GNTR: కృష్ణనగర్‌కు చెందిన పగడాల ప్రసాద్ బ్లింకిట్ యాప్ ఆర్డర్ రిటర్న్ చేసే క్రమంలో సైబర్ మోసగాళ్ల బారిన పడ్డారు. గూగుల్‌లో దొరికిన నంబర్‌కు కాల్ చేయగా, రిఫండ్ వస్తుందని నమ్మించి యూపీఐ ద్వారా ఆయన నుంచి రూ.84 వేలు కాజేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శుక్రవారం పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.