AP: విశాఖ నగరం త్వరలో కొత్తరూపు సంతరించుకోనుంది. రాబోయే ఐదేళ్లలో పది లక్షల మంది జనాభా పెరగనున్న నేపథ్యంలో, VMRDA రోడ్ల విస్తరణను వేగవంతం చేసింది. భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, నగర ట్రాఫిక్ తగ్గించేందుకు ఏడు కొత్త ప్రధాన రోడ్లు నిర్మిస్తున్నారు. ఐటీ సంస్థల రాకతో వేగంగా అభివృద్ధి చెందుతున్న వైజాగ్, ఆసియాలోనే టాప్ సిటీగా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.