ప్రకాశం: ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే లక్ష్యంగా కంభంలో ఎస్సై శివకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నైట్ బీట్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేస్తూ,ఆధునిక సాంకేతికంతో వేలిముద్రలను క్రైమ్ డేటాబేస్‌తో సరిపోల్చుతున్నామన్నారు. నేరాల నివారణకు ఈ చర్యలు దోహదపడతాయని ఎస్సై శివకృష్ణ రెడ్డి పేర్కొన్నారు.