ATP: జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్‌పై అనంతపురం మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నగరానికి చెందిన ధనుంజయ భూవివాదం కేసు కోసం శ్రావణ్ కుమార్‌కు రూ. లక్ష ఇచ్చారు. అయితే, న్యాయవాది దావా వేయకపోవడంతో బాధితుడు డబ్బులు వెనక్కి అడిగారు. ఫోన్ పే ద్వారా 65 వేలు చెల్లించి మిగిలిన డబ్బులు ఇవ్వకుండా బెదిరించారని బాధితుడు ఫిర్యాదు చేశారు.