TG: ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం విధుల్లో పాల్గొన్న వారికి ఇచ్చే గౌరవ వేతనాన్ని ప్రభుత్వం 25 శాతం పెంచింది. ఒక సమాధాన పత్రాన్ని దిద్దేందుకు ఇప్పటివరకు రూ. 23.66 చెల్లించగా.. ఇక నుంచి 29.57 ఇస్తారు. క్యాంప్ అధికారికి రోజుకు రూ. 800 ఇస్తుండగా.. రూ.వెయ్యికి పెంచారు. ఈ పెంపుతో 25 వేల మంది లబ్ది చేకూరనుంది.