• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గోదావరిలో గల్లంతయ్యింది వీరే..!

BDK: మణుగూరు మండలం గోదావరిలో మంగళవారం స్నానానికి దిగి ఇద్దరు గల్లంతైన విషయం తెలిసిందే. కాగా హోలీ పండుగ సందర్భంగా మల్లెపల్లి సింగరేణి వాటర్ ట్యాంక్ ప్రాంతంలో పద్మగూడెం గ్రామానికి చెందిన గుండి నాగేశ్వరరావు (40), పద్దం ప్రసాద్ (35) (సింగరేణి ఉద్యోగి) స్నానం చేయడానికి గోదావరి నదిలో దిగగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 3, 2026 / 06:40 PM IST

స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసిన సర్పంచ్

MBNR: రాజాపూర్ గ్రామ సర్పంచ్, సర్పంచుల సంఘం రాజాపూర్ మండల అధ్యక్షుడు కావలి రామకృష్ణ మంగళవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్‌లో స్పీకర్‌ను కలిసి గ్రామ పంచాయతీల బలోపేతానికి కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. అనంతరం ఆయన్ను శాలువాతో ఘనంగా సన్మానించారు.

March 3, 2026 / 06:40 PM IST

‘అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చిన ఘనత కూటమిదే’

W.G: పాలకొల్లు రూరల్ నాగరాజుపేటలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొనేందుకు రాగా, అక్కడ తనను కలిసిన అంగన్వాడీలతో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 58,204 మంది సిబ్బందికి రూ. 75 కోట్లతో 5జీ స్మార్ట్ ఫోన్లు అందజేసినట్లు మంత్రి చెప్పారు. పాలకొల్లు నియోజకవర్గంలో రూ. 5.80 కోట్లతో R&బీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

March 3, 2026 / 06:38 PM IST

అక్రమ వెంచర్లు హైడ్రాకు కనిపించడం లేదా?: కవిత

TG: హైడ్రాకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమ వెంచర్లు కనిపించటం లేదా..? అని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో స్థానికులతో కలసి కవిత ఆందోళన చేశారు. మూసీ నది పక్కన నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్‌పై కవిత ఆరోపణలు చేశారు. మూసీని ఆనుకుని భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్మిస్తున్నారని ధర్నా చేపట్టారు.

March 3, 2026 / 06:38 PM IST

ఒంగోలు నగర అభివృద్ధిపై సమీక్ష సమావేశం

ప్రకాశం: ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావులతో కలిసి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. పట్టణ అభివృద్ధిపై సమీక్షించారు

March 3, 2026 / 06:38 PM IST

రోడ్ల మరమ్మతులకు రూ. 3 కోట్ల నిధులు మంజూరు

PLD: రెంటచింతల మండలంలోని దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం రూ. 3 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఇందులో భాగంగా పాలువాయి, తుమృకోట, పశర్లపాడు రహదారులకు రూ. 2.90 కోట్లు, అణుపు రోడ్డుకు రూ. 10 లక్షలు కేటాయించారు. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలపడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

March 3, 2026 / 06:37 PM IST

సీఎం సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

MDK: హైదరాబాద్లోని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ నివేదికను సమర్పించారు.

March 3, 2026 / 06:36 PM IST

పండుగ పూట విషాదం.. గోదావరిలో ఇద్దరు గల్లంతు

BDK: హోలీ పండుగ పూట మణుగూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మల్లేపల్లి వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని పద్మగూడెం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఎస్సై శ్రావణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక జాలర్లు, గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.

March 3, 2026 / 06:36 PM IST

ట్రాక్టర్‌లో వినూత్నంగా హొలీ జరుపుకున్న పిల్లలు

నిజామాబాద్ జిల్లాలోనీ బోధన్ పట్టణంలోని 16వ వార్డులో చిన్నారులు వినూత్నంగా హోలీ సంబరాలు జరుపుకుని అందరినీ ఆకట్టుకున్నారు. పిల్లలు ప్రత్యేకంగా ట్రాక్టర్‌లో నీటిని నింపి, అందులో రంగులు కలిపి వీధుల గుండా తిరుగుతూ ఆనందంగా హోలీ పండుగను జరుపుకున్నారు. వారి ఈ వినూత్న ఆలోచన స్థానికులను ఆకర్షించడంతో పాటు పండుగకు ప్రత్యేక వాతావరణాన్ని తీసుకొచ్చింది.

March 3, 2026 / 06:35 PM IST

లడ్డూ వివాదంపై వారి మౌనం బాధాకరం: రోజా

AP: తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగినప్పటికీ మళ్లీ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం అనవసరం అని మాజీమంత్రి రోజా అన్నారు. ‘ఇందాపూర్ డెయిరీకి నెయ్యి సరఫరా బాధ్యతలు అధిక ధరలకు కట్టబెట్టడంపై అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు, వపన్ కళ్యాణ్ ఈ అంశంపై మౌనం వహించడం బాధాకరం’ అని విమర్శించారు.

March 3, 2026 / 06:34 PM IST

పందిళ్ళపల్లిలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం

BPT: చీరాల నియోజకవర్గం పందిళ్ళపల్లిలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మంగళవారం ఉత్సాహంగా సాగింది. యువ నాయకుడు వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.

March 3, 2026 / 06:34 PM IST

క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

BDK: జిల్లా గిరిజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. ప్రవేశాలకు ఎంపిక జిల్లా స్థాయిలో ఈ నెల 16 నుంచి 18 వరకు, అటు తుది ఎంపికలు భద్రాద్రి, ఖమ్మం జిల్లా స్థాయిలో ఈ నెల 28 నుంచి 30 వరకు జరుగుతాయన్నారు. ఆసక్తి గలవారు ధరఖాస్తు చేసుకోవాలన్నారు.

March 3, 2026 / 06:34 PM IST

వేతనాలకు రాక జీపీ కార్మికుల ఇబ్బందులు

VKB: బొంరాస్పేట మండల వ్యాప్తంగా 35 గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు జీపీ కార్మికులు తెలిపారు. కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వేతనాలు విడుదల అయ్యేలా చొరవ చూపాలని కోరుతున్నారు.

March 3, 2026 / 06:33 PM IST

గ్రహణం ప్రారంభం.. చూశారా..?

భారత్ లో చంద్రగ్రహణం ప్రారంభమైంది. ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై, ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో గ్రహణం ప్రారంభమైంది. ఈ గ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడవచ్చు. 6.46 నిమిషాలకు గ్రహణం ముగుస్తుంది. మరి మీరూ చూసేయండి.

March 3, 2026 / 06:33 PM IST

‘వింటున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి’

MHBD: పెద్దముప్పారం గ్రామంలోని ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని రైతులు వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని క్లస్టర్ AEO ఉదయ్ కిరణ్ హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ చేయకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రైతు సంక్షేమ పథకాలకు అర్హత పొందలేరని స్పష్టం చేశారు. రైతులు తగిన ధృవపత్రాలతో AEO కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

March 3, 2026 / 06:33 PM IST