CTR: ఎస్ఆర్ పురం మండలం మిట్ట కండ్రిగలో అగ్ని ప్రమాదంలో చెరుకు తోట, గానుగ షెడ్ దగ్ధం అయిన సంగతి తెలిసిందే. బుధవారం రెవెన్యూ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. రైతు నవీన్‌ను సంఘటనపై ఆరా తీశారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపి.. రైతుకు న్యాయం చేస్తామని అధికారులు తెలియజేశారు. వేసవికాలంలో అగ్ని ప్రమాదాలతో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.