HYDలోని అల్లు సినిమాస్ డాల్బీ స్క్రీన్‌లో ‘ధురంధర్ 2’ ప్రీమియర్ ప్రతిపాదనను దర్శకుడు ఆదిత్య ధర్ తిరస్కరించాడట. రూ.1000 కోట్ల వసూళ్లు సాధించిన మొదటి భాగం తర్వాత ఆయన ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నాడు. కేవలం థియేటర్ క్రేజ్ కోసం సౌత్‌లో ప్రమోట్ చేయడం అనవసరమని భావించాడట. బాలీవుడ్‌లోనూ ప్రమోషన్లకు దూరంగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్.
MLG: పట్టణ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఒజ్జల లింగయ్య కుమార్తె వివాహా మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బానోతు రవి చందర్ హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వధూవరులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
BPT: ఈ నెల 16, 17, 18వ తేదీల్లో రాజమండ్రిలో జరిగే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ పిలుపునిచ్చారు. శనివారం ఏఐటీయూసీ కార్యాలయంలో మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. సుప్రీంకోర్టు జీవో ప్రకారం మున్సిపల్ కార్మికులకు రూ. 26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
NGKL: కల్వకుర్తి మండలంలోని తోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డాక్టర్ రవికుమార్ పరిశీలించారు. ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించిందన్నారు. దాదాపు 200 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారని ఆయన తెలిపారు.
NLR: వరికుంటపాడు పామూరుపల్లిలో టీడీపీ మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు, సర్పంచ్ తెల్లగొర్ల సుశీల వెంకటయ్య రూ. 10 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను శనివారం చేపట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల కాలంలో మండలంలోని అన్ని గ్రామాలలో సిమెంట్ రోడ్లు నిర్మాణ పనులను చేపట్టడం జరిగింది అని ఆయన తెలిపారు.
NGKL: నియోజకవర్గ రైతులకు రబీ పంట పండేంతవరకు వాటర్ విడుదల చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ కూచకుళ్ల రాజేష్ రెడ్డి తెలిపారు. రైతులు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి రేపటి నుంచి కంటిన్యూగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పంటలు పూర్తిగా పండే వరకు నీళ్లు వదలాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రజలు సకాలంలో పన్నులు చెల్లిస్తూ పట్టణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య కోరారు. 55వ డివిజన్‌లో నిర్వహించిన ‘శుభ్రత – ప్రతి ఒక్కరి బాధ్యత’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు సక్రమంగా జరగాలంటే ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.
ASR: వైసీపీ గాజువాక నియోజకవర్గ పరిశీలకుడిగా అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలానికి చెందిన పసుపులేటి బాలరాజును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గూడెంకాలనీ గ్రామానికి చెందిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. పార్టీ బలోపేతం దృష్ట్యా ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపారు.
PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని గవర్నమెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ క్రమంలో విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆమె మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు ధైర్యంగా రాయాలని విద్యార్థినిలకు సూచించారు.
AKP: జిల్లాలో 31 కేంద్రాల్లో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 196 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 2,031 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 1,835 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా పకడ్బందీగా ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
HNK: నగరంలోని గుండ్ల సింగారం కారల్ మార్క్స్ 143వ వర్ధంతిని సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీపీఐ మండల కార్యదర్శి స్టాలిన్ మాట్లాడుతూ.. శ్రమ విలువను గుర్తించి పెట్టుబడిదారీ శ్రమ దోపిడీ వ్యవస్థ యొక్క కుట్రలను ఎత్తిచూపి ప్రపంచ గమనాన్ని మార్చిన సిద్ధాంతం మార్క్సిజమని, ఆ సిద్ధాంత రూపకర్త కారల్ మార్క్స్ అని అన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.
SKLM: పోలాకి మండలం పరిషత్ కార్యాలయంలో శనివారం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే రమణమూర్తి హాజరయ్యారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలుపై చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న వేసవి కాలంలో ప్రజలకు తాగునీరు సమస్య లేకుండా తగు చర్యలు చేపట్టాలని చూడాలని అధికారులను ఆదేశించారు.
GNTR: తెనాలిలో మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు శనివారం పర్యటించారు. రెవెన్యూ అధికారులతో కలిసి పన్ను బకాయిదారుల నివాసాలకు వెళ్లి మాట్లాడారు. మార్చి చివరి నాటికి ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో, ఇంటి పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికి 75 శాతం వసూళ్లు పూర్తయ్యాయని, నెలాఖరు నాటికి 100% వసూళ్లు లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని తెలిపారు.
JN: వచ్చే వర్షాకాలం వరకు కాలువ లైనింగ్ పనులు పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగు నీరు అందించే బాధ్యత తనదాని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జఫర్‌గడ్ మండలంలోని తీగారం, హిమ్మత్ నగర్ గ్రామాల మధ్య కాలువను పరిశీలించారు. కాలువ వెంట క్షేత్రస్థాయిలో తిరుగుతూ రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
TG: పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ చర్యలకు బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో రాహుల్ దిష్టిబొమ్మను తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు దగ్ధం చేశారు. రాహుల్ గాంధీకి పార్లమెంట్ పిక్నిక్‌లా మారిందని విమర్శించారు. రాహుల్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.