సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న వినాయకసాగర్ చెరువు వద్ద గత రెండు రోజులుగా విద్యుత్ దీపాలు వెలగడం లేదు. దీంతో ప్రతిరోజు వ్యాయామం కోసం వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుందరీకరణకు నిధులు మంజూరైనా పనులు జరగడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరారు.