AP: పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట గెజిట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్‌లో పోలవరం, మార్కాపురం జిల్లాలు చేర్చే ప్రతిపాదనలను కేంద్రానికి పంపే అజెండాకు అమోదం లభించింది. పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్‌లో అదనపు గ్రానైట్ కొనుగోలు, లైనింగ్ పనులకు రూ.23.47 కోట్లు కేటాయించారు. పోలవరం ప్యాకేజ్-64 పనులకు రూ.24.51 కోట్లు మంజూరుకు అనుమతి ఇచ్చింది.
MNCL: గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులు భాగస్వాములు కావాలని దండేపల్లి మండల పంచాయతీ అధికారి ప్రసాద్ సూచించారు. దండేపల్లిలోని రైతు వేదికలో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న మొదటి దశ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా వార్డు సభ్యులకు పంచాయతీ రాజ్ చట్టం, గ్రామ పరిపాలన, విధులు, నిధులు, గ్రామ సభ తీర్మానాలు, తదితర వాటిపై అవగాహన కల్పించారు.
E.G: గృహ అవసరాలు, అత్యవసర సేవలకు నిరంతరాయంగా LPG సరఫరా జరిగేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన IOCL, HPCL, BPCL సంస్థలతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగతుందని జిల్లా పౌర సరఫరాల అధికారి వి.పార్వతి శుక్రవారం తెలిపారు. జిల్లాలో ఉన్న 52 LPG గ్యాస్ పంపిణీదారుల ద్వారా సుమారు 8.67 లక్షల గ్యాస్ కనెక్షన్ దారులకు గ్యాస్ సరఫరా జరుగుతోందన్నారు.
VZM: కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతిని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ముఖ్య అతిథిగా హాజరై, కవయిత్రి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సంస్కృత భాషలోని రామాయణాన్ని ప్రప్రథమంగా తెలుగులోకి అనువదించిన మహిళగా మొల్లమాంబ ఘనత సాధించారన్నారు.
KNR: హుజూరాబాద్ పట్టణంలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. మున్సిపల్ ఛైర్ పర్సన్ రొంటాల సుహాసిని, కమిషనర్ సయ్యద్ ముసబ్ అహ్మద్ ఆధ్వర్యంలో శుక్రవారం నీటి ట్యాంకుల శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం పలు వార్డుల్లో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
NDL: ఆళ్లగడ్డలోని సుంకులమ్మ వీధిలో సబ్ యూనిట్ అధికారి శివ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్రైడే – డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. నిల్వ నీటి గచ్చులను పరిశీలించి దోమల లార్వా నిర్మూలన చర్యలు చేపట్టాలని అయన సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులపై కరపత్రాలు పంపిణీ చేశారు.
JN: నర్మెట్ట మండలంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఈనెల 9వ తేదీ నుంచి నేటి వరకు శిక్షణ శిబిరాలను నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు నేడు అధికారులు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధిలో వార్డు మెంబర్లు భాగస్వాములు కావాలని, అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులు సూచించారు.
ADB: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ యూనియన్ అధ్యక్షురాలు సునీత ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్‌కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వేతనాల పెంపుతో పాటు బడ్జెట్‌లో ఐసీడీఎస్‌కు నిధులు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
SKLM: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలుగు సాహిత్యంలోని తొలి ప్రముఖ మహిళా కవయిత్రిగా గుర్తింపు పొందిన మొల్లమాంబ జయంతిని శుక్రవారం అధికారులు నిర్వహించారు. బీసీ కార్పొరేషన్ అధికారి అనురాధ ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేశారు. మొల్ల రామాయణం తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం సంపాదించిందని ఆమె అన్నారు.
TG: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. కాసేపట్లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బస్ భవన్‌కు పోలీసులు, కార్మిక సంఘాల నేతలు భారీగా చేరుకున్నారు.
AP: 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులుగా అప్‌గ్రేడ్ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చిన్న పరిశ్రమలకు ఊతమిస్తూ దాదాపు 17 వేలమందికి ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంది. FRA పట్టాదారులకు రాయితీలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం చెప్పింది. విశాఖ, విజయవాడ, తిరుపతి అప్పీల్ కార్యాలయాల పరిధిపై నిర్ణయం తీసుకుంది.
NLG: మిర్యాలగూడ పట్టణంలో సివిల్ సప్లై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. పట్టణంలోని మంజీరా బార్ అండ్ రెస్టారెంట్, హోటల్స్, కర్రీ పాయింట్‌లపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో సుమారు 36 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా సిలిండర్లు వినియోగిస్తున్న నిర్వాహకులపై 6ఏ కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
GNTR: గుంటూరు చలపతి ఇంజినీరింగ్ కాలేజ్‌లో శుక్రవారం నిర్వహించిన టెక్నికల్ ఫెస్ట్ మహోత్సవంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పాల్గొని, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఇలాంటి టెక్నికల్ ఫెస్టులు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.
కోనసీమ జిల్లాలో అన్నదాత సుఖీభవ, సీఎం కిసాన్ పథకాల ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకు లబ్ధి చేకూర్చడం జరుగుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఆయన అమలాపురంలో మీడియాకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా పలు పథకాల ద్వారా 1,34,829 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
RCB ఆల్ టైమ్ ప్లేయింగ్-11ను దినేష్ కార్తీక్ ప్రకటించాడు. తన జట్టులో గేల్, ఫాఫ్ డుప్లెసిస్‌లతో పాటు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ వంటి దిగ్గజాలకు చోటు కల్పించాడు. మిడిలార్డర్‌లో రజత్ పటీదార్, జితేష్ శర్మలను ఎంపిక చేసిన డీకే.. ఆల్‌రౌండర్ కోటాలో క్రునాల్ పాండ్యా, బౌలింగ్ విభాగంలో హర్షల్ పటేల్, సిరాజ్, హెజెల్‌వుడ్, చాహల్‌ను ఎంచుకున్నాడు.