• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

10వ వార్డులో పర్యటించిన.. మున్సిపల్ ఛైర్మన్

WGL: నర్సంపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో శుక్రవారం మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెండం శ్రీలక్ష్మీ-రామానంద్, స్థానిక కౌన్సిలర్ శ్రీధర్‌తో కలిసి పర్యటించారు. వార్డులోని మట్టి రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్య వ్యవస్థను పరిశీలించారు. క్రమం తప్పకుండా చెత్త సేకరణ, పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

March 13, 2026 / 04:45 PM IST

గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ లైన్‌లో నిలబడ్డ ప్రజలు

ATP: గుత్తి పట్టణంలో రోజురోజుకు గ్యాస్ కష్టాలు పెరిగిపోతున్నాయి. గ్యాస్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద ప్రజలు సిలిండర్లతో శుక్రవారం క్యూలైన్‌లో నిలబడ్డారు. గ్యాస్ బుకింగ్ చేసుకున్న వారికి సెల్ ఫోన్‌కు ఓటీపీలు వస్తేనే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క గ్యాస్ సిలిండర్లు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

March 13, 2026 / 04:44 PM IST

మంత్రి నారాయణను కలిసిన బిట్స్ ప్రతినిధులు

AP: మంత్రి నారాయణను బిట్స్ ప్రతినిధులు కలిశారు. అమరావతిలో నిర్మించే భవనాల డిజైన్లను మంత్రికి చూపించారు. మందడం, వెంకటపాలెం మధ్య 70 ఎకరాల్లో బిట్స్ క్యాంపస్ నిర్మించనున్నారు. అమరావతిలో మూడు దశల్లో ఏఐ ప్లస్ క్యాంపస్‌గా బిట్స్ నిర్మాణం చేపట్టనున్నారు. రెండున్నరేళ్లలో మొదటిదశ అడ్మిషన్లకు సిద్ధం చేస్తామన్నారు. 

March 13, 2026 / 04:44 PM IST

‘మహిళను గౌరవిస్తే.. కుటుంబాన్ని గౌరవించినట్లే’

VZM: నాబార్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సర వేడుకలలో శుక్రవారం డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున పాల్గొన్నారు. 2026వ సంవత్సరంలో డీసీసీబీ ద్వారా మహిళలకు అవగాహన కార్యక్రమాలు, విధాన మార్పులు, పెట్టుబడుల ద్వారా మహిళా రైతులను బలోపేతం చేయడమే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. అలాగే, ఒక మహిళను గౌరవిస్తే, ఒక కుటుంబాన్ని గౌరవించినట్లేనన్నారు.

March 13, 2026 / 04:43 PM IST

ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన ఎమ్మెల్యే

BDK: దుమ్ముగూడెం మండలం చిన్న ఆర్లగూడెం, పెద్ద ఆర్లగూడెంలో విద్యుత్ శాఖ ద్వారా కొత్తగా మంజూరైన సింగిల్ ఫేస్ ట్రాన్స్‌ఫార్మర్ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల చిరకాల కోరిక నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా గ్రామాల్లో గృహ విద్యుత్ వినోగదారులు ఎదురవుతున్న సమస్యలు పరిష్కారం అయ్యింది.

March 13, 2026 / 04:43 PM IST

పారిశుద్ధ్య పనుల నిర్వహణ తీరును పరిశీలించిన RD

NLR:  పట్టణ పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ హరికృష్ణ కమిషనర్ వై. ఓ నందన్‌తో కలిసి శుక్రవారం నెల్లూరు నగరంలోని వివిధ ప్రాంతాలలో జరుగుతున్న పారిశుద్ధ్య పనుల నిర్వహణ తీరును పరిశీలించారు. ముందుగా స్థానిక బాలాజీ నగర్ అన్నపూర్ణ అపార్ట్‌మెంట్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన మొక్కల పెంపకం విధానాన్ని పరిశీలించారు. అనంతరం చిల్డ్రన్స్ పార్క్ ప్రాంతంలోని పంప్ హౌస్‌ను సందర్శించారు.

