• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నాణ్యత విషయంలో రాజీ పడ్డొద్దు: అభిషేక్ అగస్త్య

KMM: ఖమ్మంలోని 50, 27వ డివిజన్లలో శుక్రవారం కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య పర్యటించారు. డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను పరిశీలించి, వర్షాకాలంలో నీరు నిల్వకుండా, డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సీసీ రోడ్డు పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.

March 13, 2026 / 07:45 PM IST

పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి: MEO

MLG: రేపటి నుంచి ప్రారంభం ప్రారంభమయ్యే 10వ తరగతి వార్షిక పరీక్షలకు వెంకటాపురం మండలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని MEO సత్యనారాయణ తెలిపారు. మండలంలో మొత్తం 326 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో డెస్కులు, తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు, లైటింగ్, విద్యుత్ సరఫరా వంటి అవసరమైన సదుపాయాలన్నీ కల్పించామని పేర్కొన్నారు.

March 13, 2026 / 07:44 PM IST

ప్రజా సమస్యలు సత్వర పరిష్కామే లక్ష్యం: ఎమ్మెల్యే

కోనసీమ:: మండపేట నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తెలిపారు. TDP కార్యలయంలో శుక్రవారం ఎమ్మెల్యే PGRS కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల వద్ద నుంచి ఆయన స్వయంగా వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు.

March 13, 2026 / 07:44 PM IST

విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి: ఏబీవీపీ

ADB: పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఏబీవీపీ నేత మాడవార్ హరీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం బేలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి వార్షిక పరీక్షలు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా విద్యార్థుల ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు.

March 13, 2026 / 07:43 PM IST

బస్టాండ్‌లో డాగ్ స్క్వాడ్ ముమ్మర తనిఖీలు

ATP: జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాలతో ఆర్టీసీ బస్టాండ్‌లో డాగ్ స్క్వాడ్ ద్వారా త్రీ టౌన్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్స్ పసిగట్టడంలో శిక్షణ పొందిన ‘టైగర్’ జాగిలంతో అనుమానితుల బ్యాగులు, లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయి, అక్రమ మద్యం రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ పర్యవేక్షణలో ఈ సోదాలు జరిగాయి.

March 13, 2026 / 07:43 PM IST

‘సర్కార్ 4’పై RGV క్రేజీ అప్‌డేట్

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సూపర్ హిట్ పొలిటికల్ క్రైమ్ ఫ్రాంచైజీ ‘సర్కార్ 4’ షూటింగ్‌ను వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు ప్రకటించాడు. ముంబైలో జరిగిన రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించాడు. దీనితో పాటు ‘సిండికేట్’ అనే మరో సినిమాపై కూడా పని చేస్తున్నట్లు చెప్పాడు. స్టీవెన్ స్పీల్‌బర్గ్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ దర్శకుడని వర్మ పేర్కొన్నాడు.

March 13, 2026 / 07:43 PM IST

క్షయ నియంత్రణపై వైద్యులకు అవగాహన కార్యక్రమం

JGL: క్షయ బాధితులు అందుబాటులో ఉన్న వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డా. శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జగిత్యాల మాతా శిశు సంరక్షణ ఆస్పత్రిలో టీబీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులకు క్షయ బాధితులకు అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించారు. పల్మనాలజిస్ట్ డా.సునీత దేవి డ్రగ్ రెసిస్టెంట్ టీబీపై ప్రజెంటేషన్ ఇచ్చారు.

March 13, 2026 / 07:42 PM IST

‘పాఠశాల స్థలం ఆక్రమణ చేస్తే కఠిన చర్యలు’

VZM: మెరకముడిదాం మండలం బైరిపురం బాదంపెంటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన స్థలం ఆక్రమణకు గురైందని గ్రామ యువత గ్రీవెన్స్ అధికారులకు అందించారు. ఎమ్మార్వో సులోచన రాణి ఆదేశాలతో శుక్రవారం గ్రామ సర్వేయర్, వీఆర్వో కలిపి సర్వే నంబర్ 31-15A 85 సెంట్లుకు సంబంధించి విచారణ చేపట్టి హెచ్చరిక బోర్డు, హద్దులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రాంబాబు పాల్గొన్నారు.

