• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మావోయిస్టు అగ్రనేత.. ఎవరీ గణపతి?

సుదీర్ఘకాలంగా అజ్ఞాత జీవితాన్ని గడిపిన గణపతి, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. దాదాపు 4 దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమాన్ని నడిపించిన ఆయనపై అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో జరిగిన పలు హింసాత్మక ఘటనల్లో ఆయన పేరు భద్రతా దళాల హిట్‌లిస్ట్‌లో ఉంది.

March 4, 2026 / 08:59 PM IST

సహజ వ్యవసాయ నెట్‌వర్కింగ్ సమావేశం

TPT: ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి సారం కాపాడి, రైతుల ఆదాయం పెరుగుతుందని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ఇవాళ మహతి ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి కొనుగోలు–అమ్మకందారుల నెట్‌వర్కింగ్ సమావేశం నిర్వహించారు. సహజ పద్ధతిలో ఉత్పత్తి చేసిన ధాన్యాలు, పండ్లు, కూరగాయలకు మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోందన్నారు. కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ సీఈవో రామారావు చెప్పారు.

March 4, 2026 / 08:59 PM IST

రోడ్డు ప్రమాదంలో మంగనూరు యువకుడు మృతి

NGKL: బిజినపల్లి మండలం మంగనూరు గ్రామంలో విషాదం నెలకొంది. చింతకాయల లక్ష్మణ్(26) అనే యువకుడు డిండిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మూడేళ్లుగా అక్కడి పెట్రోల్ బంకులో పనిచేస్తున్న లక్ష్మణ్, మంగళవారం రాత్రి బంకు నుంచి భోజనానికి కూరలు తెచ్చుకునేందుకు వెళ్లిన క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలయ్యాయి. ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు.

March 4, 2026 / 08:57 PM IST

కేంద్ర మంత్రి దిష్టిబొమ్మ దహనం

KNR: నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వెన్నం రజిత రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాజీనామా కోరుతూ పట్టణంలో సంతకాల సేకరణ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. మహిళా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. జెఫ్రీ ఎప్‌స్టీన్ వ్యవహారంలో వచ్చిన అంశాలపై స్పష్టత ఇవ్వాలన్నారు.

March 4, 2026 / 08:56 PM IST

యద్దనపూడిలో 4 శనగల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

BPT: యద్దనపూడి మండలంలో శనగల కొనుగోలు కోసం 4 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు బుధవారం వ్యవసాయాధికారి (AO) కుమారి తెలిపారు. అనంతవరం, యద్దనపూడి, జాగర్లమూడి, పూనూరు కేంద్రాల్లో రైతులు తమ పంటను విక్రయించుకోవచ్చని చెప్పారు. ఈ-పంట, సీఎం యాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ మద్దతు ధర వర్తిస్తుందని, పంటలో తేమ శాతం 14 లోపు ఉండాలని ఆమె సూచించారు.

March 4, 2026 / 08:56 PM IST

‘చట్టాన్ని అతిక్రమించే వారిపై క్రిమినల్ కేసులు’

PPM: బాల్య వివాహ నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సబ్ కలెక్టర్ ఆర్ వైశాలి అన్నారు. బుధవారం ఐసీడీఎస్ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చట్టాన్ని అతిక్రమించి జరిపే వివాహాలపై క్రిమినల్ కేసులు బుక్ చేయాలని అన్నారు. ప్రజల్ని మరింత చైతన్య పరచాలన్నారు. టీనేజ్ గర్భధారణపై అవగాహన కల్పించాలన్నారు.

March 4, 2026 / 08:54 PM IST

నూతన దేవాలయ కమిటీ ఎన్నిక

SDPT: శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి సహిత శ్రీరామచంద్రస్వామి నూతన దేవాలయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ గౌరవ అధ్యక్షులుగా కోమటి సత్యనారాయణ, ఛైర్మన్‌గా వెల్దండి లక్ష్మీపతి, ప్రధాన కార్యదర్శిలుగా వడ్డేపల్లి అరుణ, వడ్డేపల్లి లక్ష్మయ్య, కోశాధికారిగా పంతం కన్యాకుమారి లను ఎన్నుకున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా బూర్ల రాజయ్య, కొండా లక్ష్మణ్, కొండా రజిత హాజరయ్యారు.

