VSP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రం ఆమోదించిన కోస్టల్ కారిడార్ ప్రాజెక్టుకు ఇప్పటివరకు భూసేకరణ కూడా చేపట్టలేదని నిపుణుల కమిటీ నివేదిక వెల్లడించింది. ప్రయాణికులకు రవాణా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పలు జాతీయ పత్రికలు కథనాలు ప్రచురించాయి.