NRPT: మక్తల్ మండలంలోని కాచ్వార్ గ్రామంలో శనివారం నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్తది నిర్మిస్తున్నారు. గ్రామ అభివృద్ధికి మూలమైన పంచాయతీ భవన పనులను వేగవంతం చేయాలని గ్రామస్థులు కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేణుకాగణేశ్, కాంగ్రెస్ నేత గణేశ్ కుమార్ పాల్గొన్నారు.