W.G: క్రీడలతో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ అలవడుతుందని ఎపీ స్పోర్ట్స్ అథారిటీ (SAAP) ఛైర్మన్ రవి నాయుడు అన్నారు. 12వ అంతర్ కళాశాలల స్పోర్ట్స్ మీట్‌ను శుక్రవారం తాడేపల్లిగూడెం (M) వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఆయన ప్రారంభించారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను క్రీడాకారులు వినియోగించుకోవాలన్నారు.
VZM: యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ కొరత ఏర్పడితే హోటల్ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని ఏపీ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. విజయనగరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్యాస్ సరఫరా లోపం, ధరల పెరుగుదలతో చిన్న హోటళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటాయని, పరిస్థితి ఇలానే కొనసాగితే హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని అన్నారు.
ELR: పాపికొండల అభయారణ్య పరిధిలోని గిరిజన గ్రామాల్లో బోరుబావులు, రహదారుల నిర్మాణానికి అటవీ అధికారులు అభ్యంతరం చెబుతున్నారని కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ వెట్రిసెల్వి సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. స్పందించిన సీఎం గిరిజనులకు కనీస వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, అటవీ అధికారులు కొంత వెసులుబాటు ఇవ్వాలని ఆదేశించారు.
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్‌లో 16వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 6 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. దాదాపు 650 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు.
అన్నమయ్య: రామాపురం మండలంలో ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షల ప్రమాద భీమా చెక్కులను టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహకారంతో పార్టీ జాతీయ కార్యాలయం నుంచి ఈ భీమా మంజూరైనట్లు మండల అధ్యక్షుడు గాలివీటి సురేందర్ రెడ్డి తెలిపారు.
BDK: దమ్మపేట మండలంలో పలు గ్రామపంచాయతీలలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నాచారం మారప్పగూడెం జగ్గారం పూసుకుంట గ్రామపంచాయతీల పరిధిలోని గ్రామాలలో రూ. 45.50 లక్షల వ్యయంతో నిర్మించబోయే సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
KDP: సినీ నటి అనసూయను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు చేసిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన జనార్ధన్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు, పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
WGL: రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర నిరుద్యోగ సమస్యపై, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలు ఆలస్యం పై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి శుక్రవారం ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. 99 రోజుల పాలనలో నిరుద్యోగుల గురించి ఆలోచించే సమయం లేదా అని ప్రశ్నించారు. 20 వేల పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
KRNL: కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శుక్రవారం తన నివాసంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి, ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను పరిశీలించి, కొన్నింటిని అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
PPM: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పథకం కింద 3వ విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. ఈ ఆర్థిక సాయాన్ని కేవలం దైనందిన అవసరాలకు కాకుండా, వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించాలన్నారు.
ADB: గ్యాస్ రీఫిల్లింగ్ గడువును 15 రోజుల నుంచి 20 రోజులకు పెంచామని.. దీంతో ఎలాంటి గ్యాస్ కొరత ఉండబోదని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. ప్రజలు అనవసరంగా భయాందోళనతో గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ కట్టవద్దని కోరారు. బుకింగ్ లేదా సరఫరలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఫిర్యాదుకై టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1939ను సంప్రదించాలి.
AP: రైతుల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. రైతు ఇబ్బంది పడకూడదనే అనేక రకాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు. ‘నేనూ రైతు బిడ్డనే.. వారి కష్టాలు నాకు తెలుసు. ఇప్పుడు ఒక్కో రైతుకు రూ.6 వేలు ఇస్తున్నాం. కేంద్రం రూ.6 వేలు ఇస్తే.. మేం రూ.14 వేలు ఇస్తున్నాం. రైతుల ఖాతాల్లో ఏటా రూ.20 వేలు జమ చేస్తున్నాం’ అని చంద్రబాబు వెల్లడించారు.
SDPT: హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో తండ్రి-కొడుకులు ఒకే బస్సులో విధులు నిర్వహించడం ప్రయాణికుల దృష్టిని ఆకర్షించింది. 34 ఏళ్లుగా ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న బంధనాపురం ఎల్లయ్య, ఆయన కుమారుడు ప్రేమ్ కండక్టర్‌గా సేవలందిస్తున్నారు. శుక్రవారం ఇద్దరూ ఒకే బస్సులో డ్యూటీ చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ఉత్తమ డ్రైవర్‌గా పలుమార్లు ఎల్లయ్య అవార్డు అందుకున్నారు.
ASR: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాడేరు పర్యటన ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. ఎస్పీ అమిత్ బర్దార్, జిల్లా అధికారులతో కలిసి ఓనూరు, నందిగరువు గ్రామాలను సందర్శించారు. అంగన్వాడీ సెంటర్, ఎంపీపీ స్కూల్లో పిల్లలతో కలిసి పవన్ కళ్యాణ్ ముచ్చటించే ప్రాంగణాన్ని పరిశీలించారు. అలాగే, నందిగరువులో ప్రజలతో జరిగే మాటామంతి సభా స్థలాలను పరిశీలించారు.