు శాఖ సహాయ సంచాలకులు స్వామినాయక్ పాల్గొని ప్రసంగించారు.

March 5, 2026 / 03:03 PM IST

పదవ తరగతి విద్యార్థులకు మోటివేషన్ తరగతులు

NRML: మంజులాపూర్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వెల్మల మధు వృక్ష శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ గురువారం మోటివేషన్ కార్యక్రమం నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి, ఎక్కువ మార్కులు సాధించాలంటే ఏ విధంగా వ్రాయాలి అనే అంశాలపై వివరించారు. విద్యార్థులు పరీక్ష పత్రాన్ని క్షుణ్ణంగా చదివి జవాబులు రాయాలన్నారు.

March 5, 2026 / 03:02 PM IST

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ రాజర్షిషా

ADB: అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా వాటిని పరిష్కరించాలని.. అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందేలా చూడాలన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పన్నారు.

March 5, 2026 / 03:02 PM IST

విద్యార్థులే టీచర్లైనా వేళ!

SDPT: తొగుట మండలం చందాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులై తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం ప్రధానోపాధ్యా యులు సిద్ధేశ్వర్ మాట్లాడుతూ.. సమాజానికి దిశానిర్దేశం చేసేది ఉపాధ్యాయులేనని, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.

March 5, 2026 / 03:02 PM IST

‘పేదల భూములు ఆక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలి’

SGR: పేదల భూములు ఆక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం ఏరియా కార్యదర్శి యాదగిరి డిమాండ్ చేశారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లిలోని పేదల భూములను గురువారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పేదలకు అన్యాయం జరిగితే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

March 5, 2026 / 03:01 PM IST

లబ్ధిదారుకు CMRFచెక్కు అందజేత

SRD: కల్హేర్ మండలం ఖానాపూర్ (కే) గ్రామానికి చెందిన శాంతపురం చంద్రకళ శంకర్‌కు ముఖ్యమంత్రి సహాయానిధి ద్వారా మంజూరైనా రూ.15 వేలు చెక్కును రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఖేడ్‌లోని ఎమ్మెల్యే నివాసంలో అందజేశారు. పేదల ఆసుపత్రి వైద్య ఖర్చులకు సీఎం సహాయనిధి ఎంతో దోహదపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో మాసాన్ పల్లి కృష్ణ ఉన్నారు.

March 5, 2026 / 03:01 PM IST