• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గుణుపూరులో ‘పల్లెనిద్ర’ చేసిన ఎస్సై

VZM: డెంకాడ మండలంలోని గుణుపూరు గ్రామంలో ఎస్సై సన్యాసినాయుడు శుక్రవారం రాత్రి ‘పల్లె నిద్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై గ్రామస్థులకు చట్టాలపై అవగాహన కల్పించి, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అలాగే, సైబర్‌ క్రైమ్‌ నేరాల భారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. OTPలు ఇతరులకు చెప్పడం వంటివి చేయరాదని ఆయన స్పష్టం చేశారు.

March 14, 2026 / 06:41 AM IST

మహిళా జర్నలిస్టుకు రెండు గోల్డ్ మెడల్స్

KRNL: యోగి వేమన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో జర్నలిజం PG కోర్సులో ఆదోనికి చెందిన మహిళ జర్నలిస్టు షేక్ తస్లీమాకు రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా మెడల్స్ అందుకున్నారు. విశ్వవిద్యాలయంలో మొత్తం 174 మంది గోల్డ్ మెడలిస్టులు ఉండగా.. టాప్-10 మందికి గవర్నర్ స్వయంగా మెడల్స్ అందజేశారు.

March 14, 2026 / 06:41 AM IST

జై భీమ్ పార్టీ అధ్యక్షుడిపై కేసు నమోదు

ATP: ​జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్‌పై అనంతపురం మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నగరానికి చెందిన ధనుంజయ భూవివాదం కేసు కోసం శ్రావణ్ కుమార్‌కు రూ. లక్ష ఇచ్చారు. అయితే, న్యాయవాది దావా వేయకపోవడంతో బాధితుడు డబ్బులు వెనక్కి అడిగారు. ఫోన్ పే ద్వారా 65 వేలు చెల్లించి మిగిలిన డబ్బులు ఇవ్వకుండా బెదిరించారని బాధితుడు ఫిర్యాదు చేశారు.

March 14, 2026 / 06:40 AM IST

క్యూఆర్ కోడ్‌తో టెన్త్ హాల్ టికెట్లు.. ఎందుకంటే?

KDP: రాష్ట్రంలో టెన్త్ విద్యార్థులకు ఊరట లభించింది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడకుండా హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రానికి సులభంగా చేరుకోవచ్చు. ఈ నెల 16 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆయా సెంటర్లలో 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

March 14, 2026 / 06:40 AM IST

MGNREGS పనులను పరిశీలించినఅధికారులు

KNR: గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో శుక్రవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఉప్పులు శ్రీధర్ MGNREGS పని ప్రదేశాన్ని పరిశీలించారు. గ్రామంలోని పాత చెరువు చేపల కుంట పని 65 మంది కూలీలతో జరుగుతుండగా వారితో ఆయన మాట్లాడారు. కొత్తగా అమలులోకి వచ్చిన ఈకేవైసీ ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా కూలీల హాజరు స్థితిని పరిశీలించారు.

March 14, 2026 / 06:38 AM IST

నేడు APCRDA కార్యాలయంలో “గ్రీవెన్స్” డే రద్దు

GNTR: అమరావతి రైతులు, కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని ఏపీసీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో ప్రతి శనివారం నిర్వహించే “గ్రీవెన్స్ డే” నేడు రద్దు చేయబడింది. రెండో శనివారం, ఇతర నిర్వహణ కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రాజధాని ప్రాంత ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

March 14, 2026 / 06:37 AM IST

‘వంట గ్యాస్ సిలిండర్లకు ఇబ్బంది లేదు’

JGL: జిల్లాలో సరిపడా వంట గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేవని జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లత అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధ్యక్షతన గ్యాస్ ఏజెన్సీ యాజమానులు, సేల్స్ ఆఫీసర్లు, జిల్లా తహాసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వంట గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ ఉంచకుండా చర్యలు తీసుకోవలన్నారు.

March 14, 2026 / 06:37 AM IST

పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

ADB: పదో తరగతి వార్షిక పరీక్షలను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ నుంచి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు జారీ చేశారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయం కంటే ముందే చేరుకునేలా చూసుకోవాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతించడం జరగదని స్పష్టం చేశారు.

March 14, 2026 / 06:37 AM IST

మెట్రో స్టేషన్ నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

TG: హైద‌రాబాద్‌లో మ‌రో విషాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ రెండవ అంతస్తుపై నుంచి బీటెక్ విద్యార్థి నిత్యతేజ్ దూకాడు. ఈ త‌రుణంలోనే అతణ్ని 108 వాహనంలో గాంధీ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. కానీ ఆసుపత్రికి చేరుకునేలోపే నిత్యతేజ్ మృతి చెందాడు.

March 14, 2026 / 06:37 AM IST

మంత్రి కాన్వాయ్ పై దాడి కేసులో BRS నాయకులు విడుదల

MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో గత నెల 17న జరిగిన మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ పై జరిగిన దాడిలో అరెస్టయిన BRS నాయకులు బండారి సూరిబాబు, మేడిపల్లి సంపత్, ఎండి ముస్తఫా ఆదిలాబాద్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. అన్యాయంగా తమపై కేసులు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. మంత్రి వివేక్‌కు ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.

March 14, 2026 / 06:36 AM IST

నేడు జనసేన ‘ఆవిర్భావ’ వేడుకలు

AP: ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. అయితే ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ సారి భారీ సభలకు బదులుగా సామాజిక కార్యక్రమాలతో పాటు జిల్లా, మండల స్థాయి కార్యక్రమాలకు పార్టీ చీఫ్, Dy.CM పవన్ నిర్ణయించారు. ఇక ఇవాళ అల్లూరి జిల్లా పాడేరులో పర్యటించనున్న ఆయన.. స్థానిక నందిగరువు గ్రామ గిరిజనుల మధ్య వేడుకలు జరుపుకోనున్నారు.

March 14, 2026 / 06:36 AM IST

నేడు సోలార్ ప్రాజెక్టును ప్రారంభించనున్న ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ నేడు బల్మూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సోలార్ ప్యానెల్ ఏర్పాటు కార్యక్రమాన్ని ఆయన లాంచనంగా ప్రారంభించనున్నారు. ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ అందించే లక్ష్యంతో అధికారులు ఈ ప్రణాళికను సిద్ధం చేశారు.

March 14, 2026 / 06:36 AM IST

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

GDWL: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాన్ని రూ.18,000కు పెంచాలని కోరుతూ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుకు వినతిపత్రం అందజేశారు. ఐసీడీఎస్‌కు నిధులు కేటాయించాలని, ప్రీ-ప్రైమరీ విద్యను అంగన్వాడీల్లోనే కొనసాగించాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

March 14, 2026 / 06:35 AM IST

బొమ్మిశెట్టి రమేశ్‌కు ఘనంగా సన్మానం

KDP: మైదుకూరుకు చెందిన రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేశ్‌ను శుక్రవారం పలువురు ఘనంగా సన్మానించారు. కడప కలెక్టరేట్‌లొ సాహితీ పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు, భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత, విద్వాన్ గానుగ పెంట హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ చేతుల మీదుగా సన్మానం పొందారు. చరిత్రకు సంబంధించి ఆయన చేస్తున్న పరిశోధనలకు ఈ సత్కారం లభించింది.

March 14, 2026 / 06:35 AM IST

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు

MDK: శివంపేట మండలం ఉసిరికపల్లి గ్రామ శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పంబ గ్రామానికి చెందిన కమ్మరి నాగరాజు భర్యతో కలిసి బైక్ వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన భార్య అంజమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

March 14, 2026 / 06:33 AM IST