HYD: యాంకర్ అనసూయను సోషల్ మీడియాలో వేధించిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి, యూట్యూబ్, ట్విట్టర్లో అసభ్యకరంగా ప్రచారం చేసినట్లు నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి. ఐటీ యాక్ట్, BNS కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. IP అడ్రస్ ద్వారా అతడిని గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో మొత్తం 73 మందిని పోలీసులు గుర్తించడం గమనార్హం.