• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘రైతులకు భూమిపై పూర్తి హక్కు, భద్రత’

ASR: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా, సాంకేతికతతో రీ-సర్వే నిర్వహించి, ఎలాంటి తప్పులు లేకుండా సరిహద్దులను ఖరారు చేసినట్లు ఆర్డీవో లోకేశ్వరరావు తెలిపారు. గురువారం పాడేరు మండలంలో రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. గతంలో ఉన్న పుస్తకాలతో పోలిస్తే, ఇప్పుడు అందజేస్తున్న రాజముద్ర కలిగిన పాసు పుస్తకాలు రైతులకు భూమిపై పూర్తి హక్కు, భద్రతను కల్పిస్తాయన్నారు.

March 5, 2026 / 07:14 PM IST

‘అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి’

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరంలోని 54, 48 డివిజన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను గురువారం కమిషనర్ తనిఖీ చేశారు. నగరవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులు నిర్దేశిత కాల పరిమితి లోపు పూర్తి చేయాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.

March 5, 2026 / 07:14 PM IST

‘ఇసుక అక్రమ రవాణా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు’

NRML: జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టడం జరిగిందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఇందులో భాగంగా బాసర,సారంగాపూర్ సరిహద్దుల్లో అంతరాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.

March 5, 2026 / 07:13 PM IST

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

JGL: మెట్‌పల్లి ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా సందర్శించి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థుల చదువును స్వయంగా పరీక్షించగా 9వ తరగతి విద్యార్థి సరిగా చదవలేకపోవడంతో హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థికి ప్రాథమికంగా చదివే నైపుణ్యాలు తప్పనిసరిగా రావాలని, 30 రోజుల్లో మార్పు లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

March 5, 2026 / 07:13 PM IST

రూ. 76 లక్షలతో 1,040మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి

కృష్ణా: అవనిగడ్డలో ఆర్టీసీ డిపో వద్ధ నుంచి ఏఎస్ఆర్ కళ్యాణ మండపం వరకూ ప్రధాన రహదారి నిర్మాణం పూర్తయింది. ఉపాధి నిధులు రూ.76 లక్షలతో 1,040 మీటర్ల బీటీ రోడ్డు నిర్మించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంజూరు చేసిన నిధులతో రోడ్డు నిర్మాణం సాకారమైంది. పీఆర్ డీఈఈ సురేష్ బాబు, ఏఈ బ్రహ్మానంద బాబు పర్యవేక్షించారు.

March 5, 2026 / 07:12 PM IST

APK ఫైల్స్ పట్ల ప్రజలు జాగ్రత్తగాఉండాలి: ఎస్పీ

NRPT: రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీని ఆసరా చేసుకొని సైబర్ కేటుగాళ్లు అనేక రకాల సైబర్ మోసాలకు పాల్పడుతున్నాడని, అమాయక ప్రజల స్మార్ట్ ఫోన్లకు APK ఫైల్స్ పంపించి ఆర్థికంగా దోచుకుంటున్నారని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. అనవసరపు మెసేజ్ లను, ఏపీకే ఫైల్స్‌ను తెరవకూడదని హెచ్చరించారు. గొలుసుకట్టు వ్యాపారాల జోలికి వెళ్లకూడదని సూచించారు.

March 5, 2026 / 07:12 PM IST

‘ఉపాధ్యాయులు, HMల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి’

ఆసిఫాబాద్ జిల్లాలోని ఉపాధ్యాయులు, HMల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని TSGHM జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పర్ష చంద్రశేఖర్, రాథోడ్ సుభాష్ కోరారు. గురువారం అదనపు కలెక్టర్ డేవిడ్‌కు వినతిపత్రం అందజేశారు. గత వేసవిలో 50 ఉన్నత పాఠశాలల్లో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ నిధులను విడుదల చేయాలని, స్కావెంజర్లకు హాజరుతో సంబంధం లేకుండా వేతనాలు చెల్లించాలని కోరారు.

