JGL: మెట్పల్లి ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా సందర్శించి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థుల చదువును స్వయంగా పరీక్షించగా 9వ తరగతి విద్యార్థి సరిగా చదవలేకపోవడంతో హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థికి ప్రాథమికంగా చదివే నైపుణ్యాలు తప్పనిసరిగా రావాలని, 30 రోజుల్లో మార్పు లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.