• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రంజాన్ కిట్లు పంపిణీ

కడప నగరంలో ఆప్‌కి ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి షేక్ మక్బూల్ బాషా పేద ముస్లింలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. ఒక దాత సహాయంతో 10 కిలోల బియ్యం, గోధుమ పిండి, నూనె, రవ్వ, చక్కర, మసాలా పదార్థాలు, సేమియాలు, బాదం, కాజు, నెయ్యి తదితరాలతో కూడిన కిట్లు 25 మందికి అందజేశారు. రంజాన్ మాసంలో పేదలకు ప్రభుత్వమే రంజాన్ తోఫా అందించాలని మక్బూల్ కోరారు.

March 4, 2026 / 11:24 AM IST

‘ఫీల్డ్ విజిట్ చేస్తేనే పోస్టింగ్’

TG: జిల్లా కలెక్టర్లు నెలకు కనీసం 10 రోజులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. క్షేత్ర పర్యటనలు చేయని పక్షంలో ప్రజల సమస్యలు అర్థం కావని, పనితీరు ఆధారంగానే పోస్టింగ్‌లపై నిర్ణయం ఉంటుందని హెచ్చరించారు. అలాగే మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించేందుకు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు.

March 4, 2026 / 11:23 AM IST

‘దేశం పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చాలా గొప్పవి’

VZM: కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దేశ అభివృద్ధికి పునాదులు వేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్ పేర్కొన్నారు. బుధవారం రాజాంలో జరిగిన పండిత్ దీన్ దయాల్‌ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ పథకాల ఆవశ్యకతను గ్రామస్థాయిలో తెలిపేందుకు దోహదపడుతుందన్నారు.

March 4, 2026 / 11:22 AM IST

గుడివాడ అమర్నాథ్‌కు ఉమ్మడి జిల్లా పగ్గాలు.!

AKP: వైసీపీ అధిష్ఠానం పార్టీలో కీలక మార్పులు చేపట్టింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్‌గా మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్‌ను నియమించింది. పార్టీ బలోపేతం, కేడర్ సమన్వయం లక్ష్యంగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. స్థానిక నాయకత్వాన్ని ఏకం చేసే బాధ్యతలను అమర్నాథ్‌కు అప్పగించినట్లు జగన్ పేర్కొన్నారు.

March 4, 2026 / 11:22 AM IST

కడప నగరంలో పారిశుధ్యంపై కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

కడప నగరపాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర మార్నింగ్ విజిట్‌లలో భాగంగా ఇవాళ 3, 4, 5వ డివిజన్‌లలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉకాయపల్లి గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను సందర్శించి చెత్త తరలింపు విధానం, పరిశుభ్రత నిర్వహణను సమీక్షించారు. హాజరు నమోదును కూడా పరిశీలించి సమయపాలన పాటించాలని సిబ్బందికి ఆదేశించారు.

March 4, 2026 / 11:21 AM IST

లేఅవుట్ల పరిశీలించిన సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్

GNTR: రాజధాని నిర్మాణంలో భాగంగా మందడం గ్రామంలో నెగోషియేటెడ్ సెటిల్‌మెంట్ పాలసీ అమలును వేగవంతం చేసే దిశగా సీఆర్‌డీఏ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో లేఅవుట్లను తనిఖీ చేశారు. మ్యాప్‌ల ద్వారా అభివృద్ధి పనుల ప్రస్తుత స్థితిగతులను అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు.

March 4, 2026 / 11:20 AM IST

ప్రవాస ఆంధ్రుల భద్రతకు ప్రభుత్వం అండ: మంత్రి

అన్నమయ్య:  గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రవాస ఆంధ్రుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం హెల్ప్‌లైన్ 0863-2340678, వాట్సాప్ 85000 27678ను సంప్రదించాలని సూచించారు.

March 4, 2026 / 11:19 AM IST

అంగన్వాడీ కేంద్రాలకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు

JGL: పిల్లల భవిష్యత్తుకు వెలుగులు నింపే అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించడంలో TGNPDCL కీలక పాత్ర పోషిస్తోందని జగిత్యాల SE బి.సుదర్శనం తెలిపారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యం లేని అంగన్వాడీ కేంద్రాలను గుర్తించి ఉచితంగా కనెక్షన్లు మంజూరు చేస్తున్నామని పేర్కొన్నారు.