March 13, 2026 / 04:42 PM IST

‘ప్రభుత్వ నిర్ణీత రేట్లకే గేట్ వసూలు చేయాలి’

KDP: రాజంపేట పట్టణంలో ఫ్రూట్స్, కూరగాయల మార్కెట్లను నియోజకవర్గ ఇంఛార్జ్ జగన్ మోహన్ రాజు శుక్రవారం మున్సిపల్, పోలీస్ అధికారులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. చిరు వ్యాపారుల నుంచి అధికంగా గేట్ వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకే గేట్ వసూలు చేయాలని,లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 13, 2026 / 04:42 PM IST

ప్రజలు నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే ముప్పిడి

EG: కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వేంకటేశ్వరరావు శుక్రవారం పాల్గొన్నారు. ప్రజలు పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు, రెవెన్యూ సంబంధిత సమస్యలపై వచ్చిన మొత్తం 18 అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

March 13, 2026 / 04:41 PM IST

బైక్‌పై తిరుగుతూ సమస్యలు పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే

SS: గుడిబండలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేపట్టిన తాగునీటి సమస్యల పరిశీలన యాత్ర మూడవ రోజు శుక్రవారం కొనసాగింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన మండలంలోని పలు గ్రామాలు, తండాలు, ఎస్సీ కాలనీలను సందర్శించి ప్రజలతో మమేకమయ్యారు. మంచినీటి ఎద్దడిపై స్థానికులను స్వయంగా అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

March 13, 2026 / 04:41 PM IST

విద్యార్థులు ఎంత మంది గైర్హాజరు అంటే..!

కర్నూలు: జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 180 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రాంతీయ ఇంటర్ బోర్డు అధికారి లాలప్ప ఇవాళ తెలిపారు. 16,116 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 15,936 మంది హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పారు. పరీక్షలు పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.

March 13, 2026 / 04:38 PM IST

మహానందిలో అన్నదాత సుఖీభవ సాయం..!

NDL: మహానంది మండలంలో అన్నదాత సుఖీభవ మూడో విడత కింద 4,200 మంది రైతులకు లబ్ధి చేకూరనుందని ఏవో నాగేశ్వరరెడ్డి ఇవాళ తెలిపారు. మండలంలోని 13 గ్రామ పంచాయతీల రైతులకు రూ. 2.47 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4 వేలు,కేంద్రం నుంచి రూ.2 వేలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని అన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ఈ సాయం అందుతుందని ఆయన పేర్కొన్నారు.

March 13, 2026 / 04:38 PM IST

‘గ్యాస్ సమస్యపై కేంద్రంతో సమన్వయం చేసుకోవాలి’

AP: కేబినెట్‌లో అజెండా అంశాలు ముగిసిన తర్వాత వివిధ విషయాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. మంత్రులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని తెలిపారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని చెప్పారు. యుద్ధం ఎఫెక్ట్ పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్యాస్ సమస్యపై కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. MSMEలపై ప్రతినెలా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

March 13, 2026 / 04:37 PM IST

టెన్త్ పరీక్షా కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు: డీఎంహెచ్‌ఓ

సూర్యాపేట: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని 69 కేంద్రాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టరు పెండెo వెంకటరమణ తెలిపారు. సూర్యాపేటలో 41, కోదాడలో 28 కేంద్రాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థులు అల్పాహారం తీసుకుని, వెంట మంచి నీళ్ల బాటిల్ తెచ్చుకోవాలని సూచించారు.

March 13, 2026 / 04:36 PM IST

మొల్ల జీవితం నేటితరానికి ఆదర్శం: ఎమ్మెల్యే

ఏలూరు: ఎమ్మెల్యే బడేటి చంటి కవయిత్రి ఆతుకూరి మొల్ల జీవితం నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొల్లమాంబ జయంతి నిర్వహించారు. తెలుగులో ఉన్న రామాయణాల్లో మొల్ల రామాయణం చాలా సరళంగా ఉండి, సామాన్యులకు సులభంగా అర్థమయ్యే విధంగా రచించబడిందని ఆయన పేర్కొన్నారు.

March 13, 2026 / 04:36 PM IST

పదవ తరగతి పరీక్ష కేంద్రాలు తనిఖీ

CTR: పులిచెర్ల మండలం కల్లూరు, మంగలం పేటలోని పదవ తరగతి  పరీక్ష కేంద్రాలను శుక్రవారం ఎంఈవోలు సిద్ధరామయ్య, పోకల తాతయ్య తనిఖీ చేశారు. కల్లూరు పరీక్ష కేంద్రంలో 219 మంది, మంగళంపేట పరీక్ష కేంద్రంలో 90 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, గాలి, వెలుతురు, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు.

March 13, 2026 / 04:36 PM IST