• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఈరోజు ప్రజా వినతి కార్యక్రమం

BPT: రేపల్లె టీడీపీ కార్యాలయంలో ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు టీడీపీ అధ్యక్షుడు సూర్యరాజు తెలిపారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

March 13, 2026 / 07:42 AM IST

వామ్మో.. HYDలో భారీగా పెరిగిన అల్పాహార ధరలు

HYD: గ్యాస్ కొరత నగరవాసుల జేబు ఖాళీ చేస్తోందని పలువురు వాపోతున్నారు. నిజాంపేట్లోని ఓ హోటల్ వద్ద ‘గ్యాస్ సిలిండర్ షార్టేజ్ అన్ని ఐటమ్స్ మీద రూ.20 అదనం’ అని రాసిన ఉన్న ఫొటో SMలో వైరల్ అవుతోంది. రూ.40 ఉండే టిఫిన్‌పై పెంచిన ధర 50% కావడం గమనార్హం. నగరవ్యాప్తంగా చాయ్ మీద రూ.5 పెంచినట్లు నిర్వాహకుల చెబుతుండటం ధరల పెరుగుదల తీవ్రతను తెలియజేస్తోంది.

March 13, 2026 / 07:41 AM IST

విద్యార్థులు లక్ష్యాలను చేరుకోవాలి: ఎమ్మెల్యే

MBNR: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత కల్పిస్తుందని గురువారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. డోకూర్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన సెల్ఫ్ గవర్నమెంట్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలోనే విద్యలో తెలంగాణను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు.

March 13, 2026 / 07:41 AM IST

LPG గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు

NLG: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో నల్గొండ జిల్లాలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని జిల్లా కలెక్టర్ బీ. చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హెచ్పీసీఎల్, ఐవోసీఎల్, బీపీసీఎల్ కంపెనీలు LPG గ్యాస్‌ను సరఫరా చేస్తున్నాయని తెలిపారు.

March 13, 2026 / 07:41 AM IST

జనజీవన స్రవంతిలో కలిసిపోయిన మావోయిస్టులు

BDK: వివిధ క్యాడర్లో పనిచేస్తూ లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు గురువారం రూ.62,50,0000 విలువ గల చెక్కులను ఎస్పీ రోహిత్ రాజు, అడిషనల్ ఎస్పీ నరేందర్ అందజేశారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో స్వార్థ ప్రయోజనాలతో మావోయిస్టు నాయకులు అమాయక ఆదివాసీలను బలవంతంగా పార్టీలో చేర్చుకుని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేలా చేస్తున్నారని ఎస్పీ చెప్పారు.

March 13, 2026 / 07:40 AM IST

గ్యాస్‌పై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

ATP: గ్యాస్ సిలిండర్ల కొరత, ధరల పెరుగుదలపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను నమ్మవద్దని SP జగదీష్ సూచించారు. అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రూపుల్లో ఫేక్ న్యూస్ షేర్ చేసే అడ్మిన్లపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు నివేదించాలని కోరారు.

March 13, 2026 / 07:40 AM IST

గ్యాస్ బుకింగ్ మోసాలపై జాగ్రత్త: ఎస్పీ

BPT: గ్యాస్ కొరత ఉందని ప్రచారం చేస్తూ సైబర్ నేరగాళ్లు గ్యాస్ బుకింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని బాపట్ల ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఆన్‌లైన్‌లో బుకింగ్ కోసం వెతికే వారే లక్ష్యమని, అనుమానాస్పద లింకులు, కాల్స్‌పై నమ్మకం పెట్టుకోవద్దని సూచించారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 13, 2026 / 07:40 AM IST

కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

WGL: న్యూఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నర్సంపేట డివిజన్ పరిధిలోని పలు రహదారులకు అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆయనను కోరారు. అలాగే డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న నేషనల్ హైవే రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

March 13, 2026 / 07:40 AM IST

కల్తీ పెరుగు తయారీ.. ఇద్దరు అరెస్ట్

TG: హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని రహత్‌నగర్‌లో పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. 2,500 కేజీల కల్తీ పెరుగుతో పాటు.. పెరుగు తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలు సీజ్ చేశారు. NR ఎంటర్‌ప్రైజెస్ పేరుతో 6 నెలలుగా కల్తీ పెరుగు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో నరేష్, రాఘవేంద్ర అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

March 13, 2026 / 07:40 AM IST

‘బిర్యానీలో బొద్దింక.. రూ.15 వేల ఫైన్’

SDPT: హయత్ రెస్టారెంట్‌లో భోజనంలో బొద్దింక కనిపించిందని ఫిర్యాదు వచ్చింది. దీంతో మున్సిపల్ శానిటరీ సూపర్వైజర్ శ్రీకాంత్, Slలు శివకుమార్, సత్యనారాయణ, EE అన్వేష్ హయత్ హోటల్ కిచెన్ను తనిఖీ చేశారు. వారు రూ. 15,000 జరిమానా విధించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు.

March 13, 2026 / 07:38 AM IST

నేడు పీఎం కిసాన్ నగదు జమ

చిత్తూరు జిల్లాలో ‘పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ’ పథకం నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. 2,05,753 మంది రైతు కుటుంబాలకు రూ.115.81 కోట్లు వారి బ్యాంకు ఖాతాలకు జమ కానున్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.

March 13, 2026 / 07:35 AM IST

ఘనంగా ముత్యమాంబ అమ్మవారి పండగ

AKP: సబ్బవరం మండలం అంతకాపల్లిలో గ్రామ దేవత ముత్యమాంబ అమ్మవారి పండగను గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు అర్చనలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు అర్చనలు నిర్వహించారు.

March 13, 2026 / 07:35 AM IST

తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు: జిల్లా SP

BHPL: అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి నిత్యావసర సరుకుల కొరత ఏర్పడుతుందనే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని BHPL ఎస్పీ సంకీర్త్ హెచ్చరించారు. దళారులు, కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముతున్నారని, అలాంటి అక్రమ నిల్వలు, ధరల ఎగబాకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

March 13, 2026 / 07:35 AM IST

నేడు ఎలమంచిలి మున్సిపాలిటీ చివరి సమావేశం

AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ కౌన్సిల్ చివరి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు. ఈనెల 17తో పాలకవర్గం పదవీకాలం ముగినున్న నేపథ్యంలో ఇది చివరి సమావేశం కానుంది. మున్సిపల్ ఛైర్ పర్సన్ పిల్లా రమాకుమారి అధ్యక్షతన మధ్యాహ్నం 3:30 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది.చివరి సమావేశంలో 21 అంశాలపై చర్చ జరగనుంది.

March 13, 2026 / 07:34 AM IST

గడ్డి మందును నిషేదించాలని కేంద్రమంత్రి కోరిన ఎంపీ

KMM: అనేక అనర్థాలు, ఆత్మహత్యలకు కారణమవుతున్న గడ్డిమందును నిషేధించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. గురువారం ఢిల్లీలో మంత్రిని కలిశారు. విషపూరిత మందు వల్ల ప్రాణనష్టం జరుగుతోందని వివరించారు. ఇప్పటికే పలు దేశాలు దీన్ని నిషేధించాయన్నారు.

March 13, 2026 / 07:33 AM IST