KMM: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒక వరమని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మట్టా దయానంద్ అన్నారు. మండలంలోని టేకులపల్లిలో ఇందిరమ్మ ఇళ్ళను ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.