CTR: పుంగునూరు మున్సిపల్ కార్యాలయంలో గురువారం కమిషనర్ మధుసూదన్ రెడ్డి సమక్షంలో బహిరంగ వేలంపాట జరిగింది. వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్, ప్రైవేట్ బస్సు స్టాండ్ వద్ద గల పబ్లిక్ యూరినల్స్, షాపు రూమ్లు, ఖాళీ స్థలాలకు బహిరంగ వేలంపాట నిర్వహించగా రూ.25,53,700 ఆదాయం వచ్చినట్లు కమిషనర్ తెలిపారు.