SRD: కల్హేర్ మండలం ఖానాపూర్ (కే) గ్రామానికి చెందిన శాంతపురం చంద్రకళ శంకర్‌కు ముఖ్యమంత్రి సహాయానిధి ద్వారా మంజూరైనా రూ.15 వేలు చెక్కును రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఖేడ్‌లోని ఎమ్మెల్యే నివాసంలో అందజేశారు. పేదల ఆసుపత్రి వైద్య ఖర్చులకు సీఎం సహాయనిధి ఎంతో దోహదపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో మాసాన్ పల్లి కృష్ణ ఉన్నారు.