• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి’

ADB: మహిళలు ధైర్యంతో ముందడుగు వేసి అన్ని రంగాల్లో తమ సత్తా చాటాలని ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని వెటర్నరీ ఆస్పత్రిలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల ఎదుగుదలకు ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించిందని ఆమె అన్నారు.

March 5, 2026 / 07:21 PM IST

వన్యప్రాణంలో సంరక్షణపై అవగాహన

NGKL: అమ్రాబాద్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో మన్య ప్రాణుల సంరక్షణ గురించి ఇవాళ అవగాహన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అరుణ హాజరై మాట్లాడుతూ.. అడవి జంతువులను వేటాడకూడదని, అడవిలోకి ప్లాస్టిక్ తీసుకెళ్లకూడదని విద్యార్థులకు సూచించారు. మూగజీవాలకు హాని తలపెట్టకుండా పర్యావరణాన్ని కాపాడాలని ఆమె పిలుపునిచ్చారు.

March 5, 2026 / 07:21 PM IST

సంపద కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలి

AKP: సంపద కేంద్రాలను సక్రమంగా నిర్వహిస్తే పంచాయతీలకు ఆదాయం సమకూర్తుందని ఎస్ రాయవరం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ అన్నారు. గురువారం కర్రివానిపాలెంలో సంపద కేంద్రాన్ని సందర్శించారు. ప్రతి గ్రామానికి స్వచ్ఛ రథం షెడ్యూల్ ప్రకారం వస్తుందన్నారు. స్వచ్చ రథం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

March 5, 2026 / 07:21 PM IST

బ్రహ్మోత్సవాలకు రావాలంటూ మంత్రికి ఆహ్వానం

SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 8 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామికి ఆలయ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను మాజీ ఎమ్మెల్యే తూముకుంట నరసారెడ్డి, ఆలయ ఛైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ఆలయ ఈవో రంగాచారి అందజేశారు.

March 5, 2026 / 07:20 PM IST

కూచిపూడి గ్రామంకు సాంస్కృతిక వారసత్వ కేంద్రం

కృష్ణా: ప్రసిద్ధ నాట్యకేంద్రంగా గుర్తింపు పొందిన కూచిపూడి గ్రామంను సాంస్కృతిక వారసత్వ సంపద కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్ డి.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరత్నం నాయుడుతో కలిసి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

March 5, 2026 / 07:20 PM IST

మార్చి 7న గుంటూరులో మహిళల అథ్లెటిక్స్ లీగ్

GNTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు బీఆర్ స్టేడియంలో మార్చి 7న భారీ అథ్లెటిక్స్ లీగ్ నిర్వహిస్తున్నట్లు మై భారత్ జిల్లా ఉపసంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి, డీఎస్‌డీఓ పఠాన్ ఆఫ్రోజ్ ఖాన్ గురువారం తెలిపారు. అండర్-13, 13-18, 18 ఏళ్లకు పైబడిన విభాగాల్లో 100, 200, 400 మీటర్ల పరుగుపందేలు నిర్వహించనున్నామని వారు వెల్లడించారు.

March 5, 2026 / 07:20 PM IST

గ్రామ సంఘ కమిటీ జెండర్ కమిటీల శిక్షణ

VZM: కొత్తవలస మండల సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం వెంకటరమణ ఆద్వర్యంలో గ్రామ సంఘ జెండర్ కమిటీల శిక్షణ గురువారం నిర్వహించారు. లింగ అసమానతలు హింస, వివక్షపై అవగాహన ఉండాలని సూచించారు. సమాజంలో మహిళ ఆర్థిక సహకారాలు, తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య లక్ష్మీ ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.

March 5, 2026 / 07:19 PM IST

క్షయ వ్యాధిపై ప్రజలకు అవగాహన

KDP: సిద్ధవటం మండలం పి.కొత్తపల్లి PHC పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో గురువారం డా. రంగ లక్ష్మీ ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా CHO లక్ష్మీ నరసమ్మ మాట్లాడుతూ.. 2 వారాలు నుంచి,దగ్గు,జ్వరము,అలసట బరువు తగ్గడం రాత్రిపూట చెమటలు ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉన్న పేషెంట్లు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు చేయించుకోవాలన్నారు.