March 4, 2026 / 11:19 AM IST

అడవి పందిని ఢీకొన్న బైక్.. ఇద్దరికి తీవ్ర గాయాలు

MHBD: కొత్తగూడ మండలంలో మంగళవారం అర్ధరాత్రి బైక్‌ను అడవి పంది ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. గోపాలపురం-బత్తులపల్లి గ్రామాల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సాయి చరణ్ (14), రుషి (11) తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది వారిని నర్సంపేట ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వారు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.

March 4, 2026 / 11:18 AM IST

అందుకే.. టీచర్‌లా ప్రవర్తించా: శివాజీ

‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. కుటుంబంతో కలిసి చూడదగ్గ చిత్రం. నన్ను నమ్మి బాధ్యత ఇచ్చిన సంస్థకు మంచి అవుట్‌పుట్ ఇవ్వాలని టీచర్‌లా కష్టపడి పనిచేశాను. పెట్టిన ఖర్చంతా స్క్రీన్‌పై కనిపిస్తుంది. మాట ఇచ్చినట్లుగానే మంచి చిత్రాన్ని తీశాను’ అని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.

March 4, 2026 / 11:18 AM IST

వేట్లపాలెం ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటు

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని సూర్య ఫైర్ వర్క్స్‌లో పేలుడుపై విచారణకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. మున్సిపల్ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్, ఈగల్ అధిపతి రవికృష్ణ నేతృత్వంలో కమిటీని నియమించారు. వేట్లపాలెం పేలుడుకు కారణాలేంటి?.. బాధ్యులెవరు అనే అంశాలు తేల్చాలని తెలిపింది. నెల రోజుల్లోగా నివేదిక అందజేయాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.

March 4, 2026 / 11:17 AM IST

2 మాసాల ముందే ఖరీఫ్‌కు సిద్ధం: మంత్రి

SKLM: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రెండు మాసాలు ముందుగానే ప్రారంభించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు తెలిపారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. మే నెల నుంచి ఖరీఫ్ మొదలయ్యే దిశగా ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించి నీటి విడుదలకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు.

March 4, 2026 / 11:14 AM IST

సైబర్ నేరగాళ్ల కొత్త ‘వాట్సాప్’ ట్రిక్.. జాగ్రత్త!

సైబర్ నేరగాళ్లు కాల్ ఫార్వర్డింగ్ ట్రిక్ ఉపయోగించి వాట్సాప్ ఖాతాలను హ్యాక్ చేస్తున్నారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి కాల్స్ ఫార్వార్డ్ చేస్తే, మీ వాట్సాప్ వారి చేతుల్లోకి వెళ్తుంది. ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్నా మీ వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలియని నంబర్ల నుండి వచ్చే సూచనలపై పట్టించుకోకండి.

March 4, 2026 / 11:14 AM IST

విశాఖలో IT జోష్..!

VSP: రుషికొండ ఐటీ పార్క్ హిల్-3లో TCS తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసి 50-100 మంది ఉద్యోగులతో పని మొదలుపెట్టింది. హిల్-2లో కాగ్నిజెంట్ ఫిబ్రవరి 16న 150 మంది సిబ్బందితో కార్యకలాపాలు ప్రారంభించింది. శాశ్వత క్యాంపస్‌ల కోసం TCSకు 21 ఎకరాలు, కాగ్నిజెంట్‌కు 22.19 ఎకరాలను ప్రభుత్వం కేటాయించినట్లు వెల్లడించింది.

March 4, 2026 / 11:12 AM IST

బీమ్ నగర్ పాఠశాలను సందర్శించిన సర్పంచ్

MLG: ఏటూరునాగారం మండలం కోయగూడ గ్రామపంచాయతీ పరిధిలోని (పప్కాపూర్) కొమరం బీమ్ నగర్ ప్రాథమిక పాఠశాలను సర్పంచ్ పోరిక సరిత బుధవారం సందర్శించారు. పాఠశాల పనులు నిలిచిపోయిన విషయాన్ని జిల్లా కలెక్టర్, డీఎఫ్ఓ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఆదివాసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తానన్నారు.

March 4, 2026 / 11:12 AM IST