కర్నూలు: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చీఫ్ సూపరింటెండెంట్లు పర్యవేక్షించాలని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ ఆదేశించారు. సోమవారం డీఈవో కార్యాలయం నుంచి నిర్వహించిన కమాండ్ కంట్రోల్ సెట్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు ఏవైనా అసౌకర్యాలు కలిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.