March 5, 2026 / 07:11 PM IST

‘బార్’ను వేరే ప్రాంతానికి తరలించాలి’

E.G: రాజమండ్రిలోని గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బార్‌ను వెంటనే వేరే ప్రాంతానికి తరలించాలని కోరుతూ మహిళా సంఘాలు గురువారం ఆందోళనకు దిగాయి. “బార్” పెట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం దారుణమన్నారు. ప్రజల నివాస స్థలంలో బార్‌కి అనుమతి ఇవ్వడం వలన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు.

March 5, 2026 / 07:11 PM IST

‘అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించాలి’

KRNL: మంత్రాలయం పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించాలని జై భీమ్ MRPS నాయకులు గురువారం పిలుపునిచ్చారు. గర్జీ హనుమన్న మాదిగ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకుడు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడారు. ఏప్రిల్ 14న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద అన్ని వర్గాలు ఐక్యంగా జయంతి జరుపుదామని పేర్కొన్నారు.

March 5, 2026 / 07:10 PM IST

సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు

సత్యసాయి: అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. మడకశిర నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతి గురించి ముఖ్యమంత్రికి వారు వివరించారు. నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, తాగునీటి సమస్య పరిష్కరించాలని ఈ సందర్భంగా విన్నవించారు.

March 5, 2026 / 07:09 PM IST

మల్లూరు జాతరలో ఎయిడ్స్ అవగాహన శిబిరం

అన్నమయ్య: మల్లూరు అమ్మ జాతరలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు ప్రజా చైతన్య సేవా సంఘం ఆధ్వర్యంలో హెచ్ఐవి, ఎయిడ్స్‌పై అవగాహన వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ ప్రారంభించి యువతీ యువకులు ఎయిడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రూరల్ సీఐ రోషన్ మాట్లాడుతూ ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.

March 5, 2026 / 07:07 PM IST

చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి లేఖ

AP: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తూ సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టులోని GAP-2 ఎర్త్ కోర్ రాక్ ఫిల్(ECRF) డ్యామ్ రూపకల్పనలో వ్యత్యాసాలు, భద్రతా పరమైన ముప్పు గురించి లేఖలో ప్రస్తావించారు. CWC, PPA నివేదికలను పరిశీలించిన తర్వాతే ఈ అంశాలను CBN దృష్టికి తీసుకెళ్లుతున్నట్లు స్పష్టం చేశారు.

March 5, 2026 / 07:06 PM IST

పీఎం ముద్ర యోజనపై అవగాహన కార్యక్రమం

WNP: పీఎం ముద్ర, పీఎం ఈజీపి స్కీమ్‌లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉపాధి కోసం ఎదురుచూసిన నిరుద్యోగులకు చివరి ఏడాది విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని జనరల్ మేనేజర్ జ్యోతి తెలిపారు. గురువారం వనపర్తి జిల్లా మహిళా డిగ్రీ కళాశాలలో పారిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జ్యోతి మాట్లాడారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 5, 2026 / 07:05 PM IST

రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మం జిల్లాలో రేపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారని ఆయన క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రి పొంగులేటి ఏదులాపురం మున్సిపాలిటీ ముత్తగూడెంలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొంటారని అనంతరం జిల్లా కలెక్టరేట్లో జరిగే ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపింది.

March 5, 2026 / 07:05 PM IST

అలిపిరి నుంచి నడకమార్గంలో కవిత

TG: తిరుపతి చేరుకున్న కల్వకుంట్ల కవిత అలిపిరి నుంచి నడకమార్గంలో తిరుమల కొండపైకి నడకమార్గంలో బయల్దేరారు. ప్రస్తుతం ఆమె కొండపైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. నడకమార్గంలో కవితను చూసిన భక్తులు ఆమెతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ అనే ప్రాంతీయ లేకుండా, రాజకీయాలకు అతీతంగా కవితను స్వాగతిస్తున్నారు.

March 5, 2026 / 07:05 PM IST