GNTR: అమరావతి రైతులు, కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో ప్రతి శనివారం నిర్వహించే “గ్రీవెన్స్ డే” నేడు రద్దు చేయబడింది. రెండో శనివారం, ఇతర నిర్వహణ కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రాజధాని ప్రాంత ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.