• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రజాపాలన ప్రగతి నివేదనపై సన్నాహక సమావేశం

MBNR: ఈనెల 6న జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి నివేదన కార్యక్రమంపై సన్నాహక సమావేశం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా వెల్లడించారు. ఇవాళ ఈ విషయమై కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇంఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు హాజరవుతారన్నారు.

March 5, 2026 / 05:35 PM IST

జంట చోరీ కేసును ఛేదించిన పోలీసులు

VZM: రాజాంలోని జీఎంఆర్ గృహ సముదాయంలో ఫిబ్రవరి 1న జరిగిన జంట చోరీల మిస్టరీ వీడింది. ఈ కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు అదనపు ఎస్పీ సౌమ్యలత తెలిపారు. వారి నుంచి రూ.32 లక్షల విలువైన 470 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

March 5, 2026 / 05:34 PM IST

జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం జిల్లాలోని 37 పరీక్షా కేంద్రాల్లో గణితశాస్త్రం, జూలజీ, హిస్టరీ పరీక్షలు సజావుగా నిర్వహించబడ్డాయి. మొత్తం 8,640 మంది విద్యార్థులకు పరీక్షలు ఉండగా 8,219 మంది హాజరయ్యారు.

March 5, 2026 / 05:33 PM IST

ఎంజేపీ గురుకులంలో ప్రవేశ దరఖాస్తుల గడువు పొడగింపు

CTR: సదుం మండలంలోని ఎంజేపీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి, జూనియర్ కళాశాల ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును ఈనెల 12 వరకు పొడగించినట్లు ప్రిన్సిపల్ జయసింహనాయుడు తెలిపారు. అర్హత గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన పలు వసతులు అందుబాటులో ఉన్నాయన్నారు.

March 5, 2026 / 05:33 PM IST

ఏఆర్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభం

చిత్తూరు జిల్లా సాయుధ దళం కార్యాలయం వెలుపల ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ప్రారంభించారు. వేసవి వేడి నేపథ్యంలో ప్రజలకు శుద్ధి చేసిన చల్లని త్రాగునీరు అందించేందుకు ఏఆర్ పోలీసు విభాగం ఆధ్వర్యంలో ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రజలకు ఉపశమనం కలిగించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గోన్నారు.

March 5, 2026 / 05:33 PM IST

గిరిజనులకు ఉచిత మెగా వైద్య శిబిరం

ASR: డుంబ్రిగూడ మండలం కింజేరు గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం, పీపుల్స్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 140 మంది రోగులు వైద్య సేవలు పొందారు. డా ఎం.ఐ. విజయ్ భాస్కర్ రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరం నిర్వహించినట్లు పేర్కొన్నారు.

March 5, 2026 / 05:33 PM IST

జనసేన సభ్యత్వ నమోదుపై కీలక సమావేశం

WG: పాలకొల్లులో గురువారం జనసేన 5వ దశ ఉద్యమి సభ్యత్వ నమోదుపై కార్యాచరణ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొని పాలకొల్లు, ఆచంట నియోజకవర్గ నాయకులకు దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

March 5, 2026 / 05:32 PM IST

జిల్లాలోని చెత్త సేకరణపై కమిషనర్ ఆదేశాలు

కర్నూలు: వంద శాతం చెత్త సేకరణను సమర్థంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కార్పొరేషన్ కమిషనర్ పి.విశ్వనాథ్ ఇవాళ కోరారు. శానిటేషన్ ఇన్స్‌స్పెక్టర్, కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఇంటింటి చెత్త సేకరణ, చెత్త వాహనాల జీపీఎస్ ట్రాకింగ్‌పై సమీక్షించారు. నగరాన్ని గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు కొనసాగుతున్నాయనిన్నారు.

March 5, 2026 / 05:30 PM IST

‘ఎస్సీ సంక్షేమ పథకాలను అమలు చేయాలి’

SRPT: ఎస్సీ సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత చింత బాబు మాదిగ విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలో కరపత్రాలు ఆవిష్కరించారు. వర్గీకరణ అమలు, రూ.12 లక్షల ఆర్థిక సాయం, ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.15 వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మార్చి 30న హైదరాబాద్‌లో చేపట్టే నిరాహార దీక్షను జయప్రదం చేయాలని కోరారు.

March 5, 2026 / 05:30 PM IST

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ సీఎం

KDP: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి కుమార్తె కృష్ణ కావ్య, వినీత్ రెడ్డిలను మాజీ సీఎం జగన్ ఆశీర్వదించారు. గురువారం రిసెప్షన్ వేడుకలకు హాజరైన జగన్ పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తల నడుమ రిసెప్షన్ హాలుకు చేరుకొని వారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ఆయనకు పుష్ప గుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు.

March 5, 2026 / 05:29 PM IST

డిప్యూటీ సీఎంను కలిసిన MLA

BPT: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను గురువారం చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని రహదారులు, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధుల మంజూరుపై ఈ సందర్భంగా వారు చర్చించారు. చీరాల పర్యటనకు రావాలని ఎమ్మెల్యే కోరగా, పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు.

March 5, 2026 / 05:28 PM IST

నూతన 315 కేవీ ట్రాన్‌‌స్ఫర్మర్ రీప్లేస్మెంట్

MDCL: మేడిపల్లి ధరణి కాలనీలో కాలనీవాసుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాత ట్రాన్‌‌స్ఫర్మర్ స్థానంలో కొత్త 315 కేవీ ట్రాన్‌‌స్ఫర్మర్  రీప్లేస్మెంట్ ప్రక్రియ పూర్తి చేశారు. కాలనీలో ఎదురవుతున్న అంతరాయాలను గమనించి వెనువెంటనే కొత్త ట్రాన్‌‌స్ఫర్మర్ ఏర్పాటు చేయడం పట్ల పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి విద్యుత్ అధికారులను అభినందించారు.

March 5, 2026 / 05:28 PM IST

పెండింగ్ సీఎంఆర్ చెల్లించుకుంటే క్రిమినల్ కేసులు

PDPL: పెండింగ్ సీఎంఆర్ బకాయిలు చెల్లించని డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్‌లో డీసీపీ రాంరెడ్డి, అదనపు కలెక్టర్ డి.వేణతో కలిసి రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. విధించిన జరిమానాను శనివారంలోపు చెల్లించాలని, లేకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు.

March 5, 2026 / 05:27 PM IST

టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా జహీర్ ఖాన్..?

టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం జూన్ 2026లో ముగియనుంది. దీంతో అగార్కర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు మాజీ పేసర్ జహీర్ ఖాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే, హర్భజన్ సింగ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న సమయంలో భారత జట్టు 2024 T20 WC, 2025 CT గెలుచుకుంది. అలాగే, 2023 ODI WCలో ఫైనల్‌కు చేరింది.

March 5, 2026 / 05:27 PM IST

విశాఖకు మంత్రి నారా లోకేష్ రాక

విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు గురువారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి కార్యకర్తలతో కలిసి ఫోటోలు దిగారు. అనంతరం విశాఖ వాల్తేర్ క్లబ్‌లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల వెంకటరమణ సోదరుని కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు.

March 5, 2026 / 05:23 PM IST