• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మహిళా కవయిత్రి కుమ్మర మొల్లకు ఘనంగా నివాళులు

ATP: గుత్తి పింఛన్ భవనంలో శుక్రవారం మహిళా కవిత్రి కుమ్మర మొల్ల 586 జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కోశాధికారి జన్నే కుల్లయి బాబు, సెక్రటరీ రామ్మోహన్ ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కవయిత్రి మొల్లను ఆదర్శంగా తీసుకొని ఆమె ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. 

March 13, 2026 / 03:37 PM IST

VIDEO: కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతోనే వరుస ప్రమాదాలు: రాజు

MLG: జాతీయ రహదారి నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయని మల్లంపల్లి మండల సాధన సమితి నాయకులు రాజు, హరీష్, పాషా ఆరోపించారు. ఇవాళ వారు మాట్లాడుతూ.. పనుల క్రమంలో వన్ వే అమలు చేస్తున్నప్పటికీ రోడ్డు డైవర్షన్, సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు.

March 13, 2026 / 03:35 PM IST

‘నేను.. నా మిర్యాలగూడ’ అనే లక్ష్యంతో పని చేయాలి’

నల్గొండ: ప్రతి ఒక్కరికీ విద్యా, వైద్యం అందేలా చూడటమే లక్ష్యమని, “నేను.. నా మిర్యాలగూడ” అనే నినాదంతో అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు. మిర్యాలగూడలో శుక్రవారం జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గం మాట్లాడారు. కలెక్టర్ చంద్రశేఖర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డిసిసి అధ్యక్షుడు పున్న కైలాష్ నేత పాల్గొన్నారు.

March 13, 2026 / 03:35 PM IST

శుద్ధ జలం పంపిణీ చేయాలి :

SKLM: మందస మేజర్ పంచాయితీ కరణం వీధి ప్రజలకు శుద్ధ జలం పంపిణీ కాక అవస్థలు పడుతున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తపరిచారు. ఈ మేరకు శుక్రవారం సర్పంచ్ ప్రతినిధి సిహెచ్ లక్ష్మణమూర్తికు వినతి పత్రం అందజేశారు. చాలా కాలం నుండి కరణం వీధి ప్రజలకు శుద్ధ జలం పంపిణీ జరగడం లేదని, పలుమార్లు సమస్యను అధికారులకు, ప్రజా ప్రతినిధులకు తెలియజేసినప్పటికీ చర్యలు శూన్యమని వాపోయారు.

March 13, 2026 / 03:35 PM IST

‘రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం’

SRCL: రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెలుకల తిరుపతి అన్నారు. శుక్రవారం రుద్రంగి మార్కెట్ కమిటీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్కెట్ కమిటీ ఆదాయ, వ్యయాల బడ్జెట్‌పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మార్కెట్ అధికారులు పాల్గొన్నారు.

March 13, 2026 / 03:32 PM IST

ఈ వారం ఓటీటీలో వచ్చేసిన సినిమాలివే!

* ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘భూకీ’- జీ5* ‘ఫంకీ’, ‘మేడిన్ కొరియా’, ‘పెన్నుమ్ పోరాట్టమ్’- నెట్‌ఫ్లిక్స్* ‘నవాబ్స్ కేఫ్’- ఈటీవీ విన్* ‘కపుల్ ఫెండ్లీ’, ‘లాక్‌డౌన్’- అమెజాన్ ప్రైమ్* ‘రిసార్ట్’ వెబ్‌సిరీస్- జియో హాట్‌స్టార్.

March 13, 2026 / 03:32 PM IST

జిల్లాలో మొల్లమాంబ జయంతి వేడుకలు

అన్నమయ్య: మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి మరియు ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ మధుసూదన రావు మొల్లమాంబ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీరాముని చరిత్రను సరళమైన తెలుగులో రచించిన గొప్ప కవయిత్రి మొల్లమాంబ అని ఆయన పేర్కొన్నారు.

