• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మొల్లమాంబ జయంతి వేడుకలు

BPT: శాలివాహన (కుమ్మరి) సంఘం ఆధ్వర్యంలో తొలి తెలుగు కవయిత్రి కుమ్మర మొల్లమాంబ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి సంఘీయులు ఘన నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘీయులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

March 13, 2026 / 05:00 PM IST

గన్నవరంలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: గన్నవరం మండలం కొండపావులూరులో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ మూడో విడత నగదు విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంకు మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే వెంకట్రావు, కలెక్టర్ బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ ఘన స్వాగతం పలికారు.

March 13, 2026 / 05:00 PM IST

వేసవి జాగ్రత్తలపై వైద్య అధికారులు సూచనలు

PLD: పీహెచ్సీలో వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు గూర్చి ఆయన ప్రజలకు వివరించారు. గొడుగు వాడటం, తెలుపు రంగు పలుచటి చేనేత వస్త్రాలు ధరించాలి అని పేర్కొన్నారు. తలకు టోపీ లేదా రుమాలు వాడాలని, వేడిగాలులు తగలకుండా చూసుకోవాలని తెలియజేశారు. శీతల పానీయాలు, మంచు ముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్యం ఏర్పడుతుందన్నారు.

March 13, 2026 / 05:00 PM IST

10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

NTR: వత్సవాయి మండలం మక్కపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు పూర్వ విద్యార్థి వైసీపీ యువజన నాయకుడు గూడెపు వీరబాబు (అంజి ) ప్యాడ్లు, పెన్నులు,పెన్సిల్లు, రబ్బర్లు, పౌచులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు బాగా రాసి గ్రామానికి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

March 13, 2026 / 05:00 PM IST

పరీక్ష కేంద్రాల వద్ద 163BNSS సెక్షన్ అమలు

MNCL: బెల్లంపల్లి మండలంలో రేపు పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద 163BNSS సెక్షన్ అమలులో ఉంటుందని 1 టౌన్ SHO శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు గుమిగుడి ఉండవద్దన్నారు. గంట ముందు నుంచి పరీక్ష పూర్తయిన గంట వరకు అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశించారు.

March 13, 2026 / 05:00 PM IST

ఏప్రిల్ 2 నుంచి జలాధార కార్యక్రమం: సీఎం

AP: ఏప్రిల్ 2న శాఖల పనితీరుపై నివేదికలు ఇస్తానని మంత్రులకు సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే, 90 రోజులపాటు జలాధార కార్యక్రమం చేపట్టాలని సూచించారు. కాలువలు, డ్రెయిన్లు శుభ్రం చేయించి భూగర్భ జలాలు పెంచాలని వెల్లడించారు. మే 15 నాటికి సాగునీరు విడుదల చేయాలని, చివరి ఎకరానికి కూడా నీరిచ్చేలా జలాధార జరగాలని చంద్రబాబు ఆదేశించారు.

March 13, 2026 / 05:00 PM IST

మ్యూజిక్ థెరపీతో ఒత్తిడికి చెక్

మ్యూజిక్ థెరపీ ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను ఇచ్చే ఉత్తమ మార్గం. మెలోడీలు లేదా ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్ వింటే మెదడులో ఆల్ఫా వేవ్స్ ప్రేరేపితమై, మనసు ప్రశాంతంగా మారుతుంది. రక్తపోటు తగ్గుతుంది. ఇది ఆందోళన, డిప్రెషన్‌ను దూరం చేసి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. నిద్రపోయే ముందు స్మూత్ సంగీతం వింటే నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. సంగీతం మనసుకి మంచి ఔషధంలా పనిచేస్తుంది.

March 13, 2026 / 04:56 PM IST

కేంద్రమంత్రికి బీజేపీ ఎమ్మెల్యే విజ్ఞప్తి

TG: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి కొత్త రైలు నడపాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కోరారు. పార్లమెంటు భవనంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి కేంద్రమంత్రిని కలిశారు. ఈ కొత్త రైలును సిర్పూర్ కాగజ్ నగర్, నాగపూర్ మీదుగా హౌరా వరకు నడపాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

March 13, 2026 / 04:55 PM IST

‘భూగర్భ జలాలు పరిరక్షించుకోవాలి’

భువనగిరి: భవిష్యత్ తరాల కోసం నీటి ఎద్దడిని నివారించేందుకు భూగర్భ జల వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కేంద్రీయ భూగర్భ జల బోర్డు ఆధ్వర్యంలో భూగర్భ జలాల సంరక్షణపై ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ లకు ఒక్క రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

March 13, 2026 / 04:53 PM IST

మాజీ డీజీపీ మృతి

SKLM: కోటబొమ్మాలి మండలం జర్జంగి గ్రామానికి చెందిన హనుమంతు జగన్నాథ్ దొర (హెచ్‌జె దొర) అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌లో మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీగా, ఆంధ్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీగా విధులు నిర్వహించారు.

March 13, 2026 / 04:53 PM IST

అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

AKP: అచ్యుతాపురం ఏపీఐఐసీ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శుక్రవారం అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. చేపట్టిన అభివృద్ధి పనులలో వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అచ్యుతాపురం జంక్షన్లో రహదారి విస్తరణ పనులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

March 13, 2026 / 04:51 PM IST

‘పదవ తరగతి విద్యార్థులకు వసతులు కల్పించాం’

KMM: ముదిగొండ మండలంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి రమణయ్య శుక్రవారం పేర్కొన్నారు. ముదిగొండ, మేడపల్లి, ముత్తారం, వల్లభి, బాణాపురం, ఈ ఐదు కేంద్రాల్లో 516 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. విద్యార్థుల కోసం తాగునీరు, వెలుతురు వంటి వసతులు కల్పించామన్నారు.

March 13, 2026 / 04:51 PM IST

‘ఇష్టపడి చదివితేనే ఉన్నత ర్యాంకులు’

ADB: విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే వార్షిక పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించగలుగుతారని PRTU తెలంగాణ సంఘం జిల్లా అధ్యక్షుడు ఆడే నూర్ సింగ్ అన్నారు. శుక్రవారం నేరడిగొండ మండలంలోని కుంటాల(కే) బాలికల ఆశ్రమ పాఠశాల, స్థానిక కస్తూర్బా గాంధీ పాఠశాలను సందర్శించారు. అనంతరం విద్యార్థినులకు ప్రేరణ తరగతి నిర్వహించారు.

March 13, 2026 / 04:50 PM IST

సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా

HNK: భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉప్పలయ్య హాజరై మాట్లాడుతూ.. CSC టెస్టులను రద్దు చేయాలని, పెండింగ్ క్లైములకు వెంటనే నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.

March 13, 2026 / 04:50 PM IST

చలో హైదరాబాద్ జయప్రదం చేయండి: MCPIU

WGL: MCPIU పార్టీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో MCPIU జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే తన జీవిత ధ్యేయంగా తీసుకుని సర్వస్వాన్ని త్యాగం చేసిన మార్క్రిరిస్టు యోధుడు మద్దికాల ఓంకార్ అని పేర్కొన్నారు. ఈనెల 17న రవీంద్ర భారతిలో నిర్వహించే శత దినోత్సవ వేడుకలు విద్యావంతం చేయాలని కోరారు.

March 13, 2026 / 04:49 PM IST