• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తప్పుడు కథనాలపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఆశా వర్కర్లు

WGL: పర్వతగిరి మండలానికి చెందిన ఆశా వర్కర్లు తమపై నిరాధార ఆరోపణలతో వార్త ప్రచురించినట్లు ఆరోపిస్తూ సంబంధిత విలేకరులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ మేరకు వారు శుక్రవారం మండల రెవెన్యూ అధికారి, పోలీసు శాఖ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. ఆశ వర్కర్లు రుక్మిణి , శారద, విజయ తదితరులు పాల్గొన్నారు.

March 13, 2026 / 03:28 PM IST

‘జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి’

E.G: మార్చి 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని రాజీమార్గంలో కేసులను పరిష్కరించు కోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత శుక్రవారం కోరారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఈ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్‌ ద్వారా కేసులను త్వరగా పరిష్కరించుకోవడం ద్వారా విలువైన సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చన్నారు.

March 13, 2026 / 03:23 PM IST

తెలంగాణలో ఇంటర్ రద్దు.. కొత్త విద్యా విధానం!

TG: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విధానాన్ని రద్దు చేసి, నర్సరీ నుండి 12వ తరగతి వరకు పాఠశాల విద్య కిందకు తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు, ఉచితంగా లేదా 50% రాయితీతో రవాణా సౌకర్యం కల్పించనున్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విధానం ద్వారా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే ఈ మార్పు ప్రధాన లక్ష్యం అని తెలిపారు.

March 13, 2026 / 03:22 PM IST

IPL: పటిష్టంగా కోల్‌కతా నైట్ రైడర్స్..!

రహానే కెప్టెన్సీలోని KKR జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్రల విధ్వంసకర బ్యాటింగ్‌కు తోడు.. సునీల్ నరైన్, కామెరాన్ గ్రీన్ ఆల్‌రౌండర్లు జట్టుకు వెన్నెముకగా నిలవనున్నారు. మిడిలార్డర్‌లో రఘువంశీ, ఫినిషర్‌గా రింకూ ఉన్నారు. ఇక బౌలింగ్‌లో పతిరాణ, హర్షిత్, ఉమ్రాన్ మాలిక్, చక్రవర్తిలతో KKR లైనప్ తిరుగులేకుండా కనిపిస్తోంది.

March 13, 2026 / 03:22 PM IST

విద్యార్థులకు పరీక్షా కిట్లు పంపిణీ

సత్యసాయి: తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ దగ్గర ఉన్న గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా కిట్లు పంపిణీ చేశారు. ఈ నెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, వైసీపీ నేత బత్తల హరిప్రసాద్ ఆర్థిక సహకారంతో మాజీ సర్పంచ్ బత్తల వెంకటరమణ ఈ కిట్లను అందజేశారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉన్నత ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

March 13, 2026 / 03:21 PM IST

రాయదుర్గంలో HPV వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభం

ATP: రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

March 13, 2026 / 03:21 PM IST

80 ఏళ్ల రైతుపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

AP: గుంటూరు జిల్లా అత్తోట గ్రామ రైతు రోశయ్యపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్నారని కొనియాడారు. ’80 ఏళ్ల వయసులో కేవలం 75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ నెలకు రూ.20 వేలకు పైగా ఆర్జిస్తున్న రోశయ్య విజయగాధ స్ఫూర్తిదాయకం. 2016లో తీసుకున్న చర్యలతో ప్రేరణ పొంది రోశయ్య సాధిస్తున్న విజయాలు ఆదర్శం’ అని పేర్కొన్నారు.

March 13, 2026 / 03:21 PM IST

తిమ్మాపురంలో HPV వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం

NDL: మహానంది మండలం తిమ్మాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యువతులకు HPV వ్యాధి నిరోధక టీకాలు అందించారు. వైద్యాధికారి డా. భగవాన్ దాస్ ఆధ్వర్యంలో శుక్రవారం బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నిరోధక టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ అమీనాభి, ఫార్మసి ఆఫీసర్ శేఖర్ పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని, ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని సిబ్బందిని కోరారు.

March 13, 2026 / 03:21 PM IST

చిట్యాలలో వీధి కుక్కల వేట.. అడవికి తరలింపు

NLG: చిట్యాల మున్సిపాలిటీలో వీధి కుక్కల బెడదను నివారించేందుకు పాలకవర్గం కీలక చర్యలు చేపట్టింది. అన్ని వార్డుల్లో కుక్కల స్వైరవిహారంతో ప్రజలు భయాందోళన చెందుతున్న విషయాన్ని గుర్తించి, వాటిని పట్టించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. పట్టుకున్న కుక్కలను అటవీ ప్రాంతంలో వదిలేలా ఏర్పాట్లు చేశారు. గురు, శుక్రవారాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

March 13, 2026 / 03:20 PM IST

భానుడి భగభగలు.. సెగలు కక్కుతున్న రోడ్లు!

VKB: జిల్లాలో ఎండలు రోజురోజుకూ నిప్పులు చెరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కావడంతో ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అత్యవసర పనులుంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

March 13, 2026 / 03:18 PM IST

విశాఖలో మహిళా ‘జన సున్వాయి’ కార్యక్రమం

విశాఖ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం మహిళా ‘జన సున్వాయి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శైల‌జ‌ ముఖ్య అతిథిగా హాజరై వివిధ సమస్యలతో వచ్చిన మహిళల వినతులను స్వీకరించారు. వారి సమస్యలను విన్న అనంతరం సంబంధిత అధికారులకు పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పీడీ రామలక్ష్మి పాల్గొన్నారు.

March 13, 2026 / 03:17 PM IST

NMMSకి ఎంపికైన నెత్తం విద్యార్థి

CTR: 2025 డిసెంబర్ నెలలో జరిగిన ఎన్ఎంఎంఎస్ పరీక్షలలో నగరి మండలం నెత్తం కండ్రిగ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థి కే.దిలీప్ ఎంపిక అయ్యాడు. ఈమేరకు ఎంఈవోలు పీఎన్ శ్రీదేవి, నమశ్శివాయ ఇవాళ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టుదల, కృషి ఉంటే ఏమైనా సాధించవచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థిని ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

March 13, 2026 / 03:16 PM IST

‘బాల్యం జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుంటాయి’

MNCL: పాఠశాలకు, విద్యార్థికి విడదీయలేని అనుబంధం ఉంటుందని జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ అన్నారు. జన్నారం మండలంలోని పోన్కల్ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన వీడ్కోలు కార్యక్రమంలో శుక్రవారం ఆమె పాల్గొన్నారు. ఆడుతూ, పాడుతూ చదువుకునే దశ అందరికీ తీపి జ్ఞాపకాలను మిగులుస్తుందన్నారు.

March 13, 2026 / 03:16 PM IST

ఘనంగా మొల్ల జయంతి వేడుకలు

PPM: జిల్లా కేంద్రంలో కవయిత్రి ఆతుకూరి మొల్ల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొల్ల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

March 13, 2026 / 03:16 PM IST

ధాన్యాల నిల్వ కేంద్రానికి భూమిపూజ

MBNR: అడ్డాకుల మండల కేంద్రంలో రూ.30 లక్షల నిధులతో నిర్మించనున్న ఆహార ధాన్యాల నిల్వ కేంద్రానికి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఇవాళ భూమి పూజ చేశారు. అనంతరం స్థానిక PHCలో వైద్య శిబిరాన్ని సందర్శించారు. అలాగే ఎంపీడీవో కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

March 13, 2026 / 03:16 PM IST