• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

49వ జాతీయ గుడారాల పండుగకు ఏర్పాట్లు పూర్తి

GNTR: అమరావతిలో 49వ జాతీయ గుడారాల పండుగ వేడుకలు గురువారం సాయంకాలం నుంచి ప్రారంభమవుతాయని పాస్టర్ అనిల్ కుమార్ తెలిపారు. భక్తుల అవసరార్థం తాటాకు పందిళ్లు, టెంటులు మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు ప్రత్యేక రైలు నడుపుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ ఉచితంగా రాత్రి 11 గంటల వరకు బస్సు సౌకర్యం కల్పించారన్నారు.

March 5, 2026 / 03:01 PM IST

బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్

TG: హైదరాబాద్ అబిడ్స్‌లో ఇటీవల అగ్నిప్రమాదానికి గురైన ఫర్నీచర్ దుకాణం యజమాని పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ మంజూరు చేయాలంటూ ఫర్నీచర్ దుకాణ యజమాని పిటిషన్ వేశారు. అగ్నిప్రమాదంపై పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదని అతని న్యాయవాది పేర్కొన్నారు. దుకాణ యజమాని కొన్ని రోజులుగా జైలులోనే ఉన్నారని తెలిపారు.

March 5, 2026 / 03:01 PM IST

హైవేపై కందికల్లం.. ఇబ్బంది పడుతున్న వాహనదారులు

BHNG: మోత్కూర్-తిరుమలగిరి నేషనల్ హైవేపై రైతులు కంది కల్లం పెట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేగంగా వాహనాలు వెళుతుండటంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు అక్కడ కంట్రోల్ కాక, వన్ సైడ్ వెళ్లలేక ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. కందులు తూర్పార పడుతుండటంతో పొట్టు వాహనదారుల కళ్లలో పడుతుంది. పోలీసులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.

March 5, 2026 / 03:00 PM IST

మద్నూర్‌లో ఇంటర్‌ పరీక్షలకు 98.37 శాతం హాజరు

KMR: మద్నూర్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. మ్యాథ్స్, జువాలజీ తదితర పరీక్షలకు మొత్తం 246 మంది విద్యార్థులకు గాను 242 మంది హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. నలుగురు విద్యార్థులు గైర్హాజరు కావడంతో 98.37 శాతం హాజరు నమోదైంది. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా పటిష్ఠమైన నిఘా మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

March 5, 2026 / 03:00 PM IST

‘నోటీసుల పేరుతో పోలీసులు వేధింపులు ఆపాలి’

WNP: నోటీసుల పేరుతో పోలీసుల వేధింపులు ఆపాలని గొల్లపల్లి-చీర్కేపల్లి రిజర్వాయర్ వ్యతిరేక అఖిలపక్ష పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఏదుల మండలం గొల్లపల్లి గేటు వద్ద రిజర్వాయర్ నిర్మించోద్దని చేస్తున్న నిరసన దీక్ష గురువారానికి 67వ రోజుకు చేరింది. వారు మాట్లాడుతూ.. రిజర్వాయర్ నిర్మాణంతో 1200 ఎకరాల సాగు భూమి నీట మునిగి వందలాది రైతులు జీవనాధారం కోల్పోతారన్నారు.

March 5, 2026 / 03:00 PM IST

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసిన దైద రవీందర్

NLG: హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో వేములవాడ MLA, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను నకిరేకల్‌కు చెందిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దైద రవీందర్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు వంటి అంశాలపై చర్చించారు. ఆయన వెంట జిల్లా నాయకులు గార్లపాటి రవీందర్ రెడ్డి ఉన్నారు.

March 5, 2026 / 03:00 PM IST

‘ఇసుక అక్రమ రవాణాన్ని అరికట్టాలి’

SRPT: అనంతగిరి మండలం చనుపల్లి గ్రామ శివారులో పాలేరు వాగులో ఇసుక అక్రమ త్రవ్వకాలు జోరుగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిబంధనలు పట్టించుకోకుండా దళారులు ఇసుక తరలిస్తున్నారని స్థానికులు అంటున్నారు. దీంతో భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని వెంటనే వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

March 5, 2026 / 03:00 PM IST

రేపు నిజామాబాద్ రానున్న ఈటల రాజేందర్

NZB: మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం నిజామాబాద్‌కు రానున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ తరుఫున గెలిచిన కౌన్సిలర్, కార్పొరేటర్ల ఆత్మీయ అభినందన సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో కలిసి పాల్గొననున్నారు.