March 5, 2026 / 07:19 PM IST

కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

PDPL: సుల్తానాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ఓపీ, డెంటల్ సేవలు, గర్భిణీల హెల్త్ చెకప్ షెడ్యూల్, వ్యాక్సినేషన్ పూర్తి స్థితిని పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందుతున్న సేవలపై ఆయన ఆరా తీశారు. ఎన్.సి.డి విభాగంలో ఏవైనా మందుల కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

March 5, 2026 / 07:18 PM IST

‘కోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం’

ASR: పెరటికోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జయరాజు రైతులకు సూచించారు. గురువారం పాడేరు ఎంపీడీవో కార్యాలయంలో సమగ్ర పెరటికోళ్ల యూనిట్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పెరటికోళ్ల యూనిట్లలో జీవ భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. సరైన ఆహార నియమాలు అనుసరించి, కోళ్ల ఆరోగ్యం కాపాడుకోవడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చన్నారు.

March 5, 2026 / 07:18 PM IST

కిసాన్ మోర్చా గ్రామ కమిటీలు ఏర్పాటు..!

 W.G: ఉండి మండలంలో పలు గ్రామాల్లో కిసాన్ మోర్చా గ్రామ కమిటీలను ఏర్పాటు కోసం జిల్లా కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5 గురు సభ్యులతో కమిటీలు వేశామన్నారు .మండల అధ్యక్షులు యర్రా విక్రమ్, సెక్రటరీ మడిచర్ల సూర్యప్రకాష్ ,డొక్కు వెంకటేశ్వర రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 5, 2026 / 07:17 PM IST

దెబ్బతిన్న నరాలకు ఇంజెక్టబుల్ జెల్

ప్రమాదాల్లో గాయపడినప్పుడో, పలు సమస్యలతోనో శరీరంలోని నరాలు దెబ్బతింటుంటాయి. ఇది ఇతర అనారోగ్యాలకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది. అయితే శాస్త్రవేత్తలు దీనికి పరిష్కారం కనుగొన్నారు. నరాలను పునరుద్ధరించే ఇంజెక్టబుల్ జెల్‌ను అభివృద్ధి చేశారు. దెబ్బతిన్న నరాలను మళ్లీ పెరిగేలా చేసి, కోల్పోయిన సెన్సేషన్ను పూర్తిగా తిరిగి తెచ్చే సామర్థ్యం కలిగి ఉందని పరిశోధకులు అంటున్నారు.

March 5, 2026 / 07:16 PM IST

ఈ నెల 7వ తేదీన న్యాయ నిర్మాణ్ భవన్‌కు శంకుస్థాపన

SRCL: జిల్లా కేంద్రంలో నూతన న్యాయస్థాన భవన సముదాయానికి శ్రీకారం జరగనుంది. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా రూపు దిద్దుకోనున్న న్యాయస్థాన భవనానికి ఈ నెల 7వ తేదీ శనివారం ఉదయం 10 గం.లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ వెల్లడించారు.

March 5, 2026 / 07:15 PM IST

ఎట్టకేలకు గని ప్రమాదంగా నమోదు

MNCL: ఎట్టకేలకు శాంతిఖని గని ప్రమాదంపై కార్పొరేట్ యజమాన్యం స్పందించింది. ఓ ప్రధాన అధికార యూనియన్ అగ్రనేత జోక్యంతో గని ప్రమాదంపై ఉన్నతాధికారుల్లో శీగ్రగతిన కదలిక వచ్చింది. బెల్లంపల్లి శాంతిఖనిలోఇటివల జరిగిన ప్రమాదంలో కోట మనికేశ్వర్ అనే బదిలీ కార్మికుడు గాయపడ్డాడు. ఈ సంఘటనలో అతని చేతి వేలు కు తీవ్రంగా గాయం అయింది.

March 5, 2026 / 07:15 PM IST

‘బ్యాంకు రుణ లక్ష్యాలను పూర్తి చేయాలి’

ELR: జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి రుణ లక్ష్యాలను ఈనెలాఖులోగా పూర్తిగా సాధించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ గౌతమీ సమావేశపు హాలులో గురువారం స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి, స్త్రీ నిధి రుణాలు, యూనిట్ల స్థాపన పలు అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఇంతవరకు 1242.48 కోట్ల రూపాయలు మంజూరు చేసారని అన్నారు.

March 5, 2026 / 07:14 PM IST