March 13, 2026 / 07:42 PM IST

YVU బంద్‌కు ప్రయత్నం.. విద్యార్థి నాయకులు అరెస్ట్..!

KDP: యోగి వేమన విశ్వవిద్యాలయంలో స్నాతకోత్సవాన్ని క్యాంపస్‌లో నిర్వహించకపోవడాన్ని నిరసిస్తూ ఆర్‌ఎస్‌ఎఫ్, వైవియు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు బంద్‌కు పిలుపునిచ్చారు. శుక్రవారం వైవియు ప్రధాన ద్వారం వద్ద నినాదాలు చేస్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

March 13, 2026 / 07:41 PM IST

‘మనమిత్ర’లో ఏయూ పరీక్ష ఫలితాలు

VSP: ఏయూ విద్యార్థులు ఇకపై తమ పరీక్ష ఫలితాలను వాట్సాప్ ద్వారానే తెలుసుకునే సౌకర్యం అందుబాటులోకి తెచ్చినట్లు ఉపకులపతి రాజశేఖర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మనమిత్ర యాప్ ద్వారా ఈ సదుపాయం కల్పించినట్లు చెప్పారు. ఏయూ సెనేట్ హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ సేవకు సంబంధించిన డెమోను చూపించారు.

March 13, 2026 / 07:40 PM IST

మియాపూర్ చెరువులకు మహర్దశ

RR: ఉమ్మడి మియాపూర్ డివిజన్ల పరిధిలోని చెరువులను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో, మక్త మహబూబ్ పేట ‘పెద్ద కుడి చెరువు’ పునరుద్ధరణ పనులను తాజా మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మల్లిగవాడ్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి పరిశీలించారు. MLA గాంధీ సహకారంతో, CSR నిధులతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.

March 13, 2026 / 07:39 PM IST

ప్రమాద బీమా చెక్కు అందజేసిన కావలి ఎమ్మెల్యే

NLR: కావలి రూరల్ మండలం సిరిపురం గ్రామానికి చెందిన టీడీపీ కుటుంబ సభ్యుడు పెపాల దర్గాబాబు విద్యుత్ షాక్‌కు గురై ప్రమాదవశాత్తు ఇటీవల మృతి చెందారు. టీడీపీ సభ్యత్వం కలిగి ఉండటంతో టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి మంత్రి నారా లోకేశ్ పంపిన రూ.5 లక్షలను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి శుక్రవారం దర్గా బాబు భార్య హైమావతికి అందజేశారు.

March 13, 2026 / 07:39 PM IST

రైతుకు వెన్నుదన్నుగా ప్రభుత్వం

SKLM: ఆరుగాలం శ్రమించే రైతులకు పెట్టుబడి సాయం అందించి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని టెక్కలి RDO యం. కృష్ణమూర్తి అన్నారు. సంతబొమ్మాలి మండలంలోని అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ మూడవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులు పంట మార్పిడిపై దృష్టి సారించి తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వచ్చేలా ఆలోచన చేయాలని కోరారు.

March 13, 2026 / 07:37 PM IST

JCB ద్వారా మట్టి త్రవ్వి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

BDK: బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ పీఎస్పీడీ సిఎస్ఆర్ నిధుల నుండి రూ.50 లక్షల వ్యయంతో మంజూరైన సిసి డ్రైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ.. మండలంలో ఐటీసీ సంస్థ ఉండడం మండల ప్రజల అదృష్టమని అన్నారు. ఐటీసీ సీఎస్ఆర్ నిధుల ద్వారా ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.

March 13, 2026 / 07:37 PM IST

‘లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్‌తో ప్రాణాలకు రక్షణ’

GNTR: అధిక స్థాయి కాలేయ వ్యాధులు, కాలేయ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రాణాలను రక్షించే చికిత్సని గుంటూరులో యశోదా హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డా. పార్థసారథి వివరించారు. జన్యుపరమైన లివర్ వ్యాధులు, క్రానిక్ హెపటైటిస్ వల్ల వచ్చే సమస్యల్లో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం అవుతుందని తెలిపారు.

March 13, 2026 / 07:35 PM IST