• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉపాధ్యాయుడిపై దాడి దుర్మార్గం: ఏఐఎస్ఎఫ్

KRNL: ఉపాధ్యాయుడిపై విద్యార్థి దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ ఖండించారు. కృష్ణా జిల్లా వీరవల్లి బాబులపాడు మండలంలోని జడ్పీహెచ్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థి టీచర్‌పై దాడి చేయడం బాధాకరమన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగంపై ఉందన్నారు. పిల్లలను తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచాలన్నారు.

March 5, 2026 / 01:33 PM IST

మహిళతో పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన

T20 WC వేళ ఓ పాక్ క్రికెటర్ శ్రీలంకలోని గోల్డెన్ క్రౌన్ హోటల్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. లంకతో సూపర్-8 పోరుకు ముందు ఆ ప్లేయర్.. హౌస్ కీపింగ్ మహిళను వేధించాడు. గమనించిన తోటి సిబ్బంది ఆమెను రక్షించి.. హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీనిపై యాజమాన్యం పాక్ టీమ్ మేనేజర్ నవైద్ చీమాకు చెప్పగా.. ఆయన క్షమాపణలు కోరి, సదరు ఆటగాడికి భారీగా ఫైన్ విధించాడు.

March 5, 2026 / 01:32 PM IST

గన్నవరంలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

AP: కృష్ణా జిల్లా గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. రన్‌వేపై నుంచి టేకాఫ్ అవుతుండగా ఇంజిన్‌లో సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించారు. దీంతో రన్‌వేపైనే విమానాన్ని ఆపేశాడు. ఆ విమానంలో మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ,  ప్రత్తిపాటి పుల్లారావుతో సహా 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

March 5, 2026 / 01:31 PM IST

‘గొప్పలు తప్ప ఆచరణలో విఫలం’

NLG: రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని సీపీఎం నల్గొండ పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుభరోసా పథకంపై గొప్పలు చెప్పుకుంటున్నవ్పటికీ, ఆచరణలో మాత్రం విఫలమైందని విమర్శించారు. రైతులకు పెట్టుబడులు లేక అప్పులు చేసి ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

March 5, 2026 / 01:30 PM IST

జిల్లాలో జోరుగా అక్రమ రవాణా పట్టించుకోని అధికారులు

MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాత్రి సమయంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతున్న కలెక్టర్లు, ఎమ్మార్వోలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పలు గ్రామాలలో ఉన్నత అధికారులకు ప్రజలు అక్రమ రవాణాను అడ్డుకోవాలని వినతి పత్రాలు అందజేసిన ఏ మాత్రం స్పందించడం లేదని అధికారులపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

March 5, 2026 / 01:30 PM IST

మార్చి 15న కాన్షీరాం జయంతి సభ

SRCL: బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం జయంతి సందర్భంగా ఈ నెల 15న సిరిసిల్లలో సుమారు 5000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఎస్పీ నాయకులు తెలిపారు. సభ ఏర్పాట్లపై ఈ నెల 6న కామాక్షి బ్యాంకెట్ హాల్లో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కమ్మెట అశోక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్, పాల్గొన్నారు.

March 5, 2026 / 01:30 PM IST

నలుగురు విద్యార్థుల గైర్హాజరు

NZB: ధర్పల్లిలోని ప్రభుత్వ జూనియర్, ఆదర్శ కళాశాలల్లో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మ్యాథమెటిక్స్ 1బీ, జువాలజీ పరీక్షలకు మొత్తం 4 విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రిన్సిపల్స్ శ్రీనాథ్, శ్రీనివాసులు తెలిపారు. ఆదర్శ కళాశాలలో ఒకరు, ప్రభుత్వ కళాశాలలో ముగ్గురు విద్యార్థులు పరీక్షకు రాలేదని పేర్కొన్నారు.

March 5, 2026 / 01:30 PM IST

‘సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి’

సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహం ఆదేశాల మేరకు నూతనకల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో షీ టీమ్స్, డ్రగ్స్ సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన పోలీస్ కళా బృందంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ సమ్మద్ మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు.

