• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రజినీకాంత్ సినిమాలో శోభన..!

సూపర్ స్టార్ రజినీకాంత్, యువ దర్శకుడు సిబి చక్రవర్తి కాంబోలో ‘తలైవార్ 173’ గ్రాండ్‌గా అనౌన్స్ అయింది. ఈ చిత్రాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో రజినీ సరసన శోభన నటించే అవకాశం ఉంది. వీరిద్దరూ గతంలో ‘దళపతి’ (1991) చిత్రంలో వెండితెరపై మ్యాజిక్ చేసిన సంగతి తెలిసిందే.

March 16, 2026 / 10:20 AM IST

రోడ్డు ప్రమాదంలో ఉప సర్పంచ్ మృతి

RR: కేశంపేట మండలం సంతాపూర్ గ్రామ ఉప సర్పంచ్ అంజయ్య ఇవాళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పంట నారు కోసం రాయలసీమలోని పెనుగొండకు వెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆయన ప్రయాణిస్థున్న వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టడంతో రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందినట్లు సమాచారం. ఉప సర్పంచ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

March 16, 2026 / 10:20 AM IST

కూలీల ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు

కడప: కాశీనాయన మండలంలో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. ఉప్పలూరు నుంచి నరసాపురానికి 10 మందికి పైగా కూలీలు ఆటోలు బయల్దేరారు.. నరసాపురం సమీపంలో కుక్క అడ్డు రావడంతో ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలకు గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

March 16, 2026 / 10:19 AM IST

FPO సభ్యత్వం కోసం రైతులకు పిలుపు

KNR: వీణవంక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు FPOలో సభ్యత్వం పొందాలని సంఘం కార్యదర్శి చందుపట్ల ప్రకాశ్ రెడ్డి సూచించారు. ప్రస్తుతం రూ.300తో సొసైటీ సభ్యులుగా ఉన్న వారు రూ.2000 చెల్లించి FPO సభ్యత్వం తీసుకోవచ్చన్నారు. FPO సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే ఎన్సీడీసీ ద్వారా ప్రతి సంవత్సరం రూ.2000 ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు.

March 16, 2026 / 10:17 AM IST

నందికొట్కూరులో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

నంద్యాల: నందికొట్కూరు పట్టణంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గిత్త జయసూర్య, సింగిల్ విండో ఛైర్మన్ మృతుజావలి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన ప్రాణత్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు సూరి, తదితరులు పాల్గొన్నారు.

March 16, 2026 / 10:16 AM IST

‘భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించాలి’

MNCL: జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ పరిధిలో ఉన్న రైతులు భూసార పరీక్షలను తప్పనిసరిగా చేయించాలని కవ్వాల్ క్లస్టర్ ఏఈఓ అక్రమ్ సూచించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పంటలలో దిగుబడిని పెంచేందుకు, పురుగుల ఉధృతిని తగ్గించేందుకు భూసార పరీక్షలు ఉపయోగపడతాయన్నారు. సోమవారం నుండి భూసార పరీక్షలు చేస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 16, 2026 / 10:16 AM IST

అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘనంగా నివాళులు

ATP: గుత్తి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఇవాళ అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ హాజరయ్యారై పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఉద్యమించిన మహనీయుడి ఆశయ సాధనకు కృషి చేయడమే అమరజీవికి మనమిచ్చే నివాళి అన్నారు.

March 16, 2026 / 10:15 AM IST

భోగాపురం ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీపై కాలయాపన?

VSP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం ఆమోదించిన కోస్టల్ కారిడార్ ప్రాజెక్టుకు ఇప్పటివరకు భూసేకరణ కూడా చేపట్టలేదని నిపుణుల కమిటీ నివేదిక వెల్లడించింది. ప్రయాణికులకు రవాణా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ప‌లు జాతీయ ప‌త్రిక‌లు కథనాలు ప్రచురించాయి.

