సంస్కృతంలో వాల్మీకి రాసిన రామాయణాన్ని తెలుగులోకి అనువదించి రచించిన ఖ్యాతి కవయిత్రి మొల్లమాంబ దేనని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి అన్నారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మొల్లమాంబ జయంతి వేడుకలను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ వేడుకలలో ఆమె పాల్గొని మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
KRNL: అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడు, ప్రముఖ హరికథా విద్వాంసుడు తాటికొండ సాయిరాం (53) శుక్రవారం గుండెపోటుతో మరణించారు. కర్నూలు నగరంలో జన్మించిన ఆయన, తన తండ్రి గణేశ్ భాగవతార్ వద్ద విద్యను అభ్యసించారు. సనాతన ధర్మవ్యాప్తికై రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు పొందారు. ఆయన మృతిపట్ల హిందూ ధార్మిక సంఘాలు సానుభూతిని ప్రకటించాయి.
శ్రీకాకుళంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రముఖ కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఏఎస్పీ కేవి రమణ మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలు అభ్యున్నతి కోసం ఎన్నో రచనలు చేశారని అన్నారు. తెలుగు సాహిత్యానికి విశిస్టమైన సేవలు అందించిన తొలి తెలుగు తెలుగు కవయిత్రి అని అన్నారు.
శ్రీకాకుళంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రముఖ కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఏఎస్పీ కేవి రమణ మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలు అభ్యున్నతి కోసం ఎన్నో రచనలు చేశారని అన్నారు. తెలుగు సాహిత్యానికి విశిస్టమైన సేవలు అందించిన తొలి తెలుగు తెలుగు కవయిత్రి అని అన్నారు.
నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలోని ఎండబెట్లలో గో-వృషభ కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, సతీమణి డా.సరిత రెడ్డి ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే దంపతులు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గోపూజలో పాల్గొన్నారు.
TG: మావోయిస్టు పార్టీ చీలికకు ప్రధాన కారణం మల్లోజుల వేణుగోపాల్ అని మాజీ మావోయిస్టు దేవ్ జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. KCR, రేవంత్ పాలనపై విశ్లేషిస్తామన్నారు. కేశవరావు, హిడ్మా ఎన్‌కౌంటర్ల వెనక కోవర్డుల హస్తం ఉందని.. ఆపరేషన్ కగార్ మార్చి 31 లోగా ముగించడం అసాధ్యమని తేల్చి చెప్పారు. నిర్బంధం విధిస్తే అర్బన్ నక్సల్స్ రూపంలో మావోయిస్టు పార్టీ మళ్లీ పుడుతుందని పేర్కొన్నారు.
అనంతపురం కలెక్టరేట్‌లో భక్త కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ పూల నాగరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వడ్డే వెంకట్ మొల్లమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాన్య కుటుంబంలో జన్మించి రామాయణాన్ని తెలుగులో సరళంగా రచించిన ఆమె ప్రతిభ అసాధారణమని కొనియాడారు.
కృష్ణా: బాపులపాడు మండలంలో 6 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు MEO రాంబాల సింగ్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 440 మంది, ప్రైవేట్ పాఠశాలల నుంచి 449 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. బాపులపాడులోని ZP హైస్కూల్, సిద్ధార్థ విద్యాలయంతో పాటు వేలేరు, వీరవల్లి, కానుమోల, ఆరుగొలనులో ఏర్పాటు చేశారు.
NLG: తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్లమాంబ జయంతిని ఇవాళ చిట్యాల భవాని కుమ్మర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు తాడూరి చంద్రం, అధ్యక్షులు ఆరూరి సత్తయ్య, సలహాదారులు ఆరూరి శ్రీను, చంద్రశేఖర్, నరసింహ, శ్రీరాములు, బాలకృష్ణ, గిరి పాల్గొన్నారు.
GDWL: వైద్య సిబ్బంది సక్రమంగా విధులకు హాజరై గ్రామీణులకు వైద్య సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలి అని ఎల్కూర్ గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం మల్దకల్ మండలం ఎల్కూర్ గ్రామంలోని పల్లె బస్తీ దవాఖానను ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది లేకపోవడంతో మండల వైద్యాధికారిని సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
వేసవి ఎండల తీవ్రత వల్ల పిల్లలు డీహైడ్రేషన్‌కు గురికాకుండా రోజంతా తగినంత మంచి నీరు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు ఇస్తుండాలి. ముఖ్యంగా ఎండ ఎక్కువగా ఉండే ఉ.10 నుంచి సా.4 గంటల వరకు పిల్లలను బయట తిరగనివ్వకూడదు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే టోపీ లేదా గొడుగు వాడాలి. ఆయిల్ ఫుడ్ కాకుండా పెరుగు, మజ్జిగ వంటి చలువ చేసే ఆహారాన్ని అందించడంతో వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
NZB: ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి హత్యకు గురైన ఇమ్మడి గోపి హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇందులో మేనల్లుడు సతీష్‌తో పాటు శ్రీధర్, రవి, ప్రశాంత్, దేవేందర్, మరో వ్యక్తిని శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
CTR: పూతలపట్టు నియోజకవర్గంలో ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.19.27 కోట్లు జమ చేయనున్నట్లు ఏవో మధురవాణి తెలిపారు. ఈ పథకం ద్వారా 33,881 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. మండలాల వారీగా ఐరాలకు రూ.3.62 కోట్లు, యాదమరికి రూ.3.37 కోట్లు, బంగారుపాళ్యానికి రూ.5.14 కోట్లు, పూతలపట్టుకు రూ.3.46 కోట్లు, తవణంపల్లెకు రూ.3.67 కోట్లు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినృసింహుడి సన్నిధిలో శుక్రవారం ఉదయం లక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. స్వయంభూ మూర్తులను నిజాభిషేకం అనంతరం పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించారు. స్వామి, అమ్మవార్లకు లక్ష నామ స్తోత్రాలతో కుంకుమార్చనను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
GNTR: రాజధాని అమరావతిలో ఉండవల్లి వద్ద బకింగ్ హామ్ కెనాల్‌పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులను మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించారు. కాంట్రాక్టు సంస్థలు తెలిపిన ప్రకారం.. ఈ నెలాఖరులోగా బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అని తెలిపారు. ఈ బ్రిడ్జ్ వాహనదారులకు ఎంతగానో ఉపయోగ పడుతుందని మంత్రి అన్నారు.