March 5, 2026 / 01:30 PM IST

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన భీమ్ భరత్

RR: ఇందిరమ్మ రాజ్యంలోనే పేదింటి కల నెరవేరిందని భీమ్ చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ భీమ్ భరత్ అన్నారు. ఈరోజు శంకర్‌పల్లి మండల పరిధిలో చందిప్ప గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వంతోనే పేదలకు అన్ని పథకాలు అందుతాయని అన్నారు. జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ జ్యోతి భీమ్ భరత్, నాయకులు పాల్గొన్నారు.

March 5, 2026 / 01:29 PM IST

గొలుగొండ మండలంలో కారు బోల్తా

AKP: గొలుగొండ మండలం పరిధిలోని లింగంపేట సమీపంలోని రామచంద్రపాలెం జంక్షన్ వద్ద ఇవాళ పెను ప్రమాదం తప్పింది. నర్సీపట్నం నుంచి కృష్ణదేవిపేట వైపు వెళ్తున్న కారు ఈ జంక్షన్ వద్దకు వచ్చేసరికి ఒక వ్యక్తిని తప్పించబోయి అదుపుతప్పి పక్కనే ఉన్న పెంటకుప్ప వైపు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

March 5, 2026 / 01:29 PM IST

విద్యుత్ తీగ తెగిపడి పాడి గేదె మృతి

సత్యసాయి: పుట్టపర్తి మున్సిపాలిటీ కోవెలగుట్టపల్లిలో విద్యుత్ తీగ తెగిపడి పాడి గేదె మృతి చెందింది. బాధితుడు రమేష్ తెలిపిన వివరాల ప్రకారం నాలుగు నెలల క్రితం రూ.80 వేలతో గేదెను కొనుగోలు చేశారు. ప్రమాదవశాత్తు అది విద్యుత్ ఘాతానికి గురై చనిపోవడంతో కుటుంబానికి జీవనాధారం కోల్పోయానని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరారు.

March 5, 2026 / 01:29 PM IST

అనంతగిరిపల్లిలో కలియతిరిగిన మున్సిపల్ వైస్ ఛైర్మన్

VKB: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లి పదో వార్డులో మున్సిపల్ వైస్ ఛైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి గురువారం పర్యటించారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, విద్యుత్ దీపాలు తదితర అంశాలను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. అప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బందిని పిలిపించి పరిస్థితిని వివరించారు. సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు.

March 5, 2026 / 01:28 PM IST

కల్తీ పాలు.. 11కి చేరిన మృతులు

AP: కల్తీ పాల ఘటనలో మరో ఇద్దరు బాధితులు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఫిబ్రవరి 15న గణేష్ అనే వ్యక్తి పలువురికి కల్తీ పాలను విక్రయించాడు. దీంతో ఆ పాలను తాగి పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ఈరోజు ఇద్దరు మృతిచెందారు.

March 5, 2026 / 01:28 PM IST

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి

PDPL: ధర్మారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 38 మంది లబ్ధిదారులకు 38,04,408 రూపాయల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గురువారం అందజేశారు. పేద ఆడపిల్లలకు ఈ పథకం వరం, సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, గ్రామ సర్పంచులు పాల్గొన్నారు.

March 5, 2026 / 01:27 PM IST

మహబూబాబాద్ నుంచే ఇద్దరు రాజ్యసభ సభ్యులు

MHBD: జిల్లాకు రాజకీయంగా అరుదైన గుర్తింపు లభించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి వేముల నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఖరారు కావడంతో జిల్లాకు కేంద్ర స్థాయిలో ప్రాతినిధ్యం మరింత పెరిగింది. ఇప్పటికే వద్దిరాజు రవిచంద్ర BRS తరఫున 2022 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దీంతో ఒకే జిల్లాలో చెందిన వారు ఎంపిక కావడంలో జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

March 5, 2026 / 01:26 PM IST