NRML: జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టడం జరిగిందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఇందులో భాగంగా బాసర,సారంగాపూర్ సరిహద్దుల్లో అంతరాష్ట్ర చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.