KDP: బెళగావిలో జరిగిన జాతీయ సమైక్యత శిబిరంలో ప్రతిభ కనబరిచిన వైవీయూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అభినందించారు. డా. సునీత నేతృత్వంలో వెళ్లిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని ప్రతిబింబిస్తూ క్విజ్, రంగోలి, పెయింటింగ్ వంటి పోటీల్లో పాల్గొని ప్రశంసలు పొందారు. ఈ శిబిరం జాతీయ సమైక్యతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించబడింది.