MHBD: కొత్తగూడ మండలంలో మంగళవారం అర్ధరాత్రి బైక్ను అడవి పంది ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. గోపాలపురం-బత్తులపల్లి గ్రామాల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సాయి చరణ్ (14), రుషి (11) తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది వారిని నర్సంపేట ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వారు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.