PDPL: ఆసుపత్రులలో మందుల కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. గురువారం ఆయన సుల్తానాబాద్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న సేవలపై ఆరా తీశారు. గర్భిణీ స్త్రీలకు రెగ్యులర్ చెకప్ జరిగేలా చూడాలని, వ్యాక్సినేషన్ 100% పూర్తి చేయాలని సూచించారు.