కృష్ణా: మోపిదేవి(M) పెదప్రోలు గ్రామపంచాయతీలో ఇంటి, కుళాయి పన్నుల సమస్యలపై గ్రామస్తులు ఆందోళనలో ఉన్నారు. గతేడాది పన్నులు చెల్లించినప్పటికీ, ఈ ఏడాది ప్రభుత్వం చేపట్టిన స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో ఇంటి, నీటి పన్నుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామంలో పలు సమస్యలపై PGRSలో ఫిర్యాదు చేసిన పరిష్కారం లేదన్నారు.
VZM: మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో గంట్యాడ హైస్కూల్‌ని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ పాణి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గురువారం హెచ్ఎంతో సమావేశమయ్యారు. విద్యార్థులకు తాగునీరు, ఫర్నిచర్, విద్యుత్ సౌకర్యం వంటి ఏర్పాట్లు పూర్తిస్థాయిలో ఉండాలని, పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని సూచించారు.
KMM: ముస్లీం సోదరులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ రంజాన్ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం తుమ్మలగడ్డ ఇఫ్తార్ విందులో చెప్పారు. షాదీ ఖానా, ఖబరస్థాన్‌లు ఏర్పాటులో మత పెద్దల సూచనలు ప్రకారం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అబుదాబిలో ఎంతో నిష్టగా భారతీయ ముస్లీంలు రంజాన్ మాసం పాటిస్తున్న విషయం చూశానని చెప్పారు.
GNTR: ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా, వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమమే ‘మన మిత్ర–వాట్సాప్ గవర్నెన్స్’ అని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ సేవల ద్వారా ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే తమ మొబైల్ ఫోన్లలోనే సేవలను పొందవచ్చని పేర్కొన్నారు.
AP: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం తాడువాయిలో పెద్దపులి కలకలం రేపింది. మేత మేస్తున్న గేదె దూడపై అకస్మాత్తుగా పులి దాడి చేసింది. గ్రామానికి సమీపంలో పెద్దపులి సంచరిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. అటవీ ప్రాంతం వైపు ఎవరూ వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ATP: గుత్తి మండలం ఎంగిలిబండ గ్రామ సమీపంలో అక్రమంగా నిల్వ వుంచిన రేషన్ బియ్యం స్థావరంపై పోలీసులు గురువారం రాత్రి మెరుపు దాడులు చేశారు. ఎస్సై సురేష్ మాట్లాడుతూ.. రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులను నిర్వహించామన్నారు. సుమారు 130 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.
ప్రకాశం: ఈ నెల 16వ తేదీ నుంచి పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు కంభం మండల ఎంఈఓ సత్తార్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయని చెప్పారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్న పాఠశాలలో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తామని ఎంఈఓ తెలిపారు.
E.G: నిడదవోలు మండలం కోరుమామిడిలో సైబర్ నేరాలు, జూదం నియంత్రణ, LHMS వ్యవస్థపై గురువారం రాత్రి అవగాహన సమావేశం నిర్వహించారు. CI పి.వి.జి తిలక్ ఆధ్వర్యంలో SI బాలాజీ సుందర్రావు గ్రామస్థులకు సైబర్ మోసాలపై జాగ్రత్తలు సూచించారు. మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని, అలాగే ఊరు వెళ్లేటప్పుడు LHMS యాప్ వాడాలని కోరారు.
CTR: విజయపురం(మం) శ్రీహరిపురం, జంబడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్ పర్యవేక్షకులు శ్యామల ఆధ్వర్యంలో బాల్య వివాహలపైన అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. చిన్న వయస్సులో పెళ్లి చేసుకొని జీవితాలను నాశనం చేసుకోరదని, పొక్సో, శిశు లింగ నిర్దారణ చట్టాలపైన శ్యామల అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసలు, దొరస్వామి పాల్గొన్నారు.
AKP: కసింకోట మండలంలో ఇప్పటివరకు రూ.2.61 కోట్లు పైగా ఇంటి పన్నుల వసూళ్లు చేసినట్లు కసింకోట ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. గురువారం తేగాడ, జోగారావుపేట, బయ్యవరం గ్రామాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇంటి పన్నుల వసూళ్లు చేసామన్నారు. మొత్తం డిమాండు రూ.3.67 కోట్లు ఉందన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి అవగాహన కల్పిస్తున్నామన్నారు.
ASR: అన్నదాత సుఖీభవ పధకం 3వ విడతలో అనంతగిరి మండలంలో 8257 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఎంఏవో రంగారావు గురువారం తెలిపారు. 8257 మంది రైతులకి అన్నదాత సుఖీభవ పథకం 3వ విడతలో రూ. 4000, 22వ విడత పీఎం కిసాన్ పథకం కింద రూ. 2,000 లబ్ధి వారి ఖాతాలకు జమ అవుతుందన్నారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పధకాల కింద మండలానికి మొత్తం రూ.4.95 కోట్ల లబ్ధి అందుతుందన్నారు.
NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేపు మండలంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. సుమారు రూ.18 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్లు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు దుబ్బ కాల్వలో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని MLA ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మండల నాయకులు పాల్గొన్నారు.
SRPT: మోతే మండలం భీక్యాతండాలో ఈరోజు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని మోతే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన అన్నారు.
VZM: ఎస్.కోట నుంచి విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్ళడానికి కొత్తవలస ప్రధాన బస్సు స్టాప్‌లో చెయ్యి ఎత్తిన బస్సులు ఆపడం లేదని ఈనెల 9న, హిట్ టీవీలో కథనం వెలువడిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ కథనానికి ఎస్.కోట డిపో ప్రబంధకుడు సుదర్శనరావు స్పందించి ప్రధాన బస్ స్టాప్‌లో ప్రత్యేక సిబ్బందిని గురువారం నియమించారు. సిబ్బంది నియమించడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.
AP: గతంలో చెప్పిన అబద్ధాలనే జగన్ మళ్లీ చెప్పారని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. YCP హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని కాగ్ స్పష్టం చేసిందన్నారు. వాళ్లు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని తమపై నెట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. బాధితుల్ని నిందితులుగా చిత్రీకరించడం జగన్ మార్క్ రాజకీయాలని ఆరోపించారు. నెట్ బారోయింగ్‌ను కూటమి ప్రభుత్వం ఎక్కడా అధిగమించలేదన్నారు.