WGL: 15వ ఆర్థిక సంఘం నిధుల పెండింగ్ బకాయిల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా GPలకు రూ. 640 కోట్లు విడుదల చేసింది. ఇంతకుముందు రూ. 640 కోట్లు విడుదల చేయగా, తాజా విడతతో కలిపి 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం బకాయిల చెల్లింపులు పూర్తయ్యాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ. 1,255 కోట్లు ఇంకా కేంద్రం నుంచి రావాల్సి ఉందని సీతక్క అన్నారు.