March 4, 2026 / 08:54 PM IST

ఆస్తి పన్ను వసూళ్లు వేగవంతం చేయాలి: మేయర్

KNR: కరీంనగర్ నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆస్తి పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మరో 26 రోజుల గడువు మాత్రమే ఉన్నందున అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. పన్ను చెల్లింపుపై ప్రజలకు అవగాహన కల్పించి, రూ.30 కోట్ల డిమాండ్ పూర్తి చేయాలన్నారు.

March 4, 2026 / 08:52 PM IST

ఫుడ్ డెలివరీలోకి ర్యాపిడో ఎంట్రీ

టూ వీలర్ రైడింగ్ దిగ్గజం ర్యాపిడో కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ డెలివరీ సేవల కోసం ‘ఓన్లీ’ పేరుతో సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం డెలివరీ యాప్‌గానే కాకుండా.. కస్టమర్లకు, రెస్టారెంట్లకు అత్యంత లాభదాయకమైన ప్లాట్‌ఫామ్‌గా దీనిని తీర్చిదిద్దింది. ఈ యాప్ రెస్టారెంట్ల నుంచి ఎలాంటి కమీషన్ వసూలు చేయబోమని స్పష్టం చేసింది.

March 4, 2026 / 08:50 PM IST

బాధిత కుటుంబానికి MP పరామర్శ..

ADB: తాంసి మండలంలోని గిరిగాం గ్రామంలో ఆదిలాబాద్ MP గోడం నగేశ్ బుధవారం రాత్రి పర్యటించారు. గ్రామ సర్పంచ్ దారట్ల ఉత్తం తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఎంపీ నగేశ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట మండల BJP నాయకులు, స్థానికులు తదితరులున్నారు.

March 4, 2026 / 08:50 PM IST

కంభంలో పోలీసుల నైట్ బీట్

ప్రకాశం: ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే లక్ష్యంగా కంభంలో ఎస్సై శివకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నైట్ బీట్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేస్తూ,ఆధునిక సాంకేతికంతో వేలిముద్రలను క్రైమ్ డేటాబేస్‌‌తో సరిపోల్చుతున్నామన్నారు. నేరాల నివారణకు ఈ చర్యలు దోహదపడతాయని ఎస్సై శివకృష్ణ రెడ్డి పేర్కొన్నారు.

March 4, 2026 / 08:49 PM IST

‘రైతుల ఆదాయ వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

SKLM: రాష్ట్రంలో వరి పంట సాగు విస్తీర్ణాన్ని సమతుల్యం చేస్తూ రైతులను లాభదాయకమైన పంటల వైపు దారితీసే స్పష్టమైన విధానాన్ని కూట‌మి ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. రైతుల ఆదాయ వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులకు అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటున్నారు.

March 4, 2026 / 08:48 PM IST

జాతీయ సమైక్యత శిబిరంలో YVU విద్యార్థుల సత్తా

KDP: బెళగావిలో జరిగిన జాతీయ సమైక్యత శిబిరంలో ప్రతిభ కనబరిచిన వైవీయూ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లను వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అభినందించారు. డా. సునీత నేతృత్వంలో వెళ్లిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబిస్తూ క్విజ్, రంగోలి, పెయింటింగ్ వంటి పోటీల్లో పాల్గొని ప్రశంసలు పొందారు. ఈ శిబిరం జాతీయ సమైక్యతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించబడింది.

March 4, 2026 / 08:47 PM IST

‘విద్యార్థులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి’

AKP: నర్సీపట్నం మండలం చెట్టుపల్లి జడ్పీ హైస్కూల్ వద్ద ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ సూర్య లక్ష్మి మాట్లాడుతూ.. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి విభాగాల్లో యూనిట్ల గురించి వాటి ద్వారా అందించే సేవలు గురించి విపులంగా వివరించారు. విద్యార్థులు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.

March 4, 2026 / 08:46 PM IST

విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్

NZB: ఇందల్వాయిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో రామ్ చరణ్ అనే 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపించారు. ప్రాంతీయ సమన్వయకర్త గంగారాం నాయక్ నేతృత్వంలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఏకలవ్య మోడల్ స్కూళ్ల ప్రిన్సిపల్స్ శ్రీనివాస్, డా.సైదా విచారణ జరిపి నివేదిక అందజేశారు.

March 4, 2026 / 08:45 PM IST