March 5, 2026 / 03:00 PM IST

గడ్డి తొలగింపు చర్యలు చేపట్టిన ఇంఛార్జ్

కృష్ణా: గుడివాడ టిడ్కో కాలనీలో అనవసరంగా పెరిగిన గడ్డి కారణంగా కాలనీవాసులు దోమల బారిన పడుతున్న సమస్య తలెత్తింది. ఈ సమస్యను గుర్తించిన టిడ్కో కాలనీ జనసేన ఇంఛార్జ్ వెంకటేష్ వెంటనే స్పందించారు. పారిశుద్ధ్య సిబ్బందికి తెలియజేసి కాలనీలో పెరిగిన గడ్డిని తొలగించే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టారు. దీంతో కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించింది.

March 5, 2026 / 02:59 PM IST

ఆసియాలోనే టాప్ సిటీగా మారనున్న వైజాగ్

AP: విశాఖ నగరం త్వరలో కొత్తరూపు సంతరించుకోనుంది. రాబోయే ఐదేళ్లలో పది లక్షల మంది జనాభా పెరగనున్న నేపథ్యంలో, VMRDA రోడ్ల విస్తరణను వేగవంతం చేసింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ, నగర ట్రాఫిక్ తగ్గించేందుకు ఏడు కొత్త ప్రధాన రోడ్లు నిర్మిస్తున్నారు. ఐటీ సంస్థల రాకతో వేగంగా అభివృద్ధి చెందుతున్న వైజాగ్, ఆసియాలోనే టాప్ సిటీగా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

March 5, 2026 / 02:57 PM IST

బహిరంగ వేలం.. రూ.25,53,700 ఆదాయం

CTR: పుంగునూరు మున్సిపల్ కార్యాలయంలో గురువారం కమిషనర్ మధుసూదన్ రెడ్డి సమక్షంలో బహిరంగ వేలంపాట జరిగింది. వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్, ప్రైవేట్ బస్సు స్టాండ్ వద్ద గల పబ్లిక్ యూరినల్స్, షాపు రూమ్‌లు, ఖాళీ స్థలాలకు బహిరంగ వేలంపాట నిర్వహించగా రూ.25,53,700 ఆదాయం వచ్చినట్లు కమిషనర్ తెలిపారు.

March 5, 2026 / 02:55 PM IST

‘మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలి’

KMM: ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా రైతులు పండించిన మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని ఐక్య రైతు సంఘం జిల్లా నాయకులు నాగేశ్వరరావు అన్నారు. గురువారం చింతకాని మండలం నాగులవంచ రైతు వేదికలో సొసైటీ సీఈఓ శ్రీనివాసరావుకు ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. మద్దతు ధర ప్రకారం రైతుల నుంచి మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.

March 5, 2026 / 02:54 PM IST

నెక్స్ట్ టార్గెట్ CBN.. పవన్‌కు లైన్ క్లియర్?

మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే, బీహార్‌లో నితీశ్ కుమార్ పరిణామాలతో తాజాగా APలోనూ చంద్రబాబు విషయంలో అదే జరుగుతుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. భవిష్యత్‍లో చంద్రబాబును జాతీయ రాజకీయాల్లోకి తీసుకుని ఏపీలో పవన్‌ను CMగా ప్రపోజ్ చేస్తుందనే ఊహాగానాలు వస్తున్నాయి. అయితే బీహార్, మహారాష్ట్ర వేరు AP పరిస్థితి వేరని ఈ ఊహాగానాలను టీడీపీ శ్రేణులు తిప్పికొడుతున్నాయి.

March 5, 2026 / 02:54 PM IST

యుద్ధం.. విమానసేవలకు అంతరాయం

TG: శంషాబాద్ విమానాశ్రయం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే విమానాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. గల్ఫ్ దేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే విమానాలను కూడా నిలిపివేసినట్లు వెల్లడించారు. గల్ఫ్ నుంచి రావాల్సిన 16 విమానాలు, అలాగే శంషాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన 15 విమానాలను రద్ధు చేసినట్లు పేర్కొన్నారు. UAE, సౌదీ అరేబియాకు విమానాల రాకపోకలు నిలిపివేశామన్నారు.

March 5, 2026 / 02:52 PM IST

పందుల కొరత రాకుండా చర్యలు: కలెక్టర్

PDPL: ఆసుపత్రులలో మందుల కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. గురువారం ఆయన సుల్తానాబాద్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. గర్భిణీ స్త్రీలకు రెగ్యులర్ చెకప్ జరిగేలా చూడాలని, వ్యాక్సినేషన్ 100% పూర్తి చేయాలని సూచించారు.

March 5, 2026 / 02:49 PM IST