March 13, 2026 / 03:31 PM IST

ఎమ్మిగనూరులో గార్మెంట్ యూనిట్ ప్రారంభం

KRNL: ఎమ్మిగనూరు వెంకటాపురం రోడ్డులో బుట్టా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన గార్మెంట్ యూనిట్‌ను శుక్రవారం మాజీ ఎంపీ బుట్టా రేణుక ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధినేత బుట్టా శివ నీలకంఠ పాల్గొన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ యూనిట్ లక్ష్యమని రేణుక తెలిపారు. స్థానిక మహిళలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని ఆమె వివరించారు.

March 13, 2026 / 03:31 PM IST

ప్రతి ఒక్క అర్జీని పరిష్కరిస్తాం: టీడీపీ రాష్ట్ర కార్యదర్శి

W.G: భీమవరం టీడీపీ ఇంఛార్జ్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా దృష్టికి తీసుకువచ్చిన వితంతు పింఛన్లు, వయోవృద్ధుల పింఛన్లు, గత వైసీపీ ప్రభుత్వంలో వివిధ కారణల వల్ల నిలిపివేసిన పింఛన్లను పరిష్కరిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుందని పేర్కొన్నారు.

March 13, 2026 / 03:31 PM IST

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నవాబుపేట మండలానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఈ పథకాలు ఎంతో ఆసరాగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు పాల్గొన్నారు.

March 13, 2026 / 03:30 PM IST

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. పది మంది అరెస్ట్

ప్రకాశం: అర్ధవీడు మండలం కాకర్ల డ్యాం సమీపంలోని అటవీ ప్రాంతంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. కంభం సీఐ మల్లికార్జున ఆధ్వర్యంలో ఎస్సై శివ నాంచారయ్య, సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడుల్లో 10 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.56,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని స్టేషన్ కు తరలించారు.

March 13, 2026 / 03:30 PM IST

‘పశు సంపద పెంపుతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యం’

కోనసీమ: అమలాపురం మండలం సాకుర్రులో నిర్వహించిన జాతీయ కృత్రిమ గర్భాధారణ అవగాహన సదస్సు, లేగ దూడల అందాల పోటీల కార్యక్రమంలో ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లేగ దూడల ప్రదర్శన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పశు సంపదను కాపాడుకోవడం ద్వారానే స్వచ్ఛమైన పాలు పొంది, కల్తీని నివారించవచ్చన్నారు.

March 13, 2026 / 03:30 PM IST

ఇంటి పన్ను‌ను కట్టించుకుంటున్న డిప్యూటీ ఎంపీడీవో

ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం డిప్యూటీ ఎంపీడీవో జీ. రమేష్ బాబు ఇంటి పన్నును కట్టించుకున్నారు. ఆన్‌లైన్ కడుతున్న ఇంటి పన్నులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ.. ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. పంచాయతీ అభివృద్ధి ప్రజలు అందరు సహకరించాలని తెలిపారు.

March 13, 2026 / 03:29 PM IST

‘మొల్లమాంబ జయంతి అధికారికంగా నిర్వహించాలి’

NRML: కుమ్మర ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కవయిత్రి మొల్ల 586వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మొల్లమాంబ విగ్రహానికి పూలమాల విషయం నివాళులర్పించారు. తెలుగు రామాయణాన్ని రచించిన తొలి కవయిత్రి మొల్ల అని కొనియాడారు. ప్రభుత్వం ముల్ల జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుచ్చన్న గంగాధర్ సాయన్న, తదితరులు పాల్గొన్నారు.

March 13, 2026 / 03:29 PM IST

అన్న క్యాంటీన్ నిర్మాణ పనులు పరిశీలన

VZM: గజపతినగరంలో నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ నిర్మాణ పనులను మంత్రి శ్రీనివాస్ ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు శుక్రవారం పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్  గోపాలరాజు, పీఎసీఎస్ ఛైర్మన్ బంగారు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

March 13, 2026 / 03:29 PM IST