SRD: ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల 17న ఉదయం 9 గంటలకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఎంఈవో బండారి మనీలా తెలిపారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులు తమ ఒరిజినల్ బోనఫైడ్, జనన ధృవీకరణ పత్రం, ప్రోగ్రెస్ కార్డు, ఆధార్, కుల ధృవీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.