• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన తహశీల్దార్

NRML: కడెంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రేపటి నుంచి జరగనున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని కడెం తహశీల్దార్ లచ్చిరాం, విద్యాధికారి షేక్ హుస్సేన్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాధికారి షేక్ హుస్సేన్ తెలిపారు.

March 13, 2026 / 04:01 PM IST

చోరీ గురైన రెండు ట్రాక్టర్ల రికవరీ

MBNR: మిడ్జిల్ మండలంలోని కొత్తూరు, మిడ్జిల్ శివార్లలో ఇటీవల చోరీకి గురైన రెండు ట్రాక్టర్లను ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు బృందం రికవరీ చేసింది. నిఘా పెట్టిన పోలీసులు కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే వీటిని స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై టీంను డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ నాగార్జున గౌడ ప్రత్యేకంగా అభినందించారు.

March 13, 2026 / 04:01 PM IST

జిల్లాలో 34 పరీక్ష కేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

SRCL: జిల్లాలో మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల కోసం 34 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం తెలిపారు. మొత్తం 7,317 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా అందులో 3,511 మంది బాలురు, 3,806 మంది బాలికలు ఉన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని సూచించారు.

March 13, 2026 / 04:01 PM IST

కొత్తకోటలో ఉచిత క్యాన్సర్ పరీక్షలు

MBNR: దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓ ట్రస్ట్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. టీబీ నుంచి కోలుకున్న వారికి హెల్త్ కిట్లు అందజేశారు.

March 13, 2026 / 04:01 PM IST

పదో తరగతి పరీక్ష కేంద్రాల తనిఖీ

GDWL: ధరూర్ మండలంలోని పీఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ ఉప్పెర్, మార్లబీడు, ధరూర్ పరీక్షా కేంద్రాలను ఎంఈవో రవీంద్రబాబు శుక్రవారం సందర్శించారు. పరీక్షలకు సర్వం సిద్ధమైందని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించామని ఆయన తెలిపారు. పారదర్శకత కోసం ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

March 13, 2026 / 04:01 PM IST

రోడ్డు బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే

MBNR: నవాబుపేట మండలం లోకిరేవులో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు త్వరలోనే ఇళ్ల పట్టాలు అందజేస్తామని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం 75 గజాల స్థలం ఇస్తామని మోసం చేసిందని విమర్శించారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్‌‌తో చర్చించి బాధితులకు త్వరగా న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

March 13, 2026 / 04:01 PM IST

ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం

GNTR: అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ లీసా గిల్ బదిలీపై ఏపీ హైకోర్టుకు వచ్చారు.

March 13, 2026 / 04:00 PM IST

రష్మిక ‘కాక్‌టెయిల్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్

రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కాక్‌టెయిల్ 2’ విడుదల తేదీ ఖరారైంది. హోమీ అదజానియా తెరకెక్కిస్తున్న ఈ మూవీని 2026, జూన్ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మార్చి 18న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. విజయ్ దేవరకొండతో పెళ్లి తర్వాత విడుదల కానున్న ఆమె తొలి సినిమా ఇదే. ఇందులో షాహిద్ కపూర్, కృతి సనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

March 13, 2026 / 03:59 PM IST

హాస్టల్‌లో ఆహార కొరతపై మంత్రి స్పందన

AP: చీడికాడ బీసీ హాస్టల్‌లో ఆహార కొరత విషయంపై మంత్రి సవిత స్పందించారు. ప్రస్తుతం ప్రభుత్వ భవనంలో మరమ్మతులు జరుగుతున్నాయని తెలిపారు. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ తరచుగా హాజరు కాకపోవడమూ ఇందుకు కారణమని పేర్కొన్నారు. సిబ్బంది విద్యార్థినుల పట్ల సరైన శ్రద్ధ చూపట్లేదని గుర్తించామన్నారు. పాత సిబ్బందిని పూర్తిగా మార్చి.. వారిపై చర్యలకు ప్రతిపాదించినట్లు తెలిపారు.

March 13, 2026 / 03:59 PM IST

భారీగా T20 ప్రపంచకప్ ఆదాయం..!

2026 T20 WC సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం ప్రకటనల ద్వారానే ఈ మెగా టోర్నీ సుమారు రూ.1,500 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించినట్లు ‘Exchange4Media’ వెల్లడించింది. ముఖ్యంగా భారత్-పాక్ పోరుతో పాటు ఫైనల్ మ్యాచ్‌కు ప్రకటనల ధరలు ఆకాశాన్నంటాయి. మీడియా హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, టికెట్ల విక్రయాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం రూ.9,000 కోట్లను దాటుతుందని అంచనా.

March 13, 2026 / 03:58 PM IST

ఏపీ మాజీ డీజీపీ హెచ్ జే దొర మృతి

TG: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్ జే దొర మృతి చెందారు. హైదరాబాద్ ఇంట్లోని బాత్ రూమ్‌లో జారీ పడ్డారు. దీంతో అతణ్ని కుటుంబసభ్యులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, అతను కొన్ని రోజులగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు.

March 13, 2026 / 03:57 PM IST

ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన.. మంత్రి

BHPL: మహిళలు ఆర్థికంగా స్వశక్తిని సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం మహదేవపూర్ సబ్-డివిజన్ పరిధిలోని 850 మంది మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. శిక్షణ పూర్తయ్యాక స్థానికంగా గార్మెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

March 13, 2026 / 03:57 PM IST

అక్రమ గ్యాస్ సిలిండర్ల సీజ్: ఎస్పీ నరసింహ

SRPT: సూర్యాపేట పట్టణంలోని పీఎస్‌ఆర్ సెంటర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 41 గ్యాస్ సిలిండర్లను పోలీసులు సీజ్ చేశారు. ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ.. కృత్రిమ కొరత సృష్టించినా, నల్లబజారులో విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని, ఏజెన్సీలు నిబంధనల ప్రకారం సరఫరా చేయాలని సూచించారు.

March 13, 2026 / 03:56 PM IST

పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశాం: SP

BHPL: జిల్లాలో ఈ నెల 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు SP సంకీర్త్ తెలిపారు. SP మాట్లాడుతూ.. 21 పరీక్షా కేంద్రాల వద్ద BNSS సెక్షన్ 163 (144 సెక్షన్) నిషేధాజ్ఞలు అమలు చేసినట్లు SP వెల్లడించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఎస్పీ కోరారు.

March 13, 2026 / 03:56 PM IST

IISERలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు..!

TPT: ఏర్పేడు వద్ద ఉన్న IISER తిరుపతిలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులకు ఈ నెల 16న వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. మొత్తం 2 ఖాళీలు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. బ్యాచిలర్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్, B.VSc, బీఫార్మసీ లేదా నేచురల్ సైన్స్‌లో డిగ్రీ చేసిన వారు అర్హులు. వివరాలకు www.iisertirupati.ac.in/jobsలో చూడవచ్చు.

March 13, 2026 / 03:52 PM IST