March 16, 2026 / 10:15 AM IST

పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: DEO

కర్నూలు: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చీఫ్ సూపరింటెండెంట్లు పర్యవేక్షించాలని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ ఆదేశించారు. సోమవారం డీఈవో కార్యాలయం నుంచి నిర్వహించిన కమాండ్ కంట్రోల్ సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఏవైనా అసౌకర్యాలు కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 16, 2026 / 10:14 AM IST

టెన్త్ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ

PPM : జిల్లాలో మార్చి16 నుంచి ఏప్రిల్1 వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు 222 పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తూ డ్రోన్‌లు,పెట్రోలింగ్ బృందాలతో నిఘా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విద్యార్థులు ఒత్తిడి లోనుకాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.

March 16, 2026 / 10:13 AM IST

బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్‌లో భారత్‌కు స్వర్ణం

ప్రపంచ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్‌లో చంద్రిక పూజారి సత్తా చాటింది. మహిళల విభాగం ఫైనల్‌లో ఆమె (51 కేజీలు) స్వర్ణంతో మెరిసింది. మర్దొనోవా నజోఖత్ (ఉజ్బెకిస్తాన్‌)పై విజయం సాధించింది. గుంజాన్ (48 కేజీలు), జోయ్‌శ్రీ దేవి (54), అంబేకర్ (50) ఫైనల్‌లో ఓటమిపాలయ్యారు. దీంతో వారంతా రజతంతో సరిపెట్టుకున్నారు. కాగా, ఇప్పటికే రాధామణి (57) కాంస్యం సాధించింది.

March 16, 2026 / 10:10 AM IST

గూడూరులో ధరలు పతనం.. కారణం ఇదే!

TPT: కోల్డ్ స్టోరేజ్ నిమ్మకాయలతో ధరలు పతనమవుతున్నాయి. కిలో నిమ్మ ప్రస్తుతం రూ.80 నుంచి రూ.90 పలుకుతోంది. 2 నెలల కిందట గూడూరులో కిలో రూ.50లోపు ఉన్న సమయంలో వేల టన్నుల నిమ్మకాయలు గుజరాత్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజీలో వ్యాపారులు నిల్వ చేశారు. ధరలు పెరగడంతో వీటిని ఇప్పుడు దేశంలోని అన్ని మార్కెట్లలోకి డంప్ చేస్తున్నారు.

March 16, 2026 / 10:10 AM IST

‘త్యాగానికి ప్రతిరూపం అమరజీవి పొట్టి శ్రీరాములు’

PLD: త్యాగానికి ప్రతీ రూపం అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర నాయకులు చౌట శ్రీనివాసరావు అన్నారు. సత్తనపల్లి గాంధీ చౌక్ సెంటర్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు.

March 16, 2026 / 10:08 AM IST

శిథిలావస్థలో వంతెన

ASR: అనంతగిరి మండలంలో బొర్రా గుహలుకు వెళ్లే మార్గంలో గేటువలస వద్ద ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుంది. వంతెన కింద భాగంలోని సైడ్ దిమ్మలు దెబ్బతినడంతో వాహనాలు వెళ్లే సమయంలో కదలికల శబ్దాలు వినిపిస్తున్నాయి. దీంతో స్థానికులతో పాటు గుహలను దర్శించేందుకు వచ్చే పర్యాటకులు భయాందోళనకు గురవుతున్నారు. వంతెన మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

March 16, 2026 / 10:08 AM IST

అమెరికాలో వరంగల్ వాసి మృతి

TG: అమెరికాలో వ‌రంగ‌ల్‌కు చెందిన ఓ వ్యక్తి మృతిచెందాడు. వరంగల్ నగరం రామనాథపురి కాలనీకి చెందిన రాకేశ్(40) అమెరికాలో గుండెపోటుతో మరణించారు. రాకేశ్ ఉద్యోగ రీత్యా పదేళ్లుగా అమెరికాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం వర్జీనియా రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు. 2014లో కరీంనగర్‌కు చెందిన తేజస్వినితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

March 16, 2026 / 10